DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒలింపిక్ సంఘం ఆధ్వర్వం లో  23  న ఒలింపిక్ డే పరుగు 

విశాఖపట్నం, జూన్ 20, 2018 (DNS Online) : విశాఖ జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్వం లో  à°ˆ నెల 23 à°¨ ఉదయం  6 గంటలకు స్థానిక రామకృష్ణ బీచ్ వద్ద ప్రారంభం అవుతుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర

మానవ వనరుల శాఖామంత్రి గంటా శ్రీనివాస రావు తెలిపారు. బుధవారం నగరం లోని స్వర్ణభారతి ఇండోర్ మైదానం లో జరిగిన విలేకరుల సమావేశం లో అయన ఈ ఒలింపిక్ పరుగు పోస్టర్ ను

విడుదల చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరికీ క్రీడల పట్ల అవగాహనా పెంపొందించేందుకు జిల్లా ఒలింపిక్ సంఘం ఆధ్వర్యవం లో ఈ పరుగును

నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ పరుగు స్థానిక రామకృష్ణ బీచ్ వద్ద గల భవతారిణీ కాళీమాత ఆలయం నుంచి వుడా పార్కు వరకూ సాగుతుందన్నారు. ఈ పరుగు లో జిల్లాలోని వివిధ

పాఠశాలలు, కళాశాలలు, విద్యాలయాలు, క్రీడా సంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు సుమారు 10000 మంది కి పైగా పాల్గొనున్నట్టు తెలిపారు. ఈ పరుగును నాలుగు విభాగాల్లో

నిర్వహిస్తారని, బాలురు, బాలికలు, పురుషులు, మహిళకు వేర్వేరుగా ఉంటాయని వివరించారు. ప్రతీ విభాగం లోనూ మొదటి, ద్వితీయ, స్థానం పొందిన క్రీడాకారులకు బహుమతి ప్రాధానం

జరుగుతుందన్నారు. ముగింపు కార్యక్రమం లో అంతర్జాతీయ, జాతీయ క్రీడా కారులను సమ్మానించనున్నారని, ఈ పరుగులో ఆంధ్ర ప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కు చెందిన సభ్యులు

కూడా హాజరుకానున్నారన్నారు. క్రీడా స్ఫూర్తిని కల్గించే à°ˆ పరుగులో జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు. à°ˆ

విలేకరుల సమావేశం లో జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షులు టి హర్షవర్ధన్, ఉపాధ్యక్షులు ఆడారి కిషోర్ కుమార్, ఆంధ్ర విశ్వ కళాపరిషత్ క్రీడా విభాగాధిపతి డాక్టర్ ఎన్.

విజయ్ మోహన్ , జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చీఫ్ కోచ్ జూన్ గెలియెట్, ఇతర క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam