DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి లో వైభవంగా శ్రీవారి మెట్లోత్సవం

à°®‌à°¹‌ర్షుల అడుగుజాడ‌ల్లో à°¨‌à°¡‌వాలి: సుగుణేంద్ర‌తీర్థ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): 

తిరుపతి , జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : à°®‌à°¹‌ర్షులు

సూచించిన మార్గంలో à°¨‌à°¡à°¿à°šà°¿ శ్రీ‌వారి వైభ‌వాన్ని, à°§‌ర్మ‌ప్ర‌చారాన్ని à°­‌à°œ‌à°¨ మండ‌ళ్ల à°¸‌భ్యులు à°®‌à°°à°¿à°‚à°¤ విస్తృతం చేయాల‌ని ఉడిపికి చెందిన పుత్తిగె à°®‌ఠాధిప‌తి

శ్రీ‌శ్రీ‌శ్రీ సుగుణేంద్ర‌తీర్థ‌స్వామీజీ ఉద్ఘాటించారు. తిరుమల తిరుపతి దేవస్థానముల ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్వంలో శ్రీవారి త్రైమాసిక

మెట్లోత్సవం శుక్ర‌వారం తెల్లవారుజామున తిరుపతిలోని అలిపిరి పాదాలమండపం వద్ద వైభవంగా జరిగింది. ముందుగా  à°¸à±à°—ుణేంద్ర‌తీర్థ‌స్వామీజీ, దాససాహిత్య ప్రాజెక్టు

ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్యులు మెట్లపూజ నిర్వహించి మెట్లోత్సవాన్ని ప్రారంభించారు.
      à°ˆ సందర్భంగా సుగుణేంద్ర‌తీర్థ‌ మాట్లాడుతూ

బ్రహ్మముహూర్తంలో కాలినడకన మెట్లను అధిరోహించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలమన్నారు. పూర్వం శ్రీపురందరదాసులు, శ్రీ వ్యాసరాజయతీశ్వరులు,

శ్రీమాన్‌ అన్నమాచార్యులు, శ్రీకృష్ణదేవరాయలు లాంటి మహనీయులు భక్తిప్రపత్తులతో తిరుమల కొండలను అధిరోహించి స్వామివారి వైభవాన్ని దశదిశలా వ్యాప్తి చేశారని

వివరించారు. అలాంటివారి అడుగుజాడలలో నడిచి à°† దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ మెట్లోత్సవాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. 
   

దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి పి.ఆర్‌.ఆనందతీర్థాచార్య మాట్లాడుతూ  à°µà°¿à°µà°¿à°§  à°ªà±à°°à°¾à°‚తాల నుండి పెద్ద సంఖ్యలో విచ్చేసిన భజన మండళ్ల సభ్యులు సాంప్రదాయ

భజనలు చేసుకుంటూ సప్తగిరులను అధిరోహిస్తున్నట్టు చెప్పారు. భజన మండళ్ల సభ్యులకు టిటిడి మూడో సత్రం ప్రాంగణంలో ధార్మిక శిక్షణ, హరిదాస కీర్తనల్లో అంత్యాక్షరి,

దాస సాహిత్యంలో రసప్రశ్నల స్పర్థ, సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించినట్టు వివరించారు. ఇక్కడ శిక్షణ పొందిన సభ్యులు తమ తమ ప్రాంతాలకు వెళ్లి భక్తజనావళికి

సనాతన ధార్మిక అంశాలపై శిక్షణ ఇస్తారని తెలియజేశారు.
    à°…ంతకుముందు భజనమండళ్ల à°¸‌భ్యులు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ మూడో సత్రం ప్రాంగణం నుండి అలిపిరి శ్రీవారి పాదాల మండపం వద్దకు

చేరుకున్నారు. అనంతరం పాదాలమండపం వద్ద సంప్రదాయబద్ధంగా మెట్లపూజ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ‌, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన 3,000 మందికిపైగా

భక్తులు భజనలు చేసుకుంటూ తిరుమలగిరులను అధిరోహించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam