DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యార్ధుల ఐఐటి కల మోషన్‌ అకాడమీ తో నెరవేరాలి : హరిబాబు 

విశాఖ లో à°°à°¾à°œà°¸à±à°¥à°¾à°¨à± వారి à°®à±‹à°·à°¨à± ఐఐటి అకాడమీ à°ªà±à°°à°¾à°°à°‚à°­à°‚

విశాఖపట్నం, జూన్‌ 15, 2018 (DNS Online) : విద్యార్థి దశ లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ( ఐఐటి) లాంటి ఉన్నత

విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ చెయ్యాలి అనే ప్రతి విద్యార్థి కల మోషన్ ఐఐటి అకాడమీ ద్వారా నెరవేరాలి అని విశాఖపట్నం లోక్ సభ సభ్యులు డాక్టర్ కె. హరిబాబు

పిలుపునిచ్చారు. శుక్రవారం నగరం లోని ఆసీలు మెట్ట లో ప్రారంభమైన మోషన్ ఐఐటి అకాడమీ కళాశాల లో జరిగిన ప్రారంభోత్సవ సభలో అయన ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భం

గా అయన మాట్లాడుతూ ఇటీవల కాలం లో ఐఐటి ల్లో చదవాలి అనే కల విద్యార్థుల కంటే వారి తల్లిదండ్రుల్లో బలంగా ఉందన్నారు. దేశం లోని అత్యున్నత ప్రతిష్ఠాత్మక

విద్యాసంస్తల్లో ప్రవేశానికి జరుగుతున్నా పోటీ పరీక్షల్లో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన విద్యార్థులే అత్యధికంగా ఎంపిక అవుతున్నారని, విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల

విద్యార్థుల ఐఐటి à°•à°² కూడా నెరవేర్చాలని విశాఖ లో ప్రారంభమైన మోషన్ ఐఐటి అకాడమీ రానున్న కాలంలో అత్యున్నత ఫలితాలు సాధించాలని పిలుపునిచ్చారు. 

ఒత్తిడి లేని

విద్య అందించండి : డాక్టర్ జి ఎస్ ఎన్ రాజు
తీవ్రమైన ఒత్తిళ్ల మధ్య జరుగుతున్న నేటి విద్య విద్యానంలో విద్యార్థులు మానసికంగా కృంగి పోతున్నారని, వాటికీ దూరంగా

ఒత్తిడి లేని విద్యను అందించాలని మోషన్ యాజమాన్యాన్ని ఆశీర్వదించారు. గత కొన్ని ఏళ్లుగా ఆంధ్ర ప్రదేశ్ లో ఇంజనీరింగ్, మెడిసిన్ అంటే కేవలం రెండు సంస్థలే అనే

మూఢ విశ్వాసం లో తల్లిదండ్రులు మునిగిపోతున్న తరుణం లో కోట రాజస్థాన్ కు చెందిన ప్రతిష్ఠాత్మక విద్య సంస్థ విశాఖ లో తమ శాఖను ప్రారంభించడం అభినందనీయమన్నారు.

పోటీ తత్త్వం మితిమీరి ఉండరాదని, దానికి పరిమితి ఉందనే విషయం విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు తెలియచేయాల్సిన అవసరం ఉందన్నారు. 

ఉత్తమ ఫ్యాకల్టీ తో

మెరుగైన ఫలితాలు : డాక్టర్ జి నాగేశ్వర రావు 

విద్య అనేది వాణిజ్యం కాదని, విద్యార్ధుల అభివృద్ధి కోసమే అనే నినాదంతో ప్రారంభమైన మోషన్ సంస్థ లో ఉత్తమ

ఫ్యాకల్టీ ద్వారా విద్యను అందించినట్టయితే విద్యార్థులు మంచి విద్యావంతులుగా తయారవుతారని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి. నాగేశ్వర రావు పిలుపు

నిచ్చారు. పోటీ తత్త్వం తో ఫలితాల మాట ఎలా ఉన్న మానసికంగా విద్యార్థులు ఇబ్బంది పడతారన్నారు. విద్య సంస్థా ద్వారా మంచి ఫలితాలు సాధించాలి అని

ఆశీర్వదించారు. 

పోటీ ప్రధానం కాకూడదు  : ఆడారి కిషోర్ కుమార్ 

విద్య విధానం లో విద్యార్థి భవిష్యత్తే ప్రధానంగా ఉండాలి తప్ప, పోటీ ప్రధానం కాకూడదని,

స్టూడెంట్ జె ఏ సి రాష్ర అధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్ పిలుపునిచ్చారు. మోషన్ ఐఐటి అకాడమీ యాజమాన్యం అంతా యువకులతోనే ఉన్నందున, ఉత్తమ ఫలితాలు సాధించగలరని

నమ్మకం తల్లిదండ్రులకు కలుగుతుందన్నారు. ఆధునిక విద్య విధానం లో వస్తున్నా మార్పులకు అనుగుణంగా విద్యను అందించాలని, ఒత్తిడి లేని విద్య ను ఇవ్వాలని

కోరారు. 

విద్యార్థుల భవిష్తతే ప్రధానం : విశాఖ హెడ్ ప్రవీణ్ కుమార్ 

రాజస్ధాన్‌ లోని కోటా నగరంలో స్ధాపించిన మోషన్‌ విద్యా సంస్థ ఐఐటి -  à°œà±†à°‡à°‡, మెడికల్‌.

à°ˆ విద్యా సంస్ధ ద్వారా వేలాది మంది విద్యార్ధినీ విద్యార్ధుల ఐఐటి ` జెఇఇ లోను. మెడికల్‌ పరీక్షల్లోను అత్యద్భుతమైన ఫలితాలు అందించి దేశంలోనే అత్యుత్తమ స్ధానంలో

నిలిచిందని మోషన్‌ విశాఖ కేంద్రం డైరక్టర్‌ కాండ్రేగుల ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. విద్యార్ధులకు ఎటువంటి ఒత్తిడి
లేకుండా ఆధునిక సౌకర్యాల ద్వారా విద్యను

నేర్పించడమే à°ˆ మోషన్‌ ఐఐటి అకాడమీ సంస్ధ విజయరహస్యమన్నారు. ఐఐటి శిక్షణా విద్యా విధానంలో డిజిటల్‌ స్కీన్స్‌ ద్వారా శిక్షణ ఇచ్చే మొట్టమొదటి సంస్ధ మోషన్‌

ఆకాడమీ అని తెలిపారు. విశాఖ కేంద్రంగా à°ˆ సంస్ధ శాఖను పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నామని, ప్రధానంగా డే స్కాలర్ల కోసం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఏర్పాటు

చేయడం జరిగిందని, ఉత్తరాంధ్రా జిల్లా విద్యార్ధుల కోసం రెసిడెన్షియల్‌ విద్యా సౌలభ్యం నెకోల్పామని, వాటిల్లో బాలురకు , బాలికలకు వేర్వేరుగా ఏర్పాటు

చేసామన్నారు. ప్రతీ తరగతిలోను కేవలం 40 మంది విద్యార్ధులు మాత్రమే ఉంటారని, ఆ పైబడిన విద్యార్ధుల కొరకు మరో తరగతి గది లో శిక్షణ అందించడం జరుగుతుందని వివరించారు.

రోజుకు కేవలం 6 నుంచి 8 గంటల సమయం మాత్రమే విద్యా విధానం అమలు లో ఉంటుందని, ప్రతీ వారం నిర్వహించే వారాంతపు పరీక్షల ద్వారా విద్యార్ధి పోరాట పటిమ, విద్య ప్రతిభను

గమనించి, వారికి ప్రత్యేక శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు. కేవలం డిజిటల్‌ విద్యా విధానం ద్వారా నిర్వహించే తరగతి విద్యా విధానం అత్యుత్తమ ఫలితాలను

సాదించడం జరిగిందన్నారు. గత ఏడాది తమ మాతృ సంస్ధ ద్వారా శిక్షణ పొందిన 68 శాతం విద్యార్ధు ఐఐటి కి అర్హత సాధించారన్నారు. ఉత్తరాంధ్రా, జిల్లాల నుంచి వంద సంఖ్యలో

రాజస్ధాన్‌ లోని కోటా నగరానికి వెళ్ళి మోహన్‌ అకాడమీ లో చేరి, ఉత్తమ ఫలితాలు సాధించారని, వీరందరిని లక్ష్యాన్ని దృష్టి లో ఉంచుకుని విశాఖ నగరంలోనే పలు శాఖ ను

ప్రారంభించాలని అని మోషన్‌ విద్యా సంస్ధ సంకల్పించి ఇక్కడ పలు శాఖను ఏర్పాటు చేసిందని వివరించారు. à°ˆ శాఖల్లో డే స్కాలర్లకు, రెనిడెన్షియల్‌ విద్యార్ధులకు

వేర్వేరు క్యాంపస్‌లు ఏర్పాటు చేసామన్నారు. బాలురకు , బాలికలకు సైతం ప్రత్యేక క్యాంపస్‌ ను నెల కొల్పడం జరుగుతొందన్నారు. 
రాజస్ధాన్‌ ఫ్యాకల్టీ తోనే శిక్షణ :

మోషన్‌ అకాడమీ కేంద్ర కార్యాలయం కోటా నుంచి వచ్చిన అత్యుత్తమ అధ్యాపకులచే విశాఖ కేంద్రంలోని శాఖల్లో తరగతుల నిర్వహించబడతాయని తెలిపారు. వీరికి అదనంగా

సీనియర్‌ ఐఐటి శిక్షకులు ఉండి, ఒక్కొ పాఠ్యాంశానికి ఇద్దరు నుంచి, ముగ్గురు అధ్యాపకులచే తరగతులు జరుగుతాయన్నారు. 

కార్యక్రమం లో కళాశాల ప్రతినిధులు,

అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam