DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చిల్లర ఇబ్బంది పేరిట. . .ఆర్టీసీ చార్జీల మోత

ఆర్టీసీ బస్సులో ఇక చిల్లర అవసరం ఉండదు. 

విశాఖపట్నం, జూన్  22, 2018 (DNS Online) : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ ( ఏపీఎస్ఆర్ టీసి) ప్రయాణీకులు ఇకపై చిల్లర కోసం

కండక్టర్లతో గొడవలు పడనక్కర లేదు. చిల్లర మీరు అడగనక్కర లేదు, వాళ్ళు ఇవ్వనవసరం లేదు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్లు కొనుగోలు చేసిన తదుపరి తగిన

చిల్లర ఇవ్వలేక పోతున్నామని దీనికి తగిన పరిష్కారం గా ఒక నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎం డీ పేరిట విడుదలైన ఒక అధికారిక ఉత్తర్వుల

ప్రకారం శుక్రవారం ( జూన్ 22 నుంచి) ఆర్టీసీ ప్రయాణీకులకు చార్జీల ధరలు అమాంతం పెరగనున్నాయి.  

Cir.No: 20/2018,dt:19.6.18 మేరకు స్పెషల్  à°Ÿà±ˆà°ªà± జిల్లా సర్వీసులలో (Express,Ultra,Super luxury) అనగా

తెలుగువెలుగు సర్వీసులు తప్ప మిగిలిన అన్ని బస్సుల్లోనూ ఛార్జిలను రౌండప్ చేసి తదుపరి రూ.5.00 లకు సవరించనున్నారు. ఉదాహరణకు: రూ.84.00 ల ప్రస్తుత ఛార్జి ఉంటె దాన్ని

సవరించి రూ.85.00 లు చేయనున్నారు. అలాగే రూ.67.00 ల ప్రస్తుత ఛార్జి ఉంటె దాన్ని సవరించి రౌండప్ చేసి రూ.70.00 లుగానూ, సవరింపబడును. ఈ సవరణల నిబంధన తక్షణం అమలు లోకి వస్తుందని

సూచించారు. 

à°ˆ నిర్ణయం వల్ల చిల్లర కోసం కండక్టర్లు, ప్రయాణీకుల మధ్య ఇప్పుడు జరుగుతున్న గొడవలు మాత్రం తగ్గుతాయి. 

టికెట్ మిషన్లు అప్ డేట్   కాలేదు.. :

 à°¬à°¸à±à°¸à±à°²à±à°²à±‹à°¨à±‡ టికెట్లు ఇచ్చే అవకాశం ఉన్న స్పెషల్ టైపు బస్సులు  à°Žà°•à±à°¸à± ప్రెస్, అల్ట్రా, సూపర్ à°² గ్జా à°°à±€ బస్సుల్లో వినియోగించే టికెట్ మిషన్లు నేటికీ అప్ డేట్

చెయ్యకపోవడం గమనార్హం. ప్రధానం గా రాయితీ ల పై ప్రయాణించే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వీటిల్లో సీనియర్ సిటిజన్, ఆర్టీసీ స్టాఫ్ , హాఫ్ టికెట్ల వరకూ ఇవి

అమలవుతున్నప్పడికీ జర్నలిస్టులకి ఇచ్చిన రాయితీలకు ఈ మిషన్లు చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా ఆర్టీసీ వారు ఇచ్చిన పాస్ ఉన్న జర్నలిస్ట్ లు వారి జిల్లా పరిధి

లో సూపర్ లగ్జారీ బస్సుల వరకూ ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే కండక్టర్లు వీరి పాస్ లను  à°µà°¾à°°à°¿ టికెట్ మిషన్ ఎంటర్ చేసేందుకు అప్షనే లేకుండా పోయింది. దీంతో వారికి

ఇది సమస్యగా మారుతోంది. జర్నలిస్టులకు ఈ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే హక్కు ఉంది, కానీ టికెట్ నుంబర్ లోడ్ చెయ్యకపోతే కండక్టర్ల ఆర్టీసీ తనిఖీ అధికారుల నుంచి

ఇబ్బంది. సత్వరం ఉచితంగా ప్రయాణించే అప్షన్ ను కూడా ఆర్టీసీ బస్సు టికెట్ మిషన్లలో చేర్చవలసిన అవసరం ఉంది. 

 

pix : courtesy to whom so ever it may concern

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam