DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అందరికీ విద్యే లక్ష్యంగా  పేద చిన్నారులకు  అమ్మ ఒడి పధకం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°ªà±‡à°¦ చిన్నారుల విద్యకు భరోసాగా అమ్మ à°’à°¡à°¿ కార్యక్రమం

ప్రవేశపెట్టడం జరిగిందని రాష్ట్ర రహదారులు,భవనాల శాఖ మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం మబగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో

'జగనన్న అమ్మ ఒడి' కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాష్ట్ర రహదారులు, భవనాల శాఖా మంత్రి ధర్మాన క్రిష్ణదాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన

చేసి ప్రారంభించారు. విద్యార్ధులు చక్కగా విద్యను అభ్యసించుటకు పరిసరాలు బాగుండాలని, సరైన సదుపాయాలు, ఆహారం ఉండాలని అన్నారు. ఆంగ్లంపై మక్కువతో ప్రైవేటు

పాఠశాలలకు చిన్నారులను చేర్చుతున్నారని అన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో ఒకటవ తరగతి నుండి ఆరవ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన

చేయడం జరుగుతుందని చెప్పారు. తెలుగు విధిగా చదవాలని మంత్రి అన్నారు. అంగ్లం లేకపోతే పోటీ పరీక్షల్లో వెనుకబాటులో ఉంటుననారని అందుకే ఆంగ్ల మాధ్యమం

ప్రవేశపెట్టడం జరుగుతుందని అన్నారు. పాఠశాలల ఆధునీకరణను నాడు – నేడు కార్యక్రమంలో చేపట్టడం జరుగుతుందని చెప్పారు. పేదరికంలో ఉన్న తల్లిదండ్రులు తమకు విద్య

లేదని కనీసం తమ పిల్లలు బాగా చదువుకోవాలని తద్వారా మన కుటుంబం బాగుపడాలని కోరుకుంటారని మంత్రి అన్నారు. దీనిని నిజం చేయుటకు ముఖ్య మంత్రి అండగా నిలిచారని

చెప్పారు. పాదయాత్రలో భాగంగా ప్రజల కష్టాలను తెలుసుకున్న ముఖ్య మంత్రి తండ్రి ఆశయాలకు అనుగుణంగా పరిపాలన అందిస్తాను, నేనున్నాను అంటూ ప్రజలకు భరోసా ఇచ్చారని

పేర్కొన్నారు. అందుకు అనుగుణంగానే పరిపాలన సాగిస్తున్నారని చెప్పారు. పేద కుటుంబాలకు సంపూర్ణ రక్షణ కల్పించాలని అమ్మ ఒడి ప్రవేశ పెడుతూ తల్లుల ఖాతాలో రూ.15 వేలు

వేయడం జరుగుతుందని చెప్పారు. దశల వారీగా వివిధ కార్యక్రమాలు విద్యార్ధులకు అందిస్తున్నారని పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయని అత్యంత ప్రాధాన్యతను ముఖ్య

మంత్రి కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరికి వైద్యం అందించాలని, వెయ్యి రూపాయలు దాటిన వైద్యానికి ఆరోగ్య శ్రీలో చేర్చడం జరిగిందని అన్నారు. నరసన్నపేట

సి.హెచ్.సి 50 పడకల ఆసుపత్రిగా ఉన్నప్పటికి సౌకర్యాలు లేవని దానిని 100 పడకల ఆసుపత్రిగా మార్చుతూ రూ.12.60 కోట్లు మంజూరు జరిగిందని మంత్రి తెలిపారు. రైతు భరోసా, మత్స్యకార

భరోసా, కౌలు రైతుకు సహాయం, నేతన్న నేస్తం, వాహన మిత్ర వంటి అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న ప్రభుత్వం అన్నారు. దిశ చట్టంను

తీసుకువచ్చి ఆడ పిల్లలకు భరోసా ఇచ్చారని చెప్పారు. దేశంలోనే ఇది చారిత్రాత్మకమని పేర్కొన్నారు.

   à°œà°¿à°²à±à°²à°¾ విద్యా శాఖ అధికారి కె.చంద్రకళ మాట్లాడుతూ

జిల్లాలో ఒకటి నుండి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్ధులు 4,35,948 మంది ఉండగా, ఈ విద్యార్ధులలో అర్హత గల తల్లులు 2,41,562 మంది ఉన్నారని చెప్పారు. వారందరికి అమ్మ ఒడి

కార్యక్రమం క్రింద నగదు బ్యాంకులో జమ అవుతుందని చెప్పారు. జిల్లాలో 1231 పాఠశాలల్లో నాడు – నేడు కార్యక్రమం క్రింద వసతులు సమకూరుతున్నాయని తెలిపారు.
  à°ˆ

కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి మరియు జిల్లా సహకార అధికారి కె.వెంకట రావు, మండల అధికారులు, అనధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam