DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు పుణ్యభూమీ కి రావడం మా పూర్వజన్మ సుకృతం

ఆంధ్రా రాష్ట్రం లో తెలుగు వైభవంగా సాగుతోంది: 

తెలుగు పుణ్యభూమీ à°•à°¿ రావడం మా పూర్వజన్మ సుకృతం : 

తెలుగే మా జీవనం: తెలుగే మా శ్వాస . . 

ఆంగ్లం

కేవలం ఉపాధి కోసమే ఉండాలి:

మారిషస్ లో తెలుగు ప్రచారకర్త సంజీవ అప్పడూ. 

భారీ స్థాయి లో ముగ్గులు వెయ్యడం ఈయన ప్రత్యేకం :

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau,

విశాఖపట్నం ): . . .

విశాఖపట్నం, డిసెంబ‌రు 31, 2019 (డిఎన్‌ఎస్‌): తెలుగు పుణ్యభూమి ని దర్శించడం మా పూర్వ జన్మ సుకృతం అని  à°¤à±†à°²à±à°—ు భాష కు స్వీయ ప్రచార కర్త, మారిషస్ కు

చెందిన మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం తెలుగు శాఖాధిపతి సంజీవ నరసింహ అప్పడూ అభిప్రాయ పడ్డారు. విజయవాడ లో జరిగిన తెలుగు సాహితీ సభల్లో పాల్గొని, అనంతరం సోమవారం

విశాఖపట్నం కు అయన వచ్చారు. ఈ సందర్బంగా ఆయన సోమవారం సాయంత్రం బాలయ్యశాస్త్రి లే అవుట్ లోని ఒక పాఠశాలలో జరిగిన సమావేశంలో పాల్గొని, స్థానికులతో ముచ్చటించారు. ఈ

సందర్బంగా తమ దేశం లో జరుగుతున్నా తెలుగు వైభవాన్ని సభికులకు వివరించారు. తాము అవలంభిస్తున్న తెలుగు సంస్కృతి విశేషాలకు కళ్ళకు కట్టినట్టు

వివరించారు. 

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు భాష వైభవం అత్యంత అద్భుతంగా జరుగుతోందని, ప్రతి ఒక్కరు తెలుగు భాషలో మాట్లాడుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు వ్యాప్తికి జరుగుతున్నా కృషి ఎంతో కొనియాడదగినది అన్నారు.   

పార్దాయ ప్రతిభోదితామ్.. . . అంటూ . . .  à°­à°—వద్గీత శ్లోక పఠనం తో ప్రసంగం

ఆరంభించారు.

ఆంగ్లం కేవలం ఉపాధి కోసమే ఉండాలి:. . . .

ఉపాధి కోసం మాత్రమే ఆంగ్ల భాష వినియోగించాలని, జీవనం కోసం మాతృభాషలోనే కార్యాచరణ సాగాలని సూచించారు.

అయితే  à°•à±à°Ÿà±à°‚à°¬ సభ్యులు, బంధు, మిత్రులతో సంభాషించే అన్ని సమయాల్లోనూ కేవలం తెలుగు భాషలోనే తమ దేశం లో సంభాషిస్తామన్నారు.  

నాలుగు తరాల క్రితం కోరంగి (

తూర్పు గోదావరి జిల్లా ) కు చెందిన కొందరు తెలుగు వారు జీవనం కోసం మారిషస్ దీవి కి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వారి తర్వాత తరాలకు చెందిన వారు సైతం అక్కడే

స్థిరపడిపోయారు. అదే సంతతికి చెందిన వారు సంజీవ నరసింహ అప్పడూ.  

మారిషస్ లోనే పుట్టి, పెరిగి, మాతృ భాష తెలుగు అంటే ఎంతో భక్తి శ్రద్ధలు కల్గిన సంజీవ నరసింహ

అప్పడూ  à°µà°¿à°¶à°¾à°– వచ్చారు. అత్యంత కఠినమైన పరిస్థితుల్లో సైతం తెలుగు భాషను నేర్చుకుని, తర్వాత తరాలకు తెలుగు భాషను, సంస్కృతిని అందిస్తున్నా ఈయన కేవలం తెలుగు

భాషలో మాత్రమే మాట్లాడతారు. కనీసం ఒక్క ఆంగ్ల పదం కూడా సుదీర్ఘ ప్రసంగం చేయడం వీరి ప్రత్యేకత.  à°ˆà°¯à°¨ తరహాలోనే మారిషస్  à°²à±‹à°¨à°¿ తెలుగు కుటుంబాల సభ్యులు అందరూ కేవలం

తెలుగు భాషలోనే మాట్లాడడం వీరికి తెలుగు భాష పట్ల ఉన్న భక్తి.  à°®à±à°–పుస్తకం పరిచయం ఉన్న తెలుగు వారందరికీ సంజీవ నరసింహ అప్పడూ  à°—ురించి పరిచయం చేయనవసరం లేదు. à°—à°¤

కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ తెలుగు మహాసభలు, సాహితి సభల్లో కీలక ప్రసంగం చేసిన వీరు ప్రతి సంవత్సరం తప్పని సరిగా పూర్వీకుల మాతృభూమి అయినా తెలుగు రాష్ట్రాల్లో

పర్యటిస్తూ తెలుగు వారితో సభల్లోనూ, సమావేశాల్లోనూ పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. 

తెలుగు భాష కు స్వీయ ప్రచార కర్త, మారిషస్ కు చెందిన మహాత్మా గాంధీ విశ్వ

విద్యాలయం తెలుగు శాఖాధిపతి గాను, మారిషస్ రేడియో లో తెలుగు కార్యక్రమాల ప్రయోక్త గానూ ఎన్నో సేవలు అందిస్తున్నారు. 

భారీ స్థాయి లో ముగ్గులు వెయ్యడం ఈయన

ప్రత్యేకం :. . .

సుమారు 50 మీటర్ల విస్తీర్ణంలో భారీ ఎత్తున వివిధ రంగులతో ముగ్గులు వెయ్యడం కేవలం సంజీవ నరసింహ అప్పడూ  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•à°¤. ఒకే చేత్తో నాలుగు రంగుల

పెన్నులు, సుద్ద ముక్కలు పెట్టుకుని, అత్యంత సుందరమైన తెలుగు అక్షరాలు, పేర్లను అత్యంత అందంగా వ్రాయడం కేవలం ఈయనకే సొంతం. 

భావి తరాలకు చెందిన ఎందరో

విద్యార్థులకు తెలుగు భాష లో అక్షర దోషం లేకుండా మాట్లాడడం, వ్రాయడం, కధలు, కవితలు వ్రాయడం నేర్పించి తమ శిష్యులుగా తయారు చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 4, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam