DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధనుర్మాసోత్సవ వేడుకలకు ఆలయాలు సిద్ధం.

నిత్యానుసంధానంతో అలరించనున్న ఆలయాలు 

వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావై పాసుర విన్నపాలు  

గృహాల్లోనూ కుటుంబ సభ్యులతో పాసుర

సేవలు 

భగవతోత్తములందరికీ అత్యంత పవిత్రమైన వేడుకలే. . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 17, 2019 (డిఎన్‌ఎస్‌): దేశ వ్యాప్తంగా

అన్ని వైష్ణవ సంబంధ ఆలయాలు ధనుర్మాసోత్సవాలకు ఆలయాలు సిద్ధమవుతున్నాయి. ఆండాళ్ ఆచరించి చూపించిన తిరుప్పావై పాశురాలతో అన్ని ఆలయాల్లోనూ అర్చనలు జరుగనున్నాయి.

విశాఖ నగరపరిధిలోని సింహాచల క్షేత్రం మొదలు కొని, నగర వీధిలోని చిన్న ఆలయం వరకూ అన్ని వైష్ణవ ఆలయాలు పవిత్రమైన ఈ మాసోత్సవాలను వైభవంగా నిర్వహించే ఏర్పాట్లలో

నిమగ్నమయ్యాయి. ఈ నెల 16 వ తేదీ అర్ధ రాత్రి 11 :47 నిమిషాలకు ధనుర్మాస ఆరంభం కావడంతో 17 న తెల్లవారు ఝామున ఉత్సవాలకు శ్రీకారం జరుగుతోంది. ఈ వైష్ణవ సంప్రదాయాన్ని పాటించే

వారందరూ కుటుంబ సమేతంగా తిరుప్పావై పాసుర సేవలో తరించనున్నారు. ప్రధానంగా విశిష్ట ద్వైత, భగవద్రామానుజ సిద్ధాంతాన్ని ఆచరించే వారు సమాజంలోని అన్ని సామాజిక

వర్గాల భగవతోత్తములు ఈ ఉత్సవాలను తప్పక ఆచరిస్తుంటారు. ఈ నెల రోజుల కాలంలో ఆలయాల్లో ఆరాధనలతో పాటు సాయం వేళల్లో ఆ రోజు విశిష్టతను ప్రముఖులచే ప్రవచన సహితంగా

భక్తులకు అందించడం జరుగుతుంది. ప్రతి రోజూ ఆచరించవలసిన ఆరాధనా ప్రక్రియకు నిత్య అనుసంధానం అని పేరు. 

ఆరాధనే కాదు.. ప్రసాద స్వీకరణ కూడా భక్తులందరితోనూ

కలిసి గోష్టిగా తీసుకోవడమే ఈ వ్రతం ప్రధాన లక్ష్యం. తద్వారా సమాజంలోని భక్తులందరూ సమానమేనని ఆండాళ్ తెలియచేసింది. నేటికీ అన్ని ఆలయాల్లోనూ ఆమె తెలియచేసిన

విధంగానే ఆరాధనలు, ప్రసాద వితరణలూ జరుగుతుంటాయి. 

ఒక్కో పాశురం లో ఒక్కో భగవతోత్తములను గురించిన విషయాలను మనకు అందిస్తుంది. వీరందరూ శ్రీకృష్ణునితో

ప్రత్యక్ష సంబంధం కల్గి ఉన్నవారే. 

అందరికోసం అందించినదే  à°ˆ తిరుప్పావై గోష్ఠి. à°ˆ ఉత్సవాలను ఏ ఒక్కరో విడిగా చేసుకునేది కాదు. అందరితో కలిసి గోష్టిగా

జరుపుకునే సేవ. ఇదే ఆండాళ్ à°ˆ మానవాళికి అందించిన కలిసి ఉంటె కలదు మోక్షం అనే మహత్తర ఔషధం. కలియుగంలోనే     à°•à±à°°à±€.à°¶.776 కాలంలో తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూర్

గ్రామంలో తులసి వనంలో ఆవిర్భవించిన ఈ మహిళామూర్తి ఆళ్వార్లు గా కీర్తించబడుతోంది. స్వామిని భర్తగా పొందాలి అనే లక్ష్యంతో ఆమె ఆచరించి చూపించి, స్వామిలో ఐక్యం

అయిన సంఘటనను శ్రీరంగం ఆలయంలోని వారందరూ ప్రత్యక్షంగా చూసి తరించినవారే. ఆమె తానూ ఆచరించి చూపించిన à°ˆ ఔషధం అందరికీ ఆచరణీయం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam