DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చేనేత వస్త్రాలకు ఏపీ లో చేయూత నిస్తున్నాం : ఎంపీ మార్గాని భరత్

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 08, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ లో చేనేత వస్త్రాలకు అంతర్జాతీయంగా బ్రాండ్ తీసుకొచ్చేందుకు

సీఎం జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని రాజమహేంద్రవం ఎంపీ, లోక్ సభలో వైఎస్సార్ సిపి చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్

పేర్కొన్నారు. శనివారం రాత్రి ఢిల్లీ లో ఒడిస్సా చేనేత సంఘాలు తమ ఉత్పత్తుల ప్రాముఖ్యాన్ని వివరించేందుకు '' ప్రయాగ్ ఒడిస్సా" పేరుతో కార్యక్రమాన్ని

నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అథితి గా హాజరైన ఎంపీ భరత్ రామ్ మాట్లాడుతూ.. తమ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డి చేనేతల కోసం 'వైఎస్సార్

నేతన్న హస్తం' పధకాన్నిఅమలు చేస్తున్నారని పేర్కొన్నారు. చేనేతలకు ఏడాదికి రూ. 24 వేలు ప్రతి కుటుంబానికి ఆర్ధిక సహాయం చేసేలా చర్యలు చేపడుతున్నారని వివరించారు.

కేంద్ర ప్రభుత్వం కూడా చేనేతలకు అండగా నిలవాలని కోరారు. తన నియోజకవర్గం ఉన్న తూర్పు గోదావరి జిల్లాలోని ఉప్పాడ చీరలు దేశ వ్యాప్తంగా ప్రసిద్దని వివరించారు.

చేనేత వస్త్రాలు ఆన్లైన్ లో విక్రయించేలా అమెజాన్ తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుందన్నారు. ఆన్లైన్ విక్రయాల వల్ల చేనేత ఉత్పత్తులు ప్రపంచమంతా

అందుబాటులో ఉంటాయని, à°† దిశగా ఆలోచన చేయాలని సూచించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam