DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజధానిని విభజిస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుంది

కావాలంటే కడపలో పెట్టుకో: మాజీ ఎంపీ జేసీ

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  09, 2020 (డిఎన్‌ఎస్‌): రాజధానిని ముక్కలు చేసుకుంటూ

పోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం వస్తుందని టీడీపీ నేత జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. కావాలంటే కడపలో పెట్టుకో.. లేకపోతే పులివెందులలో పెట్టుకోమని ఆయన సూచించారు.

విశాఖ వెళ్లాలంటే రాయలసీమ వాసులకు ఇబ్బందన్నారు. రాజధానిని మార్చడం అంత సులభం కాదని చెప్పారు. రాజధాని అమరావతిలో ఉండాల్సిందే.. మరో మార్గం

లేదన్నారు.

తాత్కాలికం తాత్కాలికం అంటూ..చంద్రబాబు పిచ్చి పని చేశారని ఆయన పేర్కొన్నారు. ఇప్పుడున్న భవనాలతో రూపాయి ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చని

జేసీ వ్యాఖ్యానించారు. రాజధానిని అత్యున్నత స్థాయిలో నిర్మించాలనే ఉద్దేశంతోనే ఇప్పుడున్న భవనాలను తాత్కాలికమని చంద్రబాబు చెప్పారన్నారు. రాయలసీమకు

హైకోర్టు వస్తే ఏం లాభం..?..పది జిరాక్స్‌ షాపులు వస్తాయన్నారు. à°¤à°² à°’à°• చోట, చెయ్యి à°’à°• చోట, కాలు మరో చోట పెట్టినట్లు రాజధానిని జగన్‌ విడగొడతానంటున్నాడని జేసీ

మండిపడ్డారు. కడపలోనూ, పులివెందులలో రాజధాని పెడితే తమకు అభ్యంతరం లేదన్నారు. అమరావతిని మారిస్తే మాత్రం రాజధాని రాయలసీమకు రావాల్సిందేనని పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam