DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పల్స్ పోలియో పై విస్తృత అవహగానా జరగాలి: కలెక్టర్ నివాస్ 

జనవరి 19 à°¨ సార్వత్రిక పల్స్ పోలియో ను భాద్యత à°—à°¾ తీసుకోవాలి   

పల్స్ పోలియో పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం

5 ఏళ్ళ లోపు ప్రతి చిన్నారికి పోలియో

చుక్క వెయ్యాల్సిందే. 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . . . . .

శ్రీకాకుళం, జనవరి  08, 2020 (డిఎన్‌ఎస్‌) : జిల్లా వ్యాప్తంగా ఐదేళ్ల లోపు వయసు à°—à°²

ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో జరిగిన పల్స్ పోలియో పై

జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం లో అయన అధికారులకు సూచించారు. పొలియో చుక్కలు దూరంగా ఉండే అవకాశం ఉన్న వారిని గుర్తించాలని, ఇటుక బట్టీలలో పనిచేసే వారిని

విఆర్ఓలు గుర్తించాలన్నారు. అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో పనిచేసే వారిని లక్ష్యంగా చేసుకొని చుక్కలు వేయాలని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు

వేయించుకోకుండా తప్పించుకోకూడదన్నారు.  à°µà±€à°§à±à°²à±à°²à±‹ వ్యాపారం చేసేవారు, పూసలు విక్రయించే తదితర సంచార జాతులను విస్మరించరాదన్నారు. చిల్డ్రన్ హోమ్ à°² వద్ద బూత్ లు

ఏర్పాటు చేయాలని,  à°†à°°à±à°¡à±€à°µà±‹à°²à± అన్ని గ్రామాల్లో దండోరా వేయించాలని సూచించారు. 

పల్స్ పోలియో పై జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయి అవగాహన చేపట్టాలని,

విద్యార్థులు, స్వచ్చంద కార్యకర్తలు, పాత్రికేయులు, సమాజంలో భాద్యత కల్గిన హోదాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవగాహనలో పాల్గొనేలా కోరాలన్నారు.

జిల్లా వైద్య

ఆరోగ్య శాఖ అధికారి à°¡à°¾ à°Žà°‚.చెంచయ్య మాట్లాడుతూ 19à°µ తేదీన నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమానికి 1616 బూత్ లు ఏర్పాటు చేశామన్నారు.  à°‡à°‚దులో 968 గ్రామీణ ప్రాంతాల్లో, 529

గిరిజన ప్రాంతాల్లో, 119 పట్టణ ప్రాంతాల్లోను ఏర్పాటు చేశామని, వీటికి అదనంగా 83 మొబైల్ బృందాలు కూడా విధుల్లో ఉంటాయన్నారు. జిల్లాలో 240 హై రిస్క్ ప్రాంతాలు

గుర్తించమని,  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ ముఖ్యంగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయన్నారు. 

జిల్లాలో 5 సంవత్సరాల లోపు గల చిన్నారులు 2,33,378 ఉన్నట్లు అంచనా ఉందని, వీటికోసం 3,40,000 డోసుల

మందు సిద్ధం చేసినట్టు తెలిపారు. కోలనీలు, గృహవాసాలు ఎక్కువగా ఉండే అపార్టుమెంట్లు, గిరిజన ప్రాంతాల్లో కొండలపై ఉన్న గ్రామాలపై దృష్టి సారించాలని సూచించారు.

మొత్తం జిల్లాలో 8630 మంది సిబ్బంది నియామకం జరిగినట్టు వివరించారు. 


అదనపు డిఎంహెచ్ఓ డా బి.జగన్నాధ రావు మాట్లాడుతూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో

ఇప్పటికి పోలియో కేసులు నమోదు అయినట్టు తెలిపారు. మురికివాడల్లోకి వచ్చి నివాసం ఏర్పాటు చేసుకున్న వారు, సంచార జాతులు, ఇటుకల బట్టీలలో పనిచేసేవారిపై ప్రత్యేక

దృష్టి సారించాలన్నారు.  à°‡à°¤à°° ప్రాంతాలకు వెళ్లి వచ్చే వారిని గుర్తించాలి. వారిపై శ్రద్ద వహించాలని తెలిపారు. 

లయన్స్ క్లబ్ అధ్యక్షులు నటుకుల మోహన్

మాట్లాడుతూ శ్రీకాకుళం పట్టణంలో అపార్టుమెంట్లలో పోలియో చుక్కలు వేయుటకు బాధ్యత తీసుకుంటామన్నారు

ఐటిడిఏ పిఓ సాయికాంత్ వర్మ, సహాయ కలెక్టర్ ఏ.భార్గవ తేజ,

జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి,  à°¡à°¿à°Ÿà°¿à°¸à°¿ à°¡à°¾ వడ్డి సుందర్, డెప్యూటీ డిఎంహెచ్ఓ à°¡à°¾ నరేష్, నగర పాలక సంస్థ ఆరోగ్య అధికారి à°¡à°¾ వెంకట రావు, జబర్ జిల్లా సమన్వయ

అధికారి డా మెండ ప్రవీణ్, సర్వేలెన్స్ వైద్య అధికారి జి.భవాని, ఐసిడిఎస్ పిడి జి.జయదేవి, ఆర్డీవో లు ఐ. కిషోర్, టివిఎస్జి కుమార్, జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్,

 à°®à±†à°ªà±à°®à°¾ పిడి à°Žà°‚.కిరణ్ కుమార్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా సమన్వయ అధికారి శివప్రసాద రెడ్డి, డిసిహెచ్ఎస్ à°¡à°¾ బి.సూర్యారావు, డెమో పివి రమణ, అటవీ రేంజ్ అధికారి గోపాల్

నాయుడు, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ à°¡à°¾ ఏ.కృష్ణ వేణి,  à°°à±‹à°Ÿà°°à±€ క్లబ్ సభ్యులు మంత్రి వెంకట స్వామి, ఆర్టిసి పిఆర్ఓ బి.ఎల్.ప్రసాద్, సెట్ శ్రీ మేనేజర్

వి.వరప్రసాద్, స్వీప్ డైరెక్టర్ రమణ మూర్తి  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam