DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బైక్ ల చోరుడు అరెస్ట్ - ఎనిమిది బైక్ లు స్వాధీనం..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, డిసెంబ‌రు 09, 2019 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి పరిధిలో మోటార్ బైక్ లను చోరీ చేస్తున్న

దొంగను పోలీసులు పట్టుకున్నారు. అతడి నుంచి ఎనిమిది బైక్ లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించిన సిఐ దుర్గాప్రసాద్.. సంబంధిత కేసు

వివరాలను వెల్లడించారు. రాజమహేంద్రవరం త్రీ టౌన్, కంబాల చెరువు, క్వారీ సెంటర్, పుష్కర ఘాట్ ల సమీపాల్లో గతం నుండే మోటార్ బైక్ లు చోరీకి గురౌతున్నాయన్నారు. దీనిపై

అనేక ఫిర్యాదులు రావడంతో .. ఆయా ప్రాంతాలలో ఎస్ ఐలు, సిబ్బంది తో నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఈ దిశలోనే గణేష్ నగర్ కి చెందిన వైకుంటపు శ్రీనివాస్ అనే వ్యక్తిని

ఉదయం అదుపులోకి తీసుకున్నట్లు సిఐ తెలిపారు. అతడ్ని అరెస్ట్ చేసి అతడి వద్దనుండి ఈ మధ్యకాలంలోనే దొంగిలించిన ఎనిమిది బైక్ లను రికవరీ చేసినట్లు తెలిపారు.

నిందితున్ని రిమాండ్ కి తరలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మోటార్ బైక్ ల యజమానులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.లాక్ లు చెడిపోయినా,లేకపోయినా.. వెంటనే లాక్ లు

వేయించుకోవాలి సిఐ దుర్గాప్రసాద్ విజ్ఞప్తి చేశారు. అలాగే కేసుని ఛేదించిన ఎస్ ఐ ఆదినారాయణ తో పాటు సిబ్బంది వెంకటేశ్వరరావు, అమ్మిరాజు, వెంకటరమణ తదితరులను

డిఎస్పీ జే.సంతోష్ గారు అభినందించినట్లు ఆయన వెల్లడించారు. వారి పేర్లను రివార్దులకోసం ఎస్పీ గారికి ప్రతిపాదిస్తామని సిఐ తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam