DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రహదారి ప్రయాణం లో నిర్లక్ష్యం కూడదు - జాగరూకత అవసరం 

ప్రయాణ సమయంలో మొబైల్ వాడకం ప్రమాద కారకం 

రహదారి భద్రత సామాజిక బాధ్యతగా స్వీకరించాలి 

రహదారి భద్రత అవగాహన సదస్సు లో వక్తలు  

(DNS రిపోర్ట్ : SV

ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌) : రహదారి పై వాహనదారులు, పాదచారులు  à°ªà±à°°à°¯à°¾à°£à°‚ లో ఉన్న సమయంలో నిర్లక్ష్యం కూడదని

విశాఖపట్నం రేంజ్ పోలీసు à°¡à°¿ ఐ జి  à°Žà°²à± కె వి à°°à°‚à°—à°¾ రావు పిలుపునిచ్చారు. గురువారం శ్రీకాకుళం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వైశ్యరాజు కన్వెన్షన్ లో రహదారి భద్రత పై

అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సును ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ ప్రయాణ సమయంలో మొబైల్ వాడకం అత్యంత ప్రమాద కారకం అన్నారు. ఇటీవల కాలంలో నడిచి వెళ్లే వారు సైతం

మొబైల్ లో మాట్లాడుతూ వెళ్లడం ద్వారా వాహనాలు ఢీకొని ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. రహదారి భద్రత సామాజిక బాధ్యతగా స్వీకరించాలన్నారు. వాహనాదులు, పాదాచారుల

అవగాహనతోనే ప్రమాదాల నివారణ సాధ్యం అవుతుందని అన్నరు. ప్రతి ఒక్కరూ రహదారి భద్రతను సంక్షేమంగా గుర్తంచాలని సూచించారు. 

 à°°à°¹à°¦à°¾à°°à°¿ ప్రయాణంలో పాటించాల్సిన

నియమాలపై శివానీ ఇంజినీరింగ్ కళాశాల, కళింగపట్నం బుద్ధ పాఠశాల విద్యార్థులు లఘు నాటికలను ప్రదర్శించి అవగాహన కలిగించారు. రహదారి భద్రత పాటిస్తామని ప్రతిజ్ఞను

డిఐజి రంగారావు చేయించారు. ఈ సందర్భంగా డిఐజి రంగా రావు మాట్లాడుతూ ప్రమాద మరణాలు విశాఖపట్నం రేంజ్ లో జరగరాదని సంకల్పించామన్నారు. జాతీయ రహదారిపై టి జంక్షన్ ల

వద్ద స్పీడ్ బ్రేకర్లు వేయాలని సంబంధిత అధికారులను కోరామని చెప్పారు. సురక్షిత విధానం పాటించక పోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో

ఏడాదికి 3 వందల మంది రహదారి ప్రమాదాల వలన మరణిస్తున్నారని, తగాదాలు – కొట్లాటలలో దాదాపు 20 మంది వరకు మాత్రమే మరణిస్తున్నారని వివరించారు. ప్రపంచంలో రహదారి ప్రమాదాలు

మన దేశంలోనే అధికంగా ఉన్నాయని, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు దేశంలో ప్రమాదంలో మరణిస్తున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో మన రహదారులు విశాలంగా ఉంటాయని

అయినప్పటికి డ్రైవింగులో సురక్షిత విధానం లేకపోవడం, పాదాచారుల అజాగ్రత్త వలన ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు. రాత్రి పూట అతి వేగంతో ప్రయాణించే వాహనం

రహదారిపై వెంటనే నియంత్రణ కష్టం అవుతుందని గుర్తించాలని అన్నారు. రహదారిపై ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే నాగరికత పిల్లలకు నేర్పించాలని సూచించారు.

లైసెన్సు లేని పిల్లలు, రహదారి భద్రతపై అవగాహనలేని పిల్లల డ్రైవింగు వలన ప్రమాదాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు గుర్తించాలని చెప్పారు. రహదారిపై ప్రజల

ప్రవర్తన, వాహనదారుల తీరుతెన్నుల అంశాలను వివరించాలని అన్నారు. ఎదుటివారి ప్రాణాలు విలువైనవని గుర్తించాలని కోరారు. డ్రైవింగ్ లైసెన్సు లేని వారికి బండి ఇస్తే

బండి యజమానికి అపరాధ రుసుము పడుతుందని తెలిపారు. రోడ్ మీదకు వెళితే సురక్షితంగా తిరిగి రాగలమనే నమ్మకం కల్పించాలని డ్రైవర్లకు కోరారు. పాదచారులు కూడా రహదారి

భద్రత పై అవగాహన పెంపొందించుకోవాలని,రహదారి భద్రత సామాజిక బాధ్యత, సంక్షేమంగా పాటించాలని అన్నారు.

          పోలీసు సూపరింటెండెంట్ ఆర్.ఎన్.అమ్మిరెడ్డి

మాట్లాడుతూ జిల్లాలో సుదీర్ఘ జాతీయ రహదారి ఉందన్నారు. జిల్లాలో రహదారి భద్రతకు అనేక చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. రహదారి భద్రతపై అవగాహన చర్యలు పెద్ద ఎత్తున

చేపట్టడం జరుగుతుందని, నిబంధనలు అతిక్రమించిన వారికి  à°…పరాధ రుసుము విధిస్తున్నామని, రోడ్డు నిర్మాణంలో లోపాలను సంబంధిత శాఖల దృష్టికి తీసుకువెళ్ళి

నియంత్రణకు చర్యలు చేపడుతున్నామని అన్నారు. 2020 సంవత్సరంలో జిల్లా జీరో ప్రమాదాల జిల్లాగా చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని చెప్పారు. మోటారు వాహన చట్టంపైన, రహదారి

పరిస్థితిపైన వాహన చోదకులకు అవగాహన ఉండాలని పేర్కొన్నారు. జాతీయ రహదారిపై వాహన రాంగ్ పార్కింగ్ వలన 25 శాతం ప్రమాదాలు జరుగుతుందని గుర్తించామని చెప్పారు. దాభాల

వద్ద పార్కింగ్ చేయవచ్చని తద్వారా ప్రమాదాల నివారణకు సహకారించనవారు కాగలని, ఒక నిండు ప్రాణాన్ని కాపాడగలరని చెప్పారు. సెల్ ఫోన్ వలన 60 శాతం దృష్టి మరలుతుందని

సర్వేలలో వెల్లడైందని, డ్రైవింగు సమయంలో సెల్ ఫోన్ లను స్విచ్ ఆఫ్ చేయాలని సూచించారు. ఒకరి ప్రాణాలు తీసే హక్కు మనకు లేదని పేర్కొంటూ మద్యం సేవించి డ్రైవింగ్

చేయరాదని సూచించారు. డ్రైవింగు సమయంలో కుటుంబ సభ్యులను గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ప్రమాదాలు నివారించాలనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ సహకరించాలని

కోరారు.

జాతీయ రహదారి సంస్థ డిప్యూటి జనరల్ మేనేజర్ హరి కృష్ణ మాట్లాడుతూ ప్రతి వారం కనీసం ముడు కుటుంబాలు యజమానిని కోల్పోతూ దిక్కుతోచని స్థితిలోకి

వెళుతున్నాయన్నారు. జాతీయ రహదారిపై ప్రతి 50 కిలోమీటర్లకు అంబులెన్స్, తదితర సౌకర్యాలను ఏర్పాటు చేసామని చెప్పారు.

ప్రజా రవాణా శాఖ పిఆర్ఓ బి.ఎల్ ప్రసాద రావు

మాట్లాడుతూ ప్రజా రవాణా శాఖలో రహదారి భద్రత పై తీసుకుంటున్న చర్యలను వివరించారు.

శ్రీకాకుళం ఓబిఎస్ ఆటో సంఘం ప్రతినిధి సూరి మాట్లాడుతూ రహదారి భద్రతపై

డ్రైవర్లలో ఇప్పటికే చాలా మార్పు వచ్చిందన్నారు. వేగం కన్నా ప్రాణం మిన్న అని ప్రతి డ్రైవరు గుర్తించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు కుటుంబాన్ని

గుర్తుపెట్టుకోవాలని అన్నారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయరాదని సూచించారు. శరీరానికి కొంత విశ్రాంతి అవసరమని దానిని పాటించాలని పిలుపునిచ్చారు. ఇచ్చాపురంకు

చెందిన ఆటో డ్రైవర్ రాజశేఖర రెడ్డి మాట్లాడుతూ కుటుంబాలు రోడ్ పాలు కాకుండా గమనించాలన్నారు.

ఐసిఐసిఐ బ్యాంక్ మేనేజర్ ఎం. చంద్ర శేఖర్ 50 స్థాపర్లు అందజేశారు.

ఆప్కో సంస్థ 6 హెల్మెట్లను అందజేసింది. ఈ సందర్బంగా రహదారి భద్రత పై లఘు నాటికలు ప్రదర్శించిన శివానీ ఇంజనీరింగు కళాశాల, బుద్ధ పాఠశాల విద్యార్థులకు జ్ఞాపికలను

à°¡à°¿.ఐ.జి అందజేశారు. à°ˆ కార్యక్రమంలో  à°…దనపు పోలీసు సూపరింటిండెంట్ జి.గంగరాజు, డిఎస్పిలు సి.హెచ్.జి.వి ప్రసాద్, à°¡à°¿.ఎస్.ఆర్.వి.ఎస్ మూర్తి, సిఐలు,ఎస్ఐ లు, లారీ, ఆటో

డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam