DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాత్రి బస తో హాస్టళ్ల లో జీవన మార్పు వచ్చింది : కలెక్టర్  

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, డిసెంబ‌రు 27, 2019 (డిఎన్‌ఎస్‌):  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ వసతి గృహాల్లో స్పష్టమైన మార్పు రావాలని “మార్పు”

కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జె నివాస్ ప్రారంభించిన సంగతి విదతమే. మార్పు కార్యక్రమంలో భాగంగా వసతి గృహాల్లో సంపూర్ణమైన మార్పు రావాలని కలెక్టర్ నివాస్

భావన. అందుకు తగిన అన్ని మౌళికసదుపాయాలు కల్పించుటకు సంసిద్ధతను వ్యక్తం చేసారు. నిధులు ఎంత మేర ఖర్చు చేయడానికైనా అంగీకరించారు. ప్రతి వసతి గృహంలో అవసరాలను

గుర్తించాలని సంబంధిత శాఖల అధికారులను, మండల ప్రత్యేక అధికారులను, ఇంజనీరింగు అధికారులను ఆదేశించారు. ఆ మేరకు అంచనాలు తయారు చేసారు. జిల్లాలో దాదాపు రూ.10 కోట్లతో

మౌళికసదుపాయాలు కల్పించుటకు పరిపాలనా పరమైన ఉత్తర్వులు జారీ చేసారు. వసతి గృహాల్లో బాల బాలికలకు ఏ కష్టం రాకూడదని, వారి దృష్టి పూర్తిగా చదువుపై నిమగ్నమై

ఉండాలని ఆయన అభిప్రాయం. వసతి గృహం అంటే సాధాసీదాగా కొద్ది రోజులు గడిపే సంస్ధగా ఉండకుండా తనకు తీయని అనుభూతిని మిగిల్చే వ్యవస్ధగా ఉండాలని కలెక్టర్ నమ్మారు.

తను విద్యాభ్యాసం చేసిన రోజుల్లో తన వసతి నివాసం అనుభవం కూడా పరిగణనలోకి తీసుకుంటూ వసతి గృహాల్లో ప్రాథమికంగా విద్యుత్, తాగు నీరు, మరుగుదొడ్లలో నిరంతరం నీటి

సరఫరా, పరిసరాల పరిశుభ్రత ఉండాలని అధికారులను ఆదేశించారు. మంచి కాంతివంతమైన విద్యుత్ దీపాలు ఉండాలని, గుండు బల్బులతో కాంతి విహీనం చేయవద్దని సూచించారు.

విద్యార్ధుల సంఖ్యకు అనుగుణంగా పరిశుభ్రమైన మరుగుదొడ్లు ఉండాల్సిందేనని స్పష్టం చేసారు. వసతి గృహాలను అందమైన ఆహ్లాదకర భవనాలుగా నివాసానికి మరో చక్కని

ప్రదేశంగా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్న జిల్లా కలెక్టర్ నివాస్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహాల్లో రాత్రి బస కార్యక్రమం కలసి వచ్చింది. వసతి

గృహాల సంక్షేమ అధికారులను వసతి గృహాల్లో వారంలో కనీసం కొన్ని రోజులు రాత్రి బస చేయాలని జిల్లా కలెక్టర్ సూచించడం జరిగింది. అంతేకాకుండా మండల ప్రత్యేక

అధికారులను కూడా బస చేయాలని సూచించారు. వసతి గృహ సంక్షేమ అధికారులు, మండల ప్రత్యేక అధికారులనే కాకుండా స్వయంగా రాత్రి బస చేస్తూ అధికారులందరికి స్ఫూర్తిగా

నిలుస్తున్నారు కలెక్టర్ నివాస్. పోలాకి మండలం, దుప్పల వలస పాఠశాలల్లో గతంలో రాత్రి బస చేసిన జిల్లా కలెక్టర్ తాజాగా గురు వారం రాత్రి ఆమదాలవలస మండలం

కొత్తకోటవారి వీధిలోగల బి.సి వసతి గృహాన్ని తనిఖీ చేసారు. రాత్రి అచ్చటనే బస చేసారు. బస చేయడమే కాదు విద్యార్ధులతో మమేకమయ్యారు. వసతి గృహంలో సదుపాయాలను

పరిశీలించారు. విద్యార్ధులకు అందుతున్న సౌకర్యాలను, విద్యా బోధనలను పరిశీలించారు. వసతి గృహంలో విధిగా గురు వారం రాత్రి బస చేయాలని ఆదేశించినప్పటికి బస చేయని

వసతి గృహ సంక్షేమ అధికారిని సస్పెన్షన్ చేసారు. వసతి గృహంలో మెనూ ప్రదర్శించకపోవడం, మరుగుదొడ్డి అధ్వానంగా ఉండటం గమనించారు. మరుగుదొడ్డి అధ్వానంగా ఉండటం

తట్టుకోలేకపోయారు. తక్షణం సంబంధిత సిబ్బందిని రప్పించి శుభ్రం చేయించారు. ఏ వసతి గృహం తనిఖీ చేసిన మరుగుదొడ్లను మొదటగా పరిశీలిస్తామని మరోమారు చెప్పకనే

చెప్పారు. విద్యార్ధులకు మంచి నడవడికతోపాటు పోటీ పరీక్షలను ఏ విధంగా ఎదుర్కోవాలి, సంఘంలో ఏ విధంగా ప్రవర్తన ఉండాలనేదానిపై సూచనలు చేసారు. ఇన్ స్పైర్ బుక్సు ను

అందజేసారు. జిల్లా కలెక్టర్ రాత్రి బసను తమ వసతి గృహంలో చేయడంపట్ల విద్యార్ధులు ఆనందం వ్యక్తం చేసారు. జిల్లా కలెక్టర్ రాత్రి బస చేయడంతో తమ మరుగుదొడ్డికి మంచి

రోజులు వచ్చాయని సంతోషించారు. మరిన్ని రాత్రి బసలు జిల్లా కలెక్టర్ చేయాలని కోరుకున్నారు. రాత్రి బసలు చేసి మంచి మార్పు తీసుకురావచ్చని వసతి గృహాల్లో

అసౌకర్యాలను గమనించవచ్చని జిల్లా కలెక్టర్ చెప్పకనే చెప్పారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam