DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మొక్కవోని పట్టుదలతో పని చేస్తాం:  నన్నయ వీసీ జగన్నాథరావు

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

రాజమహేంద్రవరం / విశాఖపట్నం, జనవరి  10, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లో à°—à°²  à°†à°¦à°¿à°•à°µà°¿ నన్నయ

విశ్వవిద్యాలయాన్ని నాణ్యమైన ప్రమాణాలతో అన్ని విధాల అభివృద్ది చేస్తామని, మొక్కవోని పట్టుదలతో సమిష్టి కృషితో ప్రగతి పధంలో నడిపిస్తామని వీసీ ఆచార్య మొక్క

జగన్నాథరావు అన్నారు. విశ్వవిద్యాలయంలో శనివారం వీసీ గా ఆచార్య ఎం.జగన్నాథరావు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడారు.

ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ ఉపకులపతి గా నియమించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డికి, విద్యాశాఖమంత్రికి, ఉన్నత విద్యా మండలికి

కృతజ్ఞతలు తెలియజేసారు. నన్నయ విశ్వవిద్యాలయానికి మంచి భవిష్యత్ ఉందని అన్నారు. వర్సిటీలో ఉన్న వనరులు, వసతులు, అధ్యాపకుల కొరతలను తీర్చే విధంగా ప్రయత్నం

చేస్తామని చెప్పారు. అధ్యాపకుల పోస్టులను త్వరలోనే భర్తీ చేసే విధంగా ప్రభుత్వానికి నివేధిస్తామని తెలిపారు. నాక్ గుర్తింపుకు కావల్సిన అన్ని వనరులను

సమకురుస్తామని చెప్పారు. విద్యార్థుల సంక్షేమమే విశ్వవిద్యాలయానికి ముఖ్యమని అన్నారు. అలాగే అధ్యాప, అధ్యాపకేతర సిబ్బందికి సంబంధించిన ఉద్యోగ భద్రత ఉండే

విధంగా చూస్తామని అన్నారు. చాలా కాలంగా టైమ్ స్కేల్ కొరకు పోరాడుతున్నారని దానిని నిబంధన ప్రకారం సఫలికృతం చేసే విధంగా ప్రయత్నిస్తామని చెప్పారు. బోధన

నాణ్యాతలను పెంపొందిస్తామని, పరిశోధనలపై దృష్టిసారిస్తామని, నూతన ప్రోజెక్టులను అప్లై చేస్తామని అన్ని రకాల విద్యా పరమైన ప్రగతిని తీసుకువస్తామని అన్నారు.

జాతీయ స్థాయిలో గుర్తింపులను తీసుకువచ్చి నిధులను సమకూర్చి అభివృద్ది పరుస్తామని తెలిపారు. పరిశ్రమలు, స్వచ్చంద సంస్థలను విశ్వవిద్యాలయానికి సహకారులుగా చేసి

సి.ఎస్.ఆర్ నిధులను పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లోని అన్ని అనుబంధ కళాశాలలతో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం రాష్ట్రంలో అతి

పెద్ద విశ్వవిద్యాలయంగా ఉందని దీనిని అభివృద్ది చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.సురేష్ వర్మ, రిజిష్ట్రార్

ఆచార్య ఎస్.టేకి పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam