DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమలాపురం మాజీ ఎంపీ హర్ష కుమార్ రాజమండ్రి లో అరెస్ట్ 

డిఎస్పీ సంతోష్ నేతృత్వంలో మహిళా రక్షణ చర్యలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .. 

అమరావతి, డిసెంబ‌రు 14, 2019 (డిఎన్‌ఎస్‌) : విధుల్లో ఉన్న

ప్రభుత్వ ఉద్యోగులను, న్యాయమూర్తులను బెదిరించిన నేరంలో అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు అరెస్ట్ చేసారు.

రాజమండ్రి సెంట్రల్ జోన్ డిఎస్ పి జె. సంతోష్ నేతృత్వంలో 3 à°µ పట్టణ పోలీసులు శుక్రవారం రాత్రి 3 టౌన్  à°¦à±à°°à±à°— ప్రసాద్ ఇతన్ని అరెస్ట్ చేసి న్యాయమూర్తి ముందు

ప్రవేశపెట్టారు.  à°•à±‹à°°à±à°Ÿà± 14 రోజులు రిమాండ్‌ విధించడంతో సెంట్రల్‌ జైల్‌కు తరలించారు. 

ఈ సెప్టెంబర్ 28 న రాజమండ్రి కోర్టు ఆవరణలో విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ

ఉద్యోగులకు ఆటంకం కల్గించడమే కాక, అధికారులపై దుర్భాషలాడిన ఘటన పై ఈ కేసు నమోదు అయినట్టు తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వుల మేరకు, జిల్లా కలెక్టర్, ప్రభుత్వ

సిబ్బంది కోర్టు స్థలంలో ఉన్న రెడ్ క్రాస్ భవనంలోని వాణిజ్య దుకాణాలను ఖాళీ చేయిస్తున్న సమయంలో హర్షకుమార్ అడ్డుకోవడం జరిగింది. ఈ క్రమం లోనే న్యాయమూర్తులను

పరుష పదజాలంతో దూషించి, మహిళా ఉద్యోగిపట్ల అసభ్యంగా ప్రవర్తించారని, కోర్టు సిబ్బందిని బెదిరించారని జిల్లా కోర్టు చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌

త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. à°—à°¤ కొన్ని రోజులుగా ఇతను అందుబాటులో లేకపోవడంతో ఇతని కోసం పోలీసులు వెతుకుతున్నారు. శుక్రవారం ఇతను

ఇంటికి రావడంతో పోలీసులు 41 సీఆర్‌పీసీ నోటీసును జారీచేశారు. రాత్రి  à°à°¡à± à°—à°‚à°Ÿà°² సమయంలో 3 à°µ టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చిన హర్షకుమార్ విచారణకు సహకరించక పోవడంతో

అరెస్ట్‌ చేశారు. వైద్య పరీక్షల అనంతరం రాజమండ్రి ఐదో అదనపు ఫస్ట్‌క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా న్యాయమూర్తి ఇతనికి 14 రోజులు రిమాండ్‌

విధించారు. 

డి ఎస్ పి సంతోష్ కి అభినందనలు :

రాజమహేంద్రవరం డిఎస్పీ à°—à°¾ భాద్యతలు చేపట్టిన మూడు నెలల కాలం లోనే పట్టణం లో 
లా అండ్ ఆర్డర్ ను ప్రతి క్షణం

కాపాడుతున్నారు. నగర పరిధిలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా, రాత్రి పగలు నిఘా పెట్టారు. మహిళలకు పూర్తి రక్షణ కల్పించే విధంగా ముఖ్యమంత్రి

తీసుకున్ననిర్ణయాలకు అనుగుణంగా పూర్తి స్థాయిలో భద్రతా కల్పించడమే కాక, వివిధ విద్య సంస్థలు, స్వచ్చంద సంస్థలు ప్రతినిధులతో కలిసి ప్రజల్లో అవగాహనా

కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు. ఈయన గతంలో గుంటూరు, రామచంద్రపురం లోను సమర్ధవంతంగా భాద్యతలు చేపట్టారు. మూడు నెలల కాలం లోనే ప్రజల మన్ననలు పూర్తి స్థాయిలో

పొందారు. మహిళల పట్ల ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam