DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ భూ ఆక్రమణలపై పూర్తి విచారణ జరుపుతున్నాం: సిట్ చీఫ్

భూ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం: సిట్ చీఫ్ విజయ్  à°•à±à°®à°¾à°°à±  

అవసరమైతే  à°•à±à°·à±‡à°¤à±à°° స్థాయిలో సైతం విచారిస్తాం 

లబ్ధిదారుల్లో రాజకీయ నేతలు

ఉన్నారో లేదో తెలియదు 

జనవరి 10 à°¨  à°®à°¦à±à°¯à°‚తర నివేదిక : సిట్ త్రి సభ్య బృందం 

వచ్చిన ఫిర్యాదులు 2434 , సిట్ పరిధిలోవి కేవలం  918 మాత్రమే  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau,

విశాఖపట్నం): . .. . 

విశాఖపట్నం, జనవరి  03, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విశాఖపట్నం భూ ఆక్రమణలపై పూర్తి విచారణ జరుపుతున్నామని ప్రత్యేక

విచారణ కమిటీ ( సిట్) బృందం చీఫ్ డాక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం నగరం లోని ఏలేరు గెస్ట్ హౌస్ లో గల సిట్ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన

మాట్లాడుతూ గత మూడు నెలల కాలం లో తమకు విశాఖ జిల్లాలోని 13 మండలాల్లో ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, వాటిల్లో తమ పరిధిలోకి రానివి అధికంగానే ఉన్నాయన్నారు. జనవరి నెల 10

లేక 11 తేదీలలో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పిస్తామని తెలిపారు. తమకు 2434 ఫిర్యాదులు వచ్చాయని వాటిలో 918 మాత్రమే సిట్ కి సంబంధించినవి గా గుర్తించామన్నారు. ఈ

ఫిర్యాదులను 3 అంశాలుగా విభజించి పరిశీలించాము అన్నారు. 22a కి సంబంధించినవి, ఎన్ ఓ సి కేసులు, వ్యక్తులు లేక సంస్థలకు మంజూరు చేసిన ప్రభుత్వ భూములు గా విభజన చేయడం

జరిగిందన్నారు. కేటగిరి వన్ 255 కేసులను గుర్తించి వాటిలో 111 కేసులను తాసిల్దారు లకు పంపించామన్నారు. 22ఎ కేటగిరీలో 266 ఫిర్యాదులు రాగా 57 కేసులను తాసిల్దార్ లకు పంపించడం

జరిగిందన్నారు. 61 తిరస్కరించి 19 కేసులను పరిశీలించాము అన్నారు. అన్ని కేసులకు సంబంధించి భూమి విస్తీర్ణాన్ని పరిగణనలోకి తీసుకోలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా

చెప్పారు. కేసులను క్షుణ్ణంగా పరిశీలించి వేదిక ఇస్తామని, వాటిపై చర్యలు తీసుకోవడం తమ పరిధిలోనికి రాదని చెప్పారు. 

రాజకీయ నేతలు ఉన్నారో లేదో

తెలియదు:

భూ రికార్డుల లబ్ధిదారుల్లో రాజకీయ నేతలు ఉన్నారో లేదో తమకు తెలియదన్నారు. కేవలం భూ రికార్డుల్లో ఉన్న లబ్ధిదారులు సక్రమంగా ధ్రువ పత్రాలు కల్గి

ఉన్నారో లేదో మాత్రమే చూడడం తమ కమిటీ విధులన్నారు. పూర్తి స్థాయి నివేదికను మార్చ్ తర్వాత అందించడం జరుగుతుందన్నారు. 

ఎం ఆర్ ఓ లతో సమీక్ష :

క్రమం

తప్పకుండా ఫిర్యాదులు అందిన మండలాలకు చెందిన తహసీల్దార్ లతో సమావేశం జరుపుతున్నామన్నారు. అనుమానం వచ్చిన పత్రాల కు సంబంధించిన లింక్ పత్రాలు, ఇతర ఆధారాలకై

జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని, సంబంధిత ఆర్డీఓ కార్యాలయాన్ని, మండల కార్యాలయాన్ని, గ్రేట్ విశాఖ పట్నం మునిసిపల్ కార్యాలయాన్ని సంప్రదిస్తున్నట్టు

వివరించారు. 

à°—à°¤ సిట్ కు అందిన ఫిర్యాదులు, à°† బృందం ఇచ్చిన నివేదికను కూడా పరిగణన లోకి తీసుకుని తాము విచారణ జరుపుతున్నట్టు తెలిపారు. 

ఈ సమావేశంలో సిట్

సభ్యులు విశ్రాంత ఐఏఎస్ అధికారిణి  à°µà±ˆ వి అనురాధ, విశ్రాంత జడ్జి  à°Ÿà°¿. భాస్కరరావు లు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam