DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆకట్టుకున్న సీపీఎస్ విద్యార్థుల యోగ సాధన.

విశాఖపట్నం,   జూన్ 21. 2018 (DNS Online): అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (ఉక్కు నగరం) సెక్టార్ 11 లో à°—à°² చైతన్య పబ్లిక్ స్కూల్లో

గురువారం విద్యార్థినీ విద్యార్థులు యోగాసనాలు అత్యద్భుతం గా చేశారు. అంతర్జాతీయ దినోత్సవ సందర్బంగా పాఠశాల లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఎం సిసి కేడెట్లు,

విద్యార్థినీ విద్యార్థులూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈ. చంద్రిక మాట్లాడుతూ యోగ సాధన ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం కలుగుతుందన్నారు. యోగ:

చిత్తవృత్తి నిరోధ: అంటే యోగ మనసు, ఇంద్రియాలను, నియంత్రణలో ఉంచుతుందని, శ్వాసమీద ధ్యాస పెట్టి, అన్నింటినీ మన ఆధీనం లో ఉంచుకోవాలన్నారు. అనంతరం ఎన్ సిసి

కేడెట్లతో యోగాసనాలు, ప్రధానంగా పద్మాసనం, సూర్య నమస్కారం, వజ్రాసన, తాడాసనం, త్రికోణాసనం పరి త్రికోణాసనం, తదితర ఆసనాలు చేయిస్తూ వాటి ఉపయోగానాలను వివరించారు. ఈ

కార్యక్రమం లో పాల్గొన్న ఎన్ సిసి కేడెట్లు, విద్యార్థిని విద్యార్థులను పాఠశాల డైరక్టర్ పి సుశీలా రాణి అభినందించారు. కార్యక్రమం లో ఆర్మ్ , నేవీ, కేడెట్లు, తో

పాటు ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ఎస్ ఆర్ డిజి స్కూల్, వివేకానంద స్కూల్, విద్యార్థులతో పాటు, ఎన్ సిసి ఏ హెచ్ ఓ,లు, వి. లత, పి, నాగ భూషణం, కె. సదాశివరావు, సిబ్బంది, పీఈటీలు

పాల్గొన్నారు.  

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam