DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్రా రాజధాని రైతుల పరిస్థితి ఏంటి ?

త్రవ్వేసిన భూములు వ్యవసాయానికి పనికిరావు . .

రోడ్డెక్కిన అన్నదాతలు, కుటుంబ సభ్యులు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం ). . .

విశాఖపట్నం,

డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌): కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నట్టు వస్తున్నా ప్రకటనలతో రాజధాని ప్రాంత రైతులు

రోడ్డెక్కారు. రాష్ట్ర అభివృద్ధి కోసం 33 వేలఎకరాల వ్యవసాయ భూములను ప్రభుత్వానికి విరాళంగా ఇచ్చిన రైతులు, వాళ్ళ కుటుంబాల సభ్యులు, మహిళలు, తమ బ్రతుకులు ఏమవుతాయో

ముఖ్యమంత్రి చెప్పాలని డిమాండ్ తో పెద్దసంఖ్యలో  à°°à±‹à°¡à±à°¡à±†à°•à±à°•à°¿ నిరసనలు చేస్తున్నారు. ఇప్పడికే అమరావతి నిర్మాణం కోసం వేల ఎకరాల భూములను దానం చేసిన రైతుల

పరిస్థితి ఏంటి అనే విషయం ముఖ్యమంత్రి గానే, మంత్రులు గానీ, ప్రజాప్రతినిధులు గానీ స్పష్టమైన ప్రకటన చెయ్యక పోవడం తో రైతులు ఆందోళన చెందుతున్నారు. వీళ్ళ దగ్గర

తీసుకున్న భూములు తిరిగి రైతులకు ఇచ్చేస్తారా లేదో కూడా ప్రకటన చెయ్యక పోవడం మరింత దారుణం. వీటిని దానం చేసిన రైతులు, వాళ్ళ కుటుంబాల సభ్యలు, రోడ్డెక్కి నిరసనలు

చేస్తున్నారు. 

ఇచ్చిన భూములు వ్యవసాయానికి పనికిరావు . .

రాజధాని నిర్మాణం కోసం దానం చేసిన వ్యవసాయ భూములు తిరిగి వ్యవసాయం చెయ్యడానికి పనికి రానంతగా

త్రవ్వేశారని రైతాంగ కుటుంబాలు మండిపడుతున్నాయి. వ్యవసాయ భూములను తీసుకున్న ప్రభుత్వం, తిరిగి అదే స్థితిలో భూములను ఇవ్వమని à°°à±ˆà°¤à°¾à°‚à°— కుటుంబాలు డిమాండ్

చేస్తున్నాయి. ప్రజా ప్రతినిధులను ప్రశ్నించడానికి వెళ్తే మొహం చాటేస్తున్నారని రైతులు మండిపడుతున్నారు. 

పార్టీలకు అతీతంగా. . ఉద్యమిస్తాం . .

రాజధాని

ప్రాంతాల్లో వేల ఎకరాల భూదానం చేసిన రైతులు, పార్టీలకు అతీతంగా నిరసనల్లో పాల్గొంటున్నట్టు రైతులు తెలియచేస్తున్నారు. గత ప్రభుత్వం భూములు తీసుకున్నప్పుడు

నాటి అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రజా ప్రతినిధులు సుముఖంగానే ఉన్నారని, నేడు మొహం చుట్టేస్తున్నారంటూ నిరసనలు చేస్తున్నారు. 

అంతకు ముందు పెద్ద సంఖ్యలో

రైతులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, ప్రధానంగా మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam