DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24న నన్నయ స్నాతకోత్సవం, గవర్నర్ రాక 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి / రాజమండ్రి, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లోని ఆదికవి నన్నయ

విశ్వవిద్యాలయ 11వ మరియు 12వ స్నాతకోత్సవాలను ఈ నెల 24వ తేదిన నిర్వహిస్తున్నామని, దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హాజరవుతారని వీసీ ఆచార్య

మొక్కా జగన్నాథరావు తెలిపారు. విశ్వవిద్యాలయంలో శనివారం స్నాతకోత్సవానికి సంబంధించిన వివరాలను వీసీ వెల్లడించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 24వ

తేదిన ఉదయం 10 గంటలకు స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తున్నామని దీనిలో రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ హాజరై పట్టాలను, పతకాలను అందజేస్తారని అన్నారు. ముఖ్య

అతిథిగా రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్ మరియు పాలర మండలి చైర్మన్ ఆచార్య కె.సి.రెడ్డి హాజరై ప్రసంగిస్తారని చెప్పారు. అలాగే

నాయకులు, ఉన్నతాధికారులు, విశ్వవిద్యాలయ అధికారులు, అకడమిక్ సభ్యులు, గోదావరి సాధన సమితి సభ్యులు వంటి ప్రముకులు దీనిలో పాల్గొంటారని తెలిపారు. ఉభయగోదావరి

జిల్లాల్లోని ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలోని పీజీ, పీజీడిప్లామా, యూజీ పీజీ ప్రోఫిషనల్ కోర్సులకు సంబంధించిన 2018 మరియు 2019 విద్యా సంవత్సరాలకు చెందిన

విద్యార్థులు ఇప్పటికే స్నాతకోత్సవానికి దరఖాస్తులు చేసుకున్నారని అన్నారు. స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులందరూ నన్నయ విశ్వవిద్యాలయ వెబ్

సైట్ లో పొందుపరచిన సూచనలను పాటించి స్నాతకోత్సవానికి హాజరుకావాలని తెలిపారు. అలాగే పిహెచ్.డి, గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులకు పట్టాలను, పతకాలను గవర్నర్

చేతుల మీదుగా అందించడం జరుగుతుందని చెప్పారు. కావున స్నాతకోత్సవానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు, పరిశోధకులు, బంగారు పతాకాలు సాధించిన విజేతలు తప్పక

హాజరై జయప్రధం చేయాలని తెలియజేసారు. మరిన్ని వివరాలను యూనివర్సిటీ వెబ్ సైట్ www.aknu.edu.in ను సంప్రదించాలని సూచించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam