DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్ధేశిత సమయంలో నవశకం సర్వే పూర్తి చేయాలి

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పింఛన్లు :

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌):

 à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚లో అమలు చేస్తున్న నవశకం సర్వే సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని అన్నారు. నవశకంపై జిల్లా కలెక్టర్లతో ప్రధాన

కార్యదర్శి వీడియో కాన్ఫరెన్సును శుక్రవారం నిర్వహించారు. నవశకం సర్వే నిర్ధేశిత సమయంలో పూర్తి చేయాలని డేటా వెంటనే తాజా పరచాలని అన్నారు. డేటా ఎంట్రీ వేగవంతం

చేయాలని ఆదేశించారు. సచివాలయ ఉద్యోగుల ఖాళీలను త్వరితగతిన భర్తీ చేయాలని ఆదేశించారు. సచివాలయ భవనాలు ఏర్పాటు చేసి ఇంటర్నెట్ కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని

ఆదేశించారు. ఉగాది నాటికి ఇళ్ళ స్ధలాల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. భూ సేకరణ అవసరాలను గుర్తించాలని అన్నారు.
          à°ˆ వీడియో కాన్ఫరెన్సులో

జిల్లా కలెక్టర్ జె నివాస్, జాయింట్ కలెక్టర్ డా.కె.శ్రీనివాసులు, రెవిన్యూ డివిజనల్ అధికారి ఎం.వి.రమణ, డి.ఆర్.డి.ఏ ప్రాజెక్టు డైరక్టర్ ఏ.కళ్యాణ చక్రవర్తి, జిల్లా

పంచాయతీ అధికారి వి.రవి కుమార్, జిల్లా నీటియాజమాన్య సంస్ధ ఏపిడి పి.రాధ తదితరులు పాల్గొన్నారు.

తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పింఛన్లు :

రాష్ట్ర

ప్రభుత్వం అమలు చేస్తున్న నవ శకం కార్యక్రమంలో భాగంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారికి పింఛన్ల రూపంలో ఆర్ధిక సహాయం అందించుటకు ప్రభుత్వం చర్యలు

చేపడుతోందని జిల్లా కలెక్టర్ జె నివాస్ అన్నారు. ప్రభుత్వం సూచించిన మేరకు తలసేమియా మేజర్,సికిల్ సెల్ ఎనీమియా,సివియర్ హీమోఫీలియా, బైలేటరల్ ఎలీఫాన్టియాసిస్

(బోదకాలు) - గ్రేడ్ 4, నడవలేని స్థితిలో గల పేరాలిసిస్ (పక్షవాతం), ప్రమాదం కారణంగా మంచం పట్టినవారు మరియు అన్ని కండరాలు బిగుసుకు పోవడం వలన మంచం పట్టినవారు, 3,4,5 దశల్లో

ఉన్న కిడ్నీ రోగులు – మూడు నెలల సమయంలో సీరం క్రియాటిన్ 5 à°Žà°‚.జికి పైబడి కనిపించడం, సోనో గ్రాఫిక్ పరీక్షలలో 8 సెం.మీ కంటే తక్కువగా కిడ్నీ పరిమాణం ఉన్నట్లు

ధృవపడినవారు, జి.ఎఫ్.ఆర్ 15 ఎం.ఎల్. కంటే అధికంగా ఉన్న వ్యాధిగ్రస్తులు; లెప్రసి వలన బహుళ అవయవాల లోపం కలిగిన వారు., వై యస్ ఆర్ ఆరోగ్య శ్రీ క్రింద కిడ్నీ, కాలేయం, గుండె

ట్రాన్స్ ప్లాంటేషన్ జరిగినవారికి పింఛను వర్తింపజేయుటకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని చెప్పారు. సంబంధిత వ్యాధులకు సంబంధించిన వ్యక్తుల జాబితాలు

సేకరించాలని ఆసుపత్రులను ఆదేశించామన్నారు. జాబితాలో ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులైన అభ్యర్థులను గుర్తించాల్సి ఉందని అన్నారు. అర్హత కలిగిన

వ్యక్తులు తమ పేర్లను తమ సమీపంలోగల ప్రాథమకి ఆరోగ్య కేంద్రం, సామాజిక ఆరోగ్య కేంద్రంలో నమోదు చేసుకోవాలని  à°¸à±‚చించారు. అర్హులైన వ్యక్తుల ఆధార్, బ్యాంకు ఖాతాల

నంబర్లతో సహా సమర్పించాలని స్పష్టం చేసారు. మీ సేవా కేంద్రాల ద్వారా నమోదు చేసుకునే అవకాశాన్ని పరిశీలిస్తున్నామని ఇందుకు ఒక సాప్ట్ వేర్ రూపొందించుటకు

ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నవశకంలో భాగంగా క్షేత్ర స్ధాయి పరిశీలన ముమ్మరంగా సాగుతుందని అన్నారు. అమ్మ ఒడి జనవరి 9వ తేదీన అమలుచేస్తున్నారని, ప్రజలు

వాలంటీర్లకు సహకరించి సమాచారం అందించాలని కోరారు. అర్హత ఉండి ఇప్పటి వరకు లబ్దిదారులుగా చేరని వారిని ఇందులో చేర్చడం జరుగుతుందని వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam