DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా రవాణా శాఖగా ఆర్.టి.సి : సభాపతి తమ్మినేని సీతారామ్

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  01, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నేటి నుండి ప్రజా రవాణా

శాఖగా పిలవబడుతుందని రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారామ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం ఆర్.టి.సి కాంప్లెక్స్ లో ఏ.పి.యస్.ఆర్.టి.సి ప్రభుత్వంలో విలీనసభ

జరిగింది. ఈ కార్యక్రమానికి శాసనసభాపతి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆర్.టి.సి కార్మికుల చిరకాల స్వప్నం నేటితో తీరిందని, ఈ రోజు నిజమైన పండగ రోజు అని

కొనియాడారు. ఈ నిర్ణయం వలన జిల్లాలోని 736 మంది డ్రైవర్లు, 739 మంది కండక్టర్లు, 370 మంది ఇతర ఉద్యోగులు ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా గుర్తించబడ్డారని చెప్పారు. నాడు సి.ఎం

పాదయాత్ర సమయంలో అనేక ఆర్.టి.సి సంఘాలు తమ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేయమని కోరాయని, తన ప్రభుత్వం వచ్చిన వెంటనే తప్పకుండా విలీనం చేస్తామని నాడు హామీ

ఇచ్చారని, ఆ ఇచ్చిన మాటను నేడు సి.ఎం నిలబెట్టుకున్నారని కొనియాడారు. ఇందుకోసం ఆంజనేయరెడ్డి కమిటీని వేసి ఆర్.టి.సి స్థితిగతులపై కూలంకుశంగా అధ్యయనంచేసి

సంపూర్ణమైన నివేదికను తెప్పించుకోవడం జరిగిందన్నారు. ఇప్పటివరకు 39 శాతం ప్రభుత్వ వాటాకాగా, సంస్థది 61 శాతంగా ఉండేదని, నేటితో శతశాతం ప్రభుత్వమే భరిస్తుందని

చెప్పారు. దీనివలన రూ.3,600 కోట్లు ప్రభుత్వంపై భారం పడుతుందని, రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ వెనుకంజ వేయకుండా ఇచ్చిన మాటను సిఎం నిలబెట్టుకున్నారని

చెప్పారు. ముఖ్యమంత్రి తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయం వలన నేటి నుండి ప్రజా రవాణా శాఖ ఉద్యోగులుగా పిలవబడతారని చెప్పారు. ఇదేకాకుండా పదవీవిరమణ వయస్సును 60 ఏళ్లకు

పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. ఇకపై జీతభత్యాలు సమస్య ఉందబోదని, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జీతాలు అందుతాయని స్పష్టం చేసారు. రాష్ట్రంలో 35 వేల మంది

కార్మికులు పదవీవిరమణకు సిద్ధంగా ఉన్నారని, దీనిపై కూడా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందని ఆశాభావం వ్యక్తం చేసారు. గొప్ప మానవతావాది,

మనసుపెట్టి పరిపాలన చేసే వ్యక్తి మన సిఎం అని , అందుకే ప్రజల కోసం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందని, అందులో ఒకటి ఆర్.టి.సి ప్రభుత్వంలో

విలీనం అని గుర్తుచేసారు.  à°ˆ విలీన ప్రక్రియ దేశంలో మరెక్కడా లేదని, దమ్మున్న సిఎం గనకనే ప్రభుత్వంలో విలీన నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఏ గొప్ప ధైర్యం, దమ్ము,

నమ్మకంతో ఆర్.టి.సిని ప్రభుత్వంలో విలీనం చేసారో అదే నమ్మకంతో ఉద్యోగులు పనిచేసి ప్రభుత్వానికి మరింత పేరు తీసుకువచ్చేలా కృషిచేయాలని కోరారు. మీ ఉద్యోగులే

ప్రభుత్వానికి కొండంత అని, ఉన్నత భావాలతో పనిచేసి నష్టాలబాట నుండి లాభాలబాట పట్టేలా అందరూ కృషిచేయాలని కోరారు. అనంతరం ప్రజా రవాణా శాఖ వ్యవస్థాపక  à°¦à°¿à°¨à±‹à°¤à±à°¸à°µà°‚

సందర్భంగా కేకును కట్ చేసి ఉద్యోగులకు తినిపించారు.

        రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు కోసం ప్రభుత్వం అనేక

విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుందని, అందులో à°’à°•à°Ÿà°¿  à°†à°°à±.à°Ÿà°¿.సిని ప్రభుత్వంలో విలీనం చేయడం అని కొనియాడారు. దీనివలన రాష్ట్ర ఖజానాపై ఆర్ధిక భారం ఉన్నప్పటికీ

సాహసోపేతమైన నిర్ణయాన్ని అమలుచేయడం జరిగిందన్నారు.           ఇది గొప్ప శుభ పరిణామమని, కొత్త సంవత్సరంలో తొలిరోజే ఇటువంటి కార్యక్రమం నిర్వహించుకోవడం హర్షనీయమని

చెప్పారు. ప్రభుత్వంలో ఆర్.టి.సి విలీనం వలన ఉద్యోగుల బాధ్యత మరింత పెరిగిందని, నిరంతరం ప్రజలకు మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరును తీసుకురావాలని

ఆకాంక్షించారు. ఉద్యోగులందరూ పారదర్శకంగా పనిచేయాలని, ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలని కోరారు.                    à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ వచ్చిన ఏడు నెలల్లో అనేక చట్టాలు

తీసుకురావడం జరిగిందని, రాష్ట్రంలో సమర్థవంతమైన టీమ్ ఉందని, మీ రాకతో అది మరింత పటిష్టమైందని కొనియాడారు. భవిష్యత్ లో అందరూ కలిసిపనిచేసి ముఖ్యమంత్రికి అండగా

ఉండాలని కోరారు.                à°ˆ ప్రభుత్వం మరో 30 ఏళ్లు ఉండేలా అందరూ సహకరించాలని చెప్పారు.

        జిల్లా కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ఆర్.à°Ÿà°¿.సి ప్రభుత్వంలో

విలీనం కావడంతో రాష్ట్రంలోని 51,448 మంది, జిల్లాలో 1845 మంది కార్మికులు ప్రభుత్వ సేవకులుగా గుర్తించబడ్డారని, ఇది శుభపరిణామమని అన్నారు. దీంతో ఉద్యోగుల బాధ్యత మరింత

పెరిగిందని గుర్తుంచుకోవాలని కోరారు. ప్రజలకు మరిన్ని మంచి సేవలు అందించి ప్రభుత్వానికి మంచిపేరును తీసుకురావాలని కోరారు.  

        à°ˆ సమావేశంలో రాజాం,

పాలకొండ శాసనసభ్యులు కంబాల జోగులు, విస్వసరాయి కళావతి, à°¡à°¿.సి.సి.బి ఛైర్మన్ పాలవలస విక్రాంత్, పేడాడ తిలక్,  à°†à°°à±.à°Ÿà°¿.సి ప్రాంతీయ మేనేజర్ అప్పలరాజు, సర్వ శిక్ష అభియాన్

పథక సంచాలకులు పైడి వెంకటరమణ, ఎంప్లాయిస్ యూనియన్ ప్రాంతీయ కార్యదర్శి బి.కె.మూర్తి, యన్.యం.యు యూనియన్ అధ్యక్షులు అప్పయ్య, కార్మిక పరిషత్ యూనియన్       రాష్ట్ర

అధ్యక్షులు శిమ్మయ్య, ఆర్.టి.సి 1వ డిపో మేనేజర్ ప్రవీణ, 2వ డిపో మేనేజర్ కవిత, పి.ఆర్.ఓ బి.యల్.పి.రావు, ఇతర సంఘాల నాయకులు, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam