DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నీ బిడ్డని నమ్మి మోసపోయాం .. రాజన్నా: తెలుగు దండు ఆవేదన

అమ్మభాషను ఆంగ్లానికి తాకట్టు పెట్టేస్తారా 

అందరూ అమెరికాయే పోవాలా?

తెలుగు రక్షణ కై తెలుగు దండు ఉద్యమం.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): .

. .

విశాఖపట్నం, డిసెంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): మోసపోయాం రాజన్నా అంటూ తెలుగు భాషాభిమానులు, కళాకారులు, కవులు, విద్యావేత్తలూ, విద్యార్థులు, తెలుగు దండు ఆధ్వర్యవంలో

పెద్ద ఎత్తున నిరసనలు తెలియచేసారు. ఆదివారం విశాఖనగరం లోని జాతీయ రహదారి మద్దిలపాలెం కూడలి వద్దగల తెలుగు తల్లి విగ్రహం వద్ద ఆమెకు వినతి పత్రం సమర్పించి,

నిరసనలు తెలిపారు. ఈ సందర్బంగా తెలుగు దండు వ్యవస్థాపకులు పరవస్తు ఫణిశయన సూరి మాట్లాడుతూ సిద్దన్నన్ని కాలితో తన్ని, ఎంగిలి మెతుకులకు పరుగులు తీస్తున్న

తెలుగు జాతి అమాయకత్వానికి, మాతృ భాషను నాశనం చేయడానికి సిద్దమవుతున్న ప్రభుత్వాన్ని నిలదీయలేని తెలుగువాడి అమాయకత్వాన్ని చూసి ప్రపంచం నవ్వుతోందన్నారు.

ప్రపంచం ముందు మన తెలుగు జాతి పరువు పోతోందన్నారు. 

తెలుగు భాషాభిమానులు మాట్లాడుతూ చెప్పులు దానం చెయ్యాలంటే  à°†à°µà±à°¨à± చంపాలి అన్నట్టు మన బిడ్డలకు ఆంగ్లం

నేర్పాలి అంటే అమ్మ భాష తెలుగు ను దుంప నాశనం చేసే దుర్మార్గానికి ప్రభుత్వం ఒడికట్టిందన్నారు. ఇది క్షమించరాని నేరంగా అభివర్ణించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమైన

చర్య అన్నారు. 
కార్యక్రమం లో పాల్గొన్న కవులు, విద్య వేత్తలు మాట్లాడుతూ ఆంగ్ల భాషను మన బిడ్డలకు అందించడాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదని, కానీ ప్రాధమిక దశలోనే

ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెట్టి తెలుగును à°’à°• పాఠ్యముషంగా భోదించడం వలన తెలుగు భాష పూర్తిగా నశించి పోయే  à°ªà±à°°à°®à°¾à°¦à°‚ ఉందన్నారు. అంతేగాక సరైన వసతులు, ఆంగ్లాన్ని

సరిగా భోదించే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు లేని కారణంగా మన విద్యార్థులు రెంటికీ చెడ్డ రేవడిగా తయారవుతారని, à°† పాపం ప్రభుత్వానిదేనన్నారు. 

తెలుగు దండు

ద్వారా ప్రభుత్వాన్ని గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, అమ్మ భాషకు అపకారం చెయ్యవద్దని విన్న వించుకుంటున్నామన్నారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ కళ్ళు తెరవాలని, ఇప్పడికైనా తన

నిర్ణయాన్ని సవరించుకుని అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల్లో ప్రాధమిక విద్యను మాతృభాషలోనే జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. 
ఆంగ్లాన్ని

ఒక పాఠ్యాంశం గా శిక్షణ పొందిన ఉపాధ్యాయుల తో నేర్పించాలని, ఆరవ తరగతి నుంచి దశల వారీగా ఆంగ్ల మాధ్యమాన్ని, తెలుగు మాధ్యమాన్ని అమలు చేసేయి, మాధ్యమం ఎంపిక

విద్యార్థులకే వదిలివేయాలని, నిర్బంధం చెయ్యకూడని డిమాండ్ చేసారు. 
రాజకీయాలతో తమకు సంబంధం లేదని, మాతృభాషా మనుగడకోసమే ఈ నిరసన చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పొతే సత్యాగ్రహం చేస్తామని, దానిని కూడా భగ్నం చేస్తే ప్రజా ఉద్యమం నిర్వహించి కోర్టు ద్వారా న్యాయం కోరతామని ప్రభుత్వాన్ని

హెచ్చరించారు. తెలుగు దండు నిరసన కార్యక్రమమ్ లో ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ బాల మోహన్ దాస్, జాతీయ పాత్రికేయసంఘం కార్యదర్శి,

విజెఎఫ్ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు, డాక్టర్ విశ్వేశ్వరం,  
శేఖరమంత్రి ప్రభాకర్, ప్రసాద్, అరుణ్ కుమార్, ఆనందరావు, ఉదయశ్రీ, తదితరులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam