DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దిశ దుర్ఘటన ఉదంతం దేశవ్యాప్తంగా కనువిప్పు కావాలి  

బహిరంగ శిక్షలు అమలు చేయాలి : జనసేనాని పవన్ కళ్యాణ్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం) : . . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 06, 2019 (డిఎన్‌ఎస్‌): దిశ దుర్ఘటన ఉదంతం

దేశవ్యాప్తంగా కనువిప్పు కావాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో జరిగిన దిశ ఘటన నేరస్థుల ఎన్ కౌంటర్ పై ఆయన

స్పందించారు. దిశ ఉదంతం మన ఆడపడుచుల రక్షణకు ప్రస్తుతం ఉన్న చట్టాలు సరిపోవని హెచ్చరిస్తోందన్నారు. ఆ కరాళ రాత్రి వేళ నలుగురు ముష్కరుల మధ్య దిశ ఎంత నరకాన్ని

చూసిందో తలచుకుంటేనే ఆవేశం, ఆక్రోశం, ఆవేదనతో శరీరం ఉడికిపోతోందని మండిపడ్డారు. జాతి యావత్తు తక్షణ న్యాయం కోరుకోవడానికి కారణం à°ˆ ఆవేదనేనన్నారు. దిశ  à°¸à°‚ఘటన

ముగిసిందని దీనిని మనం ఇంతటితో వదిలిపెట్టకూడదుని, మరే ఆడబిడ్డకు ఇటువంటి పరిస్థితి రాకూడదన్నారు. నిర్భయ ఉదంతం తరువాత బలమైన చట్టాన్ని మన పార్లమెంటు

తీసుకొచ్చిందని, అయినా అత్యాచారాలు ఆగడం లేదన్నారు. అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని జరుగుతున్న సంఘటనలు తెలుపుతున్నాయని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లల

వైపు వక్రబుద్ధితో చూడాలంటేనే భయపడే విధంగా కఠినాతి కఠినమైన చట్టాలు రావలసిన అవసరం ఉంది. ఇతర దేశాలలో ఎటువంటి చట్టాలు ఉన్నాయో అధ్యయనం చేయాలని, మేధావులు

ముందుకు కదలాలన్నారు. వారి ఆలోచన శక్తితో ఇటువంటి నికృష్ట ఘాతుకాలకు చరమాంకం పాడాలని పిలుపునిచ్చారు. 
ఇలాంటి  à°•à±‡à°¸à±à°²à°²à±‹ కోర్టుల పరంగా తక్షణ న్యాయం లభించాలని,

రెండు మూడు వారాలలోనే శిక్షలు పడేలా నిబంధనలు రావాలని కోరారు. ఆడపడుచుల శ్రేయస్సు దృష్ట్యా శిక్షలు బహిరంగంగా అమలు చేయడానికి  à°¯à±‹à°šà°¨ జరగాలన్నారు. నేర స్థాయిని

బట్టి అది మరణ శిక్షఅయినా, మరే ఇతర శిక్ష  à°…యినా సరే, బహిరంగంగా అమలు జరపాలని కోరారు. ప్రజలు కోరుకున్న విధంగా దిశ ఉదంతంలో సత్వర న్యాయం లభించిందన్నారు.
 à°ˆ

సందర్భంగా దిశ ఆత్మకు శాంతి కలగాలని, à°ˆ విషాదం నుంచి ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam