DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల జోలికి వెళ్లొద్దు - తోలు వలిచి పోతుంది. 

క్రైస్తవులు హిందూ గుళ్ళనుంచి బయటకు పోవాల్సిందే. . . 

ఎవరైనా హద్దు మీరితే ఫలితం తీవ్రంగానే ఉంటుంది. 

హితవు వినకుంటే లక్షలాది గా రోడ్డెక్కి

ఉద్యమిస్తాం 

దోచేస్తున్న దేవాదాయ శాఖను రద్దు చెయ్యాల్సిందే. . . 

మా గుళ్ళల్లో మీ పెత్తనం ఏంటి? తక్షణం పోండి

ఆత్మ తప్పు చేస్తే అదుపు

చెయ్యాల్సిన భాద్యత దేహానికి కాదా ?  

స్వరూపానంద స్పందించకుంటే ఆశమం పై దాడి తప్పదు. . 

వైఎస్ జగన్ హిందువుగా మారానని మోసగించారు  . ..   

హిందూ

దేవాలయాల పరిరక్షణ సమితి హెచ్చరికలు 

రౌండ్ టేబుల్ సమావేశానికి భారీ స్పందన 

(DNS రిపోర్ట్ : BVS సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం ) : . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 05, 2019 (డిఎన్‌ఎస్‌): కోట్లాదిమంది హిందువుల ఆరాధ్య దైవమైన తిరుమల శ్రీనివాసునితో పరాచకాలాడి, క్రైస్తవులను మరింతగా పెంచాలని చూస్తే

తోలు వొలిచే పని ఆయనే చూసుకుంటాడని ఆంధ్ర ప్రదేశ్ సాదు పరిషత్ అధ్యక్షులు స్వామి శ్రీనివాసానంద సరస్వామి హెచ్చరించారు. గురువారం విశాఖపట్నం లోని పౌర

గ్రంధాలయంలో హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి ఆధ్వర్యవంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన పాలకులకు, పాలితులకు హెచ్చరికలతో

కూడిన సూచనలు చేసారు. à°ˆ భారత దేశం లో జీవించే హక్కు కేవలం మైనారిటీలకు కాదని,  à°•à±à°•à±à°•à°¿à°¨ పెనుల్లో ఉండిపోతున్న హిందువులకు కూడా జీవించే హక్కు ఉందన్నారు. అయితే

పాలకుల రాజకీయ పదవి కామం తో హిందువులకు తొక్కేసే పనే పెట్టుకున్నారన్నారు. 

ఆత్మ తప్పు చేస్తే అదుపు చెయ్యాల్సిన భాద్యత దేహానికి కాదా ? . . .

రాష్ట్రంలో

క్రైస్తవ మత ప్రచారం పెచ్చుమీరిపోయి ఏకంగా తిరుమల, అన్నవరం, సింహాచలం గుడి ప్రాంతాల్లోకే వెళ్ళిపోయి క్రైస్తవ ప్రచారం చేసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు.

దీనికి నిదర్శనమే మీడియా వాటిని పట్టుకుందన్నారు. తిరుమల లో వెంకటేశ్వర నామం కూడా పైకి జపం చెయ్యలేని గుటిలోకి పాలకులు తెచ్చారన్నారు. 

ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి గురించిన ఆసక్తి కరమైన విషయాలను ప్రకటించిన విశాఖ శారదా పీఠాధిపతుల స్వరూపానందేంద్ర సరస్వతి ప్రస్తుత పరిస్థితులపై తక్షణం స్పందించాలని

రౌండ్ టేబుల్ లో వక్తలు డిమాండ్ చేసారు. ఎన్నికల ముందు ఎన్నో హిందూ దేవాలయాలు ఆయన తిరిగారని,  à°¤à°¨ సారథ్యంలోనే à°—à°‚à°—à°¾ నది సాక్షిగా జగన్ హిందువుగా మారాడు అంటూ

ప్రకటించిన స్వరూపానంద నోరు విప్పాల్సిందేనని, లేని పక్షంలో ఆయన్ని నిలదీసేందుకు ఆయన ఆశ్రమం వెళ్తామని హెచ్చరించారు. 

తన సారధ్యంలోనే  à°¹à°¿à°‚దూ మతంలోకి

మారారు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురించి à°¦à±‡à°¶ వ్యాప్తంగా ప్రచారం చేసిన స్వరూపానందేంద్ర సరస్వతి రాష్ట్రంలో క్రైస్తవ ప్రచారం గురించి ఇంతవరకూ ఎందుకు

నోరెత్తలేదని ప్రశ్నించారు. పైగా వైఎస్ జగన్ తన ఆత్మా అంటూ ప్రకటనలు చేసేసి, ఏకంగా అతనికి ముద్దులు కూడా పెట్టేసిన సందర్భాలు అందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు.

అలాంటిది అదే ఆత్మ నేడు తప్పులు చేస్తే సరిదిద్దవలసిన భాద్యత à°ˆ పీఠాధిపతి లేదా అని ప్రశ్నించారు.  

హిందూ ధార్మిక మండలి ప్రతినిధి తురగ శ్రీరామ్ మాట్లాడుతూ

విజయవాడ దుర్గ మల్లేశ్వర స్వామి కొండకు వెళ్లే భక్తులు  à°ªà°µà°¿à°¤à±à°° స్నానాలు చేసే ఉన్న కృష్ణా నదీ ఘాట్ లో ఇటీవలే 40 మంది హిందువులను బలవతంగా మతమార్పిడి చేయిస్తూ

అడ్డుకున్న వారి పై దాడి చేసిన ఘటనలకు ఈ ప్రభుత్వం ఏమి సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. నేటి దేవాదాయ శాఖామంత్రి గతంలో అన్యమత ప్రచారానికి వ్యతిరేకంగా

చేపట్టిన ఉద్యమాల్లో మాతో కలిసే నిరసనలు చేశారని, మరి ఈనాడు ఆయన మంత్రి అయ్యేసరికి అంతా మంట కలిపేస్తున్నారని మండిపడ్డారు. 

శివసేన జిల్లా కార్యదర్శి కె.

రామకృష్ణ మాట్లాడుతూ హిందువులు కష్టపడి సంపాదించి గుళ్ళల్లో వేసే ముడుపులు, నిధులపై క్రైస్తవుల పెత్తనం ఏంటని ప్రశ్నించారు. చాలా దేవాలయాలు, దేవాదాయ శాఖలో ఎన్నో

పదవుల్లో వందల సంఖ్యలో హిందువులు పేరుతొ దొంగ సర్టిఫికెట్ లు పెట్టి దొంగతనంగా హిందువుల డబ్బులు దోచుకు తింటున్న వాళ్లందరినీ తక్షణం బయటకు

పంపాల్సిందేనన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ శాఖను తక్షణం రద్దు చెయ్యాలని, మా హిందూ ఆలయము మేమె నిర్వహించుకుంటామన్నారు. 

 à°¹à°¿à°‚దువులకు తిరుపతి, కాశి,

అమర్ నాధ్, బదరి లాంటి యాత్రలకు వెళ్లేందుకు డబ్బులు ఇవ్వని, ప్రభుత్వం . . దేవాదాయ శాఖా పేరుతొ హిందువుల గుళ్లను దోచుకు తింటూ క్రైస్తవులకు జెరూసలేం వెళ్లేందుకు,

ముస్లిం లకు మక్కా వెళ్లేందుకు ప్రత్యేక నిధులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ ఒక్క చర్చ్ గానీ, మసీదు గానీ, ప్రభుత్వం అధీనంలో ఉన్నాయా అని

ప్రశ్నించారు. అయితే టిటిడి లాంటి సంస్థల నుంచి కోట్లాది నిధులు దోచుకుని, ఇతర సంస్థలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. తక్షణం హిందువుల ను దోపిడీ చేసే

ప్రక్రియను ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరించారు. 

మిగిలిన హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam