DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి లో ఉల్లి కి వెళ్తే . . . చుక్క పడుతోంది. 

ఒత్తిడికి తట్టుకునేందుకు రాజమండ్రి లో కొత్త పోకడ, 

వారం దాకా రాకుండా ఉండేందుకే ఇంకు చుక్క: నిర్వాహకులు 

ఉల్లి కూడా ఓటింగు లాగానే చాలా

విలువైంది. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . . . 

అమరావతి, డిసెంబ‌రు 10, 2019 (డిఎన్‌ఎస్‌) : ఉల్లి కొనడానికి వెళ్తున్నారా. . . అయితే మీ వేలుకు సిరా చుక్క

పడిందన్నమాటే.  à°¤à±‚ర్పు గోదావరి జిల్లా మహేంద్రవరం లో ఉల్లిపాయల కొనుగోళ్ళకు కిలోమీటర్ల లైన్లు ఉండడంతో దీని ఒత్తిడి తట్టుకునేందుకు అధికారులు కొత్త పోకడ

మొదలు పెట్టేసారు. రాజమండ్రి లోని గణేష్ చౌక్ లోని రైతు బజార్ వద్ద జరుగుతున్న ఉల్లి కిలో రూ. 25 విక్రయ కేంద్రం వద్ద ప్రతి ఒక్కరి వద్ద రేషన్ కార్డు, చూసి, నెంబర్

నమోదు చేసుకుని, వచ్చిన వారి వేలుపై వోటింగ్ కు వేసే ఇంకు చుక్క మాదిరిగా ఒక ఇంకు చుక్కను వేసేస్తున్నారు. ఇది కేవలం ఒత్తిడి ని తట్టుకోడానికేనని, వీరు మరో వారం

వరకూ రాకుండా నిరోధించేందుకు ఈ చుక్క విధానం మొదలు పెట్టినట్టు తెలిపారు. ఈ విధానం మంగళవారం నుంచే మొదలు పెట్టినట్టు తెలియచేస్తున్నారు.

అయితే నగర వాసులు

మాత్రం à°ˆ విధానం పై మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఇంకెక్కడా లేని à°ˆ ఇంకు విధానం రాజమండ్రి లో మాత్రమే పెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam