DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మంత్రుల తెలుగు భాషా సౌరభమ్ అద్భుతం : ఎమ్మెల్సీ మాధవ్.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, డిసెంబ‌రు 19, 2019 (డిఎన్‌ఎస్‌): ఐదు కోట్ల ఆంధ్రులకు ప్రతినిధులుగా ఉన్న రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న తెలుగు

భాష అద్భుతంగా ఉందని, అందరికీ ఆదర్శం గా మాత్రం లేదని ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలిపారు. గురువారం నగర బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల

సమావేశంలో ఆయన మాట్లాడుతూ 
చట్ట సభల్లో సైతం ఇదే భాషను వినియోగించడం క్షమార్హం కాదని మాధవ్ అన్నారు. 
తెలుగు భాష ప్రాదిపదికన ఏర్పాటైన ఆంధ్ర ప్రదేశ్

రాష్ట్రంలోనే తెలుగు మాధ్యమం అనేది ప్రభుత్వమే రద్దు చేయటం దారుణం అన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. దీనివల్ల తెలుగు భాష సంస్కృతంలా

అంతరించిపోతుంది. తద్వారా తెలుగు భాషను కేవలం వీడియోల్లో చూడవలసిన గతి పడుతుందన్నారు. ఇదే తీరు కొనసాగితే తెలుగు పద్యం అనేది ఒక వింత వస్తువుగా

మారిపోతుందన్నారు. à°’à°• పద్యమే వింత à°—à°¾ ఉంటె  à°…వధానం, హరికథ, బుర్రకథ లాంటి వి అర్ధం కానీ బ్రహ్మ పదార్థంగా మారిపోతుందన్నారు. 

శాస్త్రీయ అధ్యయనాలన్నీ

ప్రాధమిక విద్యకు మాతృభాషనే సమర్ధించాయి.రాష్ట్ర ప్రభుత్వం 
 à°¤à°¨ మొండి వైఖరి విడనాడాలి. ప్రక్క రాష్ట్రాలైన తమిళనాడు, ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో

కేవలం వాళ్ళ మాతృభాషలోనే జరుగుతున్నాయన్నారు. అయితే ఆంధ్ర లో ప్రజలకు à°† అదృష్టం లేదన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam