DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కనీసం సర్పంచిగానైనా గెలవండి : పవన్ కు గుడివాడ అమర్ సవాల్

ఎమ్మెల్యే à°—à°¾ ఎలాగూ ఓడిపోయారు, అనుభవం వస్తుంది. 

పవన్ అన్ని పనులూ మూడు రకాలుగానే చేస్తారా? 

పెళ్లి, పార్టీలతో పొత్తులూ అన్నీ మూడేనా? దీంతోనైనా

ఆగుతారా?

పీకే పాల్ జత కట్టాల్సింది ఇక కేఏ పాల్ తో నే : గుడివాడ అమర్  

జగన్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు : . .డిఎన్ఎస్  ప్రశ్నకు ధీటైన జవాబు.

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  17, 2020 (డిఎన్‌ఎస్‌) : రానున్న పంచాయితీ ఎన్నికల్లో ఏదేని à°’à°• పంచాయితీ సర్పంచి à°—à°¾ గెలిచి చూపించాలని

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి మరియు అనకాపల్లి శాసనసభ్యులు గుడివాడ అమర్నాథ్ సవాల్ విసిరారు. శుక్రవారం విశాఖ నగరం లోని

వైఎస్సార్ పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు గత ఎన్నికల్లో రెండు ఎమ్మెల్యే స్థానాలకు పోటీచేసిన పవన్ కు కనీసం డిపాజిట్లు

కూడా రాలేదంటే అయన స్థాయి ని ప్రజలు ఎలా డిసైడ్ చేశారో తెలుస్తోందన్నారు. గురువారం జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ బీజేపీ తో చేతులు కలిపి అత్యంత ఘోరమైన తప్పిదం

చేశారన్నారు. ఇంతవరకూ వామ పక్ష పార్టీలతో కలిసి నడిచిన పవన్, నేడు వాటికి భిన్నమైన భావజాలం గల్గిన భారతీయ జనతా పార్టీతో నడవడం తో నే ఆయనకు ఒక నిర్దుష్టమైన

సిద్ధాంతం, నీతి, విలువలు, లేవని తేలిందన్నారు. 

ఇంతవరకూ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంలో కూడా మూడు సార్లు వివాహం చేసుకున్నారని, రాజకీయాల్లోకి వచ్చాక

గతంలో తెలుగుదేశంతో ఒకసారి, బీఎస్పీ తో రెండవసారి పొత్తు పెట్టుకున్నారని, నేడు బీజేపీ తో పొత్తు పెట్టుకుని ఇప్పడికే మూడు పార్టీలతో పొత్తు పూర్తి

చేశారన్నారు. ఇప్పడికైనా మూడు అంకెతో ఆగుతారా లేక ఇంకా ముందుకు సాగుతారా అనేది ఆయనే చెప్పాలన్నారు. 

పీకే పాల్ జత కట్టాల్సింది ఇక కేఏ పాల్ తో నే : అమర్ . . .

కేవలం మూడేళ్ళ కాలం లోనే మూడు పార్టీలతో పొత్తు మార్చిన ఈయన ఇక జత కట్టవలసింది ప్రజాశాంతి పార్టీ మాత్రమేనన్నారు. ఇటు పీకే పాల్, అటు వైపు కేఏ పాల్ జోడి

ప్రజలకు మంచి కామెడీ అందించవచ్చన్నారు. 


రాజధాని వికేంద్రీకరణ ప్రక్రియ వేగవంతమవుతోంది. ఈనెల 20న అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తారన్నారు.

రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన పాత పొత్తు పార్టీలకు వైకాపాకు గతంలో ఏ విధమైన సంబంధాలూ ఏనాడూ లేవన్నారు.  à°•à°¨à±€ వినీ ఎరుగని ప్రజాభిమానంతో జగన్ గారి ప్రభుత్వం

ఏర్పడింది. 

పవన్ కల్యాణ్ ఒక పొలిటికల్ ఫ్రీలాన్సర్ : . . . .

పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక పొలిటికల్ ఫ్రీలన్సర్ అని, సినిమా ల మధ్యలో ఖాళీ సమయంలో జనసేన పార్టీ

ఒకటి ఉందని, నాలుగు మాటలు మాట్లాడేవాళ్ళకి ప్రజా సేవ చెయ్యడం ఏమి వస్తుందన్నారు. బిజెపితో, టిడిపితో, మళ్లీ వామపక్షాలతో, మాయావతితో కలిశారు. మళ్లీ ఇపుడు బిజెపి

అన్నారు. ఎవరితో అయినా కలిసే మీ పార్టీ సిద్ధాంతం ఏమిటి? 
వామపక్షాలకి నేనేమన్నా బాకీయా? అని అడగటం హాస్యాస్పదం. పొలిటికల్ కమిట్మెంట్ లేని వ్యక్తి పవన్ కల్యాణ్

అన్నారు. 

జగన్ ను అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు :. . . 

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ స్పీడ్ ను నిలువరించడానికి భారత ప్రధాని ( బీజేపీ) పవన్ కళ్యాణ్ ను

అస్త్రంగా ప్రయోగించారా అని డిఎన్ఎస్  à°…à°¡à°¿à°—à°¿à°¨ ప్రశ్నకు అమర్ ధీటైన జవాబిచ్చారు.   
రాష్ట్ర ప్రజల అభిమానాన్ని పూర్తి స్థాయిలో పొందిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని అమర్ నాధ్ అన్నారు. ఆయన ప్రకటించిన నవరత్నాలు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయన్నారు. దీనిపై ప్రధాని మంత్రి సైతం

అభినందించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నారు.  

à°ˆ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ అదనపు కార్యదర్శి పక్కి దివాకర్,  à°°à°µà°¿ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam