DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాష్ట్ర వ్యాప్తంగా అమ్మఒడి పధకానికి మొదటి దశ పూర్తి.

త్వరలోనే లోటుపాట్లకు రెండవ దశ లో అవకాశం .

రూల్స్ కు విరుద్ధంగా ప్రభుత్వ టీచర్లు దరఖాస్తు

అమ్మ వోడి కేవలం పేదలకే. . అని మందలించిన à°Žà°‚ à°ˆ à°“  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, జనవరి  06, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆర్ధిక భారంతో ఏ ఒక్క విద్యార్థి చదువు మధ్యలోనే ఆగిపోకూడదు అనే అద్భుతమైన సంకల్పంతో

 à°°à°¾à°·à±à°Ÿà±à°° ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన పధకం అమ్మఒడి. దీనికి అన్ని ప్రభుత్వ, ప్రయివేట్, ఎయిడెడ్ తదితర పాఠశాలల్లోని విద్యార్థులందరూ

అర్హులే అని ప్రకటించారు. ఈ పధకం ద్వారా ప్రతి విద్యార్థి తల్లికి రూ. 15 వేలు నగదు నేరుగా ఆమె బ్యాంకు ఖాతాల్లోకి చేరుతుంది. అయితే ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు,

ఆదాయపు పన్ను కట్టే వారికి మినహాయింపు ఉంది. మొదటి దశలో తెల్ల రేషన్ కార్డు, ఆధార్ సహా అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించడం జరిగింది.

రేషన్ లేదా, ఆధార్ లేని వారికీ రెండవ దశలో పరిశీలనా చేసి అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రభుత్వమే ప్రకటించింది. 

తల్లి లేని వారికి ఎవరైనా సంరక్షకులను

పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.  à°¦à±€à°¨à±à°¨à°¿ అనువుగా చేసుకుని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి అధికారులకు

దొరికిపోయారు. 

à°ˆ పధకం తమకు అమలు కాకపోవడంతో తూర్పు గోదావరి జిల్లాలోని కొందరు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, తమ పిల్లలకు కూడా à°ˆ పధకం ద్వారా  à°°à±‚. 15 వేలు

రావాలి అనే లక్ష్యంతో నిబంధనలు అతిక్రమించారు. తూర్పు గోదావరి జిల్లా లోని కొందరు  ప్రభుత్వ టీచర్లు తమ పిల్లలకు తల్లిదండ్రులు జీవించి లేరని, అమ్మమ్మ / నాయనమ్మ

లను సంరక్షకులుగా ప్రకటిస్తూ అమ్మ ఒడికి దరఖాస్తు చేసేసారు. అయితే పరిశీలనా చేస్తున్న మండల విద్యా శాఖాధికారికి ఈ దరఖాస్తులు కనపడడంతో టీచర్లను గట్టిగా

హెచ్చరించి తక్షణం వారి దరఖాస్తులను అర్హత పట్టి నుంచి తొలగించడం జరిగింది. దీంతో విద్యా శాఖాధికారి సీరియస్ అయ్యి, అందరికీ సూచనలు చెయ్యడం జరిగింది. ఎటువంటి

పరిస్థితుల్లోనూ ఈ పధకం అర్హులైన పేద విద్యార్థులకు మాత్రమే ఇవ్వాలని ప్రభుత్వం చేసిన సంకల్పాన్ని తప్పుదారి పట్టించడం అతి పెద్ద నేరంగా తెలిపారు. ఇతరుల

తప్పులను పరిశీలించవలసిన విద్యాశాఖ సిబ్బందే ఇలాంటి తప్పులు చేస్తే ఇంకా పెద్ద తప్పుగా తెలిపారు. దీంతో అన్ని దరఖాస్తులనీ క్షున్నంగా తనిఖీ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam