DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెడ్ క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా జగన్మోహన రావు ఎన్నిక   

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 05, 2019 (డిఎన్‌ఎస్‌): రాష్ట్ర రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులుగా ఎన్నికైన à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚

జిల్లా రెడ్ క్రాస్ ఛైర్మన్ పి.జగన్మోహన రావు సేవాతత్పరుడు అని శాసన సభ్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. గురు వారం  à°¶à°¾à°‚తా కళ్యాణ అనురాగ నిలయంలో జగన్మోహన రావుకు

ఆత్మీయ అభినందన కార్యక్రమం జరిగింది. à°ˆ కార్యక్రమానికి శాసన సభ్యులు ప్రసాద రావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. à°ˆ  à°¸à°‚దర్భంగా మాట్లాడుతూ సేవా కార్యక్రమాలు

సమాజానికి అవసరమన్నారు. స్వచ్ఛంద సేవల ద్వారానే అనేక పనులు విజయవంతంగా పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. సేవాతత్వమే నిజమైన నాయకత్వం అన్నారు. ఈ నాయకత్వ

లక్షణాలు జగన్మోహన రావులో పుష్కలంగా ఉన్నాయని పేర్కొన్నారు. సేవలు చేసే స్ఫూర్తిని సమాజంలో నింపాలని తద్వారా కొంత మంది సేవా కార్యక్రమంలో వచ్చే అవకాశం

ఉంటుందని చెప్పారు. రెడ్ క్రాస్ ఉపాధ్యక్షులుగా రావడం జిల్లాకు గౌరవ ప్రదమని పేర్కొన్నారు. ఇటువంటి వ్యక్తికి అభినందించడం, సన్మానించడం ద్వారా మరింత మంది

స్ఫూర్తి పొందగలరని ఆయన అన్నారు. జిల్లాలో గుర్తించిన సమస్యల పరిష్కారంపై పని చేస్తామని ఆయన అన్నారు. రాష్ట్రంలో యువ నాయకుడు అనేక కార్యక్రమాలను అమలు చేయుటకు

ఆకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారని, ఆర్ధిక సమస్యలు  à°‰à°¨à±à°¨à°¾ రానున్న రోజుల్లో సర్ధుకుంటాయని అన్నారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ మంచి సేవలకు

అభినందన కార్యక్రమం అన్నారు. స్వంత చింతన లేకుండా సమాజ సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. ఇది మనకు మనం అభినందించుకోవడమేనని అన్నారు. ప్రతి రోజు రెడ్ క్రాస్ తరపున

ఏదో ఒక ప్రజోపయోగ కార్యక్రమం జగన్మోహన రావు నేతృత్వంలో చేపట్టడం జరుగుతుందని అభినందించారు. సేవలు చేయడంలో కలిగే సంతోషం, ఆనందం వెలకట్టలేనిదని అన్నారు. బిల్

గేట్స్, ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంస్థలను ప్రారంభించి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ఘోరాలు, నేరాలు జరుగుతున్న సమాజాన్ని భూమాత ఏ విధంగా మోస్తుందనే చర్చ

వచ్చినపుడు ఎవరో కనీసం ఒకరు సమాజం మేలు కోసం ఒక్క వ్యక్తి ఉన్నా భూమాత ఓర్పుతో భరిస్తుందనే తమిళ నానుడి ఉందని ఈ సందర్భంగా ఉదహరించారు.

సన్మాన గ్రహీత రెడ్

క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు జిల్లా అధ్యక్షులు పి.జగన్మోహన రావు మాట్లాడుతూ జిల్లాలో రెడ్ క్రాస్ సంస్ధ చేస్తున్న సేవలకు అందులో భాగస్వామ్యమైన ప్రతి

ఒక్కరి తోడ్పాటు ఉందన్నారు. వారి తోడ్పాటు ద్వారానే 23 రకాల కార్యక్రమాలను చేపట్టి దేశంలో రెండవ స్ధానంలో నిలిచామన్నారు. స్వర్గీయ మగటపల్లి రమణమూర్తి అందించిన

సహకారంతో నేత్ర సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 382 మంది నుండి నేత్రాలను సేకరించి 736 మందికి చూపును ప్రసాదించడం జరిగిందన్నారు. శాంతా కళ్యాణ అనురాగ నిలయాన్ని

నెలకొల్పుటకు రమణమూర్తి అండగా నిలవడంతో 44 మంది అనాథ పిల్లలు మంచి వసతులతో అన్ని సౌకర్యాలు అందుకుంటున్నారని చెప్పారు. సెర్వ్ కార్యక్రమం దేశంలో శ్రీకాకుళం

జిల్లాతో పాటు ఒడిషాలో ఒక జిల్లాకు కేటాయించగా శ్రీకాకుళం జిల్లా అజేయంగా నిలిచిందని చెప్పారు. 2,800 మంది పేదలకు కుట్టులో శిక్షణ కల్పించి ఉపాధి కల్పించామని,

మెడిసిన్ బ్యాంకు ద్వారా 45 వేల మందికి మందులను పంపిణీ చేసామని వివరించారు. జిల్లాలో జరిగిన ప్రతి అగ్నిప్రమాద బాధితులను రెడ్ క్రాస్ ఆదుకుందని తెలిపారు. సి.వి.ఎన్.

మూర్తి సహకారంతో వృద్ధాశ్రమం నిర్మాణం జరిగిందని, పేదలకు ప్రతి రోజు ఆహారాన్ని అందించడం జరుగుతోందని చెప్పారు. జిల్లాలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నేచర్ క్యూర్

ఆసుపత్రి, కేన్సర్ ఆసుపత్రి నెలకొల్పాలనే కాంక్ష ఉందని నెరవేరాలని కోరుకున్నారు. రెడ్ క్రాస్ కు ధర్మాన ప్రసాదరావు, ప్రముఖ వైద్యులు కె.సుధీర్ గట్టి పునాధులు

వేసారని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా శాసనసభ్యులు ధర్మాన ప్రసాద రావు, జిల్లా కలెక్టర్ నివాస్, రెడ్ క్రాస్ ప్రతినిధులు, తదితరులు జగన్మోహన రావు దంపతులకు ఘనంగా

సత్కరించారు.

ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ప్రతినిధులు డా.నిక్కు అప్పన్న, బలివాడ మల్లేశ్వర రావు, శ్రీనివాస్, డా.కె.సుధీర్, డా.సంపత్ కుమార్, డా.పి.ఎల్.ఎన్.రాజు,

డా.కె.జగన్మోహన రావు, డా.కె.సోమేశ్వర రావు, సి.వి.ఎన్.మూర్తి, సురంగి మోహన రావు, గీతా శ్రీకాంత్, కర్నాని, సాయి, స్వచ్చంద సంస్ధల ప్రతినిధులు ఎం.ప్రసాద రావు, ఎన్.సన్యాసి

రావు, రమణ మూర్తి., పి.ఎల్.ఎన్.రావు, డి.వి.ఆర్. ఎం. పట్నాయక్, నాగరాజు, అంధవరపు సూరిబాబు, కృష్ణా రావు, జి.ఇందిరా ప్రసాద రావు, డా.కెల్లి చిన్నబాబు, నాగావళి కొండబాబు, ఆనంద్,

నిక్కు హరిసత్యనారాయణ, డబ్బీరు గోవింద రావు తదితరులు పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam