DNS Media | Latest News, Breaking News And Update In Telugu

షిర్డీసాయి ద్వారకామాయిని కూడా వివాదాల్లోకి లాగేసారు?

ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆలయ ట్రస్ట్ మండిపాటు 

సాయి పుట్టింది పత్రీ అంటూ రూ. 100 కోట్లు  à°•à±‡à°Ÿà°¾à°¯à°¿à°‚పు 

ఇది హిందూ ధర్మాన్ని తొక్కేందుకు

కాంగ్రెస్ కుట్ర: బీజేపీ . . .

ఆలయం మూసివేస్తున్నారంటూ వార్తలు . . .?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి). . . .

అమరావతి, జనవరి  18, 2020 (డిఎన్‌ఎస్‌) : ప్రపంచ

వ్యాప్తంగా ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శిగా ఖ్యాతిగాంచిన శిడిసాయి నెలకొన్న మహారాష్ట్ర లోని షిరిడీ గ్రామంలోని ద్వారకామాయి ఆలయాన్ని కూడా వివాదాల్లోకి

లాగేసి ఘనత రాజకీయ పార్టీలకే చెల్లింది. 

మహారాష్ట్ర ప్రభుత్వం షిర్డీ సాయి పుట్టింది పత్రీ గ్రామంలోనేనని, షిర్డీ తో సంభంధం లేదంటూ పత్రీ అభివృద్ధికి రూ. 100

కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే ప్రకటించడాన్ని ట్రస్ట్ తప్పు పట్టింది. దీనికి నిరసనగా శనివారం సాయంత్రం షిర్డీ గ్రామస్తులతో చర్చించి

ఆదివారం నుంచి à°’à°• నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. 

ఈ విధంగా షిర్డీ ని ప్రాముఖ్యతని తగ్గించడానికే పత్రీ అనే గ్రామాన్ని వెలుగులోకి తీసుకువచానని

సాయి భక్తులు మండిపడుతున్నారు. ప్రభుత్వం షిరిడీని కాదని పర్భణీకి సాయి మందిరాన్ని తరలించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని

వ్యతిరేకిస్తూ ఆలయాన్ని మూసివేయాలని ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. 

ఇది హిందూ ధర్మాన్ని తొక్కేందుకు కాంగ్రెస్ కుట్ర: బీజేపీ . . .

ఆరు దశాబ్దాల కాలం పాటు

షిర్డీ లోనే కొలువైన సాయిబాబా ను కించపరిచి, హిందూ ధర్మాన్ని అణిచివేసేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్ర అని భారతీయ జనతా పార్టీ ప్రతినిధులు

మండిపడుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర లో శివసేన - కాంగ్రెస్ పార్టీల సంయుక్త ప్రభుత్వం అధికారం లో ఉన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే బీజేపీ-మహారాష్ట్ర సర్కార్

మధ్య దీనిపై రాజకీయ దుమారం రేగుతోంది.

ఆలయం మూసివేస్తున్నారంటూ వార్తలు . . .

పర్భానీ జిల్లా లోని పత్రీ గ్రామమే షిర్డీ సాయి జన్మ స్థానం అంటూ మహారాష్ట్ర

ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల షిర్డీ సాయి సంస్థాన్ ట్రస్ట్ వ్యతిరేకిస్తూ ద్వారకామాయి ని ఆదివారం నుంచు నిరవధికంగా మూసి వేస్తున్నారంటూ వార్తలు రావడం

సాయి భక్తులను కలిచి వేస్తోంది. అయితే ఇంతవరకూ షిర్డీ సాయి సంస్థాన్ పూర్తి స్థాయిలో ఎటువంటి ప్రకటన చెయ్యక పోవడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam