DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో దద్దరిల్లిన రాజధాని అంశం 

చంద్రబాబు అండ్ కో చిట్టా విప్పిన బుగ్గన, 

విరుచుకు పడిన ప్రతిపక్ష ఎమ్మెల్యేలు. .. 

వాడి వేడిగా జగన్ - బాబు వాగ్వాదం. . . 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl

కరస్పాండెంట్ అమరావతి) : . . . . .

అమరావతి, జనవరి  20, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°µà°¿à°­à°•à±à°¤ ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అంశాల పై సమావేశమైన శాసన సభ లో అధికార, ప్రతిపక్ష పార్టీల వాగ్వాదాలు

తారాస్థాయికి చేరుకున్నాయి. సోమవారం ప్రారంభమైన సభలో  à°—à°¤ ప్రభుత్వం (తెలుగుదేశం) చేసిన ఇన్‌సైడ్‌ ట్రేడింగ్‌పై సభకు సంచలన విషయాలు ఆర్ధిక మంత్రి, శాసన సభ

వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ వెల్లడించిన అంశాల పై ప్రతిపక్ష సభ్యులు భగ్గుమన్నారు.  à°…యన సంధించిన అంశాలు ఇవే. . .
గుంటూరు-కృష్ణా జిల్లాల్లో టీడీపీ

నేతలు 4070 ఎకరాలు కొనుగోలు చేశారు
అనంతపురంకు చెందిన పయ్యావుల, పల్లెకు మందడం ఎలా తెల్సు
విజయవాడ చుట్టుపక్కల జనాలకే మందడం అనే ఊరు తెల్సా?
బినామీ పేర్ల మీద

టీడీపీ నేతలు భారీగా భూములు కొనుగోలు
యనమల వియ్యంకుడు తాడికొండలో భూములు కొనుగోలు
07.07.2014 చంద్రబాబు భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు
టీడీపీ నేతలు

రాజధానిలో 40వేల కోట్ల కుంభకోణం చేశారు
అమరావతిలో ఎక్కువ భూములు కొనుగోలు చేసింది జీవీ ఆంజనేయులు
మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కూడా భూములు కొనుగోలు
/> సుజనాచౌదరి బినామీల పేరుతో భూములు కొనుగోలు 
ప్రభుత్వ సంస్థలకు ఎకరా నాలుగు కోట్లు చొప్పన లీజు
ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎకరా రూ.50 లక్షలు చొప్పన 1300 ఎకరాలు

పందేరం
à°ˆ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయదల్చుకోలేదు
శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్‌లో పట్టుబడటం దేనికి సంకేతం?

ఇన్‌సైడ్‌

ట్రేడింగ్‌పై సభకు వివరాలు తెలిపిన బుగ్గన రాజేంద్రనాథ్‌ 

అమరావతి ప్రాంతంలో భూమి, భూసేకరణ ఏవిధంగా చేశారో సభకు బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు. à°ˆ

సందర్భంగా బుగ్గన మాట్లాడుతూ.. అమరావతి భూముల కొనుగోలులో చాలా బాధాకరమైన  à°¸à°‚ఘటనలు జరిగాయని అన్నారు. à°ˆ సందర్భంగా టీడీపీ నేతలకు సంబంధించిన భూముల కొనుగోళ్లలో

జరిగిన కీలక విషయాలను సభకు తెలిపారు. à°ˆ సందర్భంగా జరిగిన పరిణామక్రమాన్ని బుగ్గన వివరించారు. ఎన్నికల ఫలితాలకు ముందు నుంచి ప్లాన్‌ వేసి స్కెచ్‌వేశారన్నారు.

దీనిద్వారా అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని బుగ్గన అన్నారు. దీంట్లో భాగంగా రాజధాని అక్కడ కట్టబోతున్నామని.. ఇక్కడ కట్టబోతున్నామని గుంటూరు

తర్వాత నూజివీడులో ప్రజల్ని తప్పుదోవ పట్టించి భూములు కొనుగోలు చేయించారని బుగ్గన తెలిపారు. అదే సమయంలో ఇక్కడ అమరావతిలో కొందరు టీడీపీ నేతలు సైలెంట్‌à°—à°¾ ఆరు

నెలల్లో భూములు కొనుగోలు చేశారన్నారు. దాదాపు రాజధాని ప్రకటనకు ముందే గుంటూరు-కృష్ణా జిల్లాల్లో 4070 ఎకరాలు తేలిందని బుగ్గన వివరించారు. మరి, ఇక్కడే వారు భూములు

ఎలా కొన్నారని బుగ్గన ప్రశ్నించారు. కొనుగోలు  à°šà±‡à°¸à°¿à°¨ వారిలో ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారని అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌తో

పాటు ఓత్‌ ఆఫ్‌ సీక్రెసీని చంద్రబాబు ఉల్లంఘించారు. అంతేకాకుండా తాడికొండ మండలం కంతేరు గ్రామంలో 14.2 ఎకరాలను హెరిటేజ్‌ ఫుడ్స్‌ పేరుతో చంద్రబాబు భూములు

కొన్నారు. 27/3బీ, 28/2ఏ వద్ద 7.7.2014à°¨ భూములు కొనుగోలు చేశారు. అంటే జులై 2014లో నాలుగు డాక్యుమెంట్స్‌, ఆగస్టు 9, 2014లో ఐదు డాక్యుమెంట్స్‌, జులై 2014లో ఐదు డాక్యుమెంట్స్‌ రిజిష్టర్‌

చేయించుకున్నారు. కంతేరులో 27/3బీ, 28/2ఏ à°’à°• à°Žà°•à°°à°¾ పదిహేను సెంట్లు, సర్వే నెంబర్‌ 56లో à°’à°• à°Žà°•à°°à°¾ పదకొండు సెంట్లు, 62/2బీ రెండు ఎకరాలు, 63/1 0.45 ఎకరాలు, 56లో 1.11 ఎకరాలు, 63/2బీ 1.35 ఎకరాలు, 63/2బీ 1.35

ఎకరాలు, 56లో 2.22 ఎకరాలు, 63/1లో 0.98, 27/3ఏ ఒక్క à°Žà°•à°°à°¾, 63/1లో అర్థ à°Žà°•à°°à°¾, 63/1 à°Žà°•à°°à°¾ మొత్తం 14 ఎకరాలు కొనుగోలు  à°šà±‡à°¶à°¾à°°à±. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నది జూన్‌లో. తర్వాత భూములు కొనుగోలు చేశారు.

ఇది దేనికిందకు వస్తుందని బుగ్గన సూటిగా ప్రశ్నించారు. ఇదిగాక, వాళ్లకు ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. టీడీపీకి చెందిన లంక దినకర్‌ కూడా భూములు కొనుగోలు చేశారు.

అతను ఎక్కడ నుంచి వచ్చారో ఏం చేస్తున్నారో కూడా అందరూ చెబుతున్నారని బుగ్గన వివరించారు. తాడికొండ మం. తుళ్లూరులో సర్వేనెంబర్‌ 488, 267/2/బీ1లో భూములు కొనుగోలు చేశారు.

వేమూరి రవికృష్ణకుమార్ ప్రసాద్‌, సెవెన్‌ జీ లాజిస్టిక్‌ సిస్టమ్స్‌ మీద కొన్ని భూములు, సోదరుడు వేమూరి ప్రసాద్  à°ªà±‡à°°à±à°¤à±‹ భూములు కొనుగోలు చేశారు. రాజధాని ప్రకటన

చేయకముందు వాళ్లు ప్రమాణ స్వీకారం చేశాక కొనుగోలు చేశారని వాటి సర్వే నెంబర్లు బుగ్గన సభకు తెలిపారు. à°ˆ విధంగా చదువుకుంటే పేరుతో లిస్ట్‌లు ఉన్నాయని బుగ్గన

వివరించారు. 

పీఆర్‌ ఇన్‌ఫ్రా పేరుతో పరిటాల కుటుంబీకులు భూములు
యనమల వియ్యంకుడుకు కూడా భూములు 
టీడీపీ పెద్దలందరికీ అమరావతి గ్రామాల్లో ఎకరాల కొద్దీ

భూములు
మాజీ మంత్రి పరిటాల సునీత కూడా పీఆర్ ఇన్‌ఫ్రా పేరుతో కొనుగోలు చేశారన్నారు. పీఆర్‌ ఇన్‌ఫ్రాలో పరిటాల సునీత కొడుకు, అల్లుడు డైరెక్టర్లుగా ఉన్నారని

తెలిపారు. ఆగస్టు, నవంబరు నెలల్లో కొనుగోలు చేశారన్నారు. ధరణికోట, బలుసుపాడు, నెమలికల్లు గ్రామాల్లో à°ˆ కొనుగోళ్లు చేశారన్నారు. జీవీఎస్‌ ఆంజనేయులు వద్ద

బ్రహ్మాండమైన ల్యాండ్‌ బ్యాంక్‌ ఉంది. లిస్ట్‌ చాలా పెద్దదని బుగ్గన తెలిపారు. ఐనవోలు, వెలగపూడి, వెంకటపాలెం, నేలపాడు, మందడం, కొండయ్యపాలెం, కొండపాలెం,

కొండరాజుపాలెంలో జీవీఎస్‌ ఆంజనేయులు 40 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. లింగమనేని రమేష్‌ కూడా మంగళగిరి కాజాలో భూములు కొన్నారు. 368/బీ, 21.07.2014à°¨ భూములు కొనుగోలు చేశారు. 80

ఎకరాలు కనబడుతున్నాయి. ఎయిర్‌ కోస్టా కంపెనీ ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇది బినామీ అనే ఎవరికైనా అర్థమవుతుందని బుగ్గన అన్నారు. ఓవైపు ఆర్థిక

పరిస్థితులు బాగోలేకపోతే ఎకరాలకు ఎకరాలు ఎలా కొంటారని ప్రశ్నించారు. పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ కూడా భూములు కొనుగోలు చేశారని పయ్యావుల విక్రమ్‌ సింహా 3

నవంబర్ 2014à°¨ కొనుగోలు చేశారని, ఆయన బంధువులు భూములు కొనుగోలు చేశారని బుగ్గన తెలిపారు. కంభంపాటి స్వాతి, కంభంపాటి రామ్మోహన్‌ రావు కూతురు అని నంబూరులో,

పెదకాకానిలో భూములు కొన్నారు. వేమురి రవికుమార్‌ కుటుంబ సభ్యులుపై కూడా అమరావతి ప్రాంతంలో భూమలు ఉన్నాయి. కంభంపాటి రామ్మోహన్‌రావులకూ భూములున్నాయి. యనమల

వియ్యంకుడికి తాడికొండలో భూములు ఉన్నాయి. పుట్టా సుధాకర్‌ యాదవ్‌ మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వియ్యంకుడు కుటుంబీకులు పుట్టా మహేష్‌ యాదవ్‌ కూడా

భూములు కొనుగోలు చేశారు. ధుళిపాళ్ల నరేంద్ర కుమార్తె ధూళిపాళ వీరవైష్ణవి 13 అక్టోబర్‌ 2014à°¨ కొనుగోలు చేశారు. విజయవాడలో మందడం, ఉద్ధండరాయపాలెం ఉందని ఎవరికైనా తెల్సా?

వాళ్లకు తెలియంది ఎలా కొంటారు? గుంటూరు-విజయవాడకు మధ్య 40 కి.మీ దూరం ఉంది. ఒక్క రైతులు తప్ప ఎవరు వస్తారు ఇక్కడకు. వాళ్లకు ముందే తెలిస్తే తప్ప అని బుగ్గన

అన్నారు.

బినామీలు పేర్లతో భూములు కొనుగోలు చేసిన టీడీపీ నేతలు
టీడీపీ నేతలకు చెందిన బినామీలు కూడా పెద్ద ఎత్తున భూములు కొనుగోలుకు పాల్పడ్డారు. ఇలా

భూములు కొనుగోలు చేసిన వారిలో నారాయణ గారు ప్రధానంగా కనిపిస్తున్నారు. ఆయనకు ఆవుల మునిశంకర్‌, రాపూరి సాంబశివరావు, పొట్టూరి ప్రమీల, కొత్తవు వర్మకుమార్ బినామీలు.

దమ్మలపాటి శ్రీధర్‌కు పెద్ద ల్యాండ్ బ్యాంక్‌ ఉందని తెలిపారు. పొత్తూరు, పిచ్చుకులపాలెం. వేమూరి రవికుమార్‌ అనే వ్యక్తి నారా లోకేష్‌కు చెందిన బినామీలు వందల

ఎకరాల్లో భూములు ఉన్నాయని బుగ్గన తెలిపారు. దివంగత కోడెల శివప్రసాద్‌ శశిఇన్‌ఫ్రా పేరున 17 ఎకరాలు ఉన్నాయి. అనంతపురంలో ఉండే పల్లె రఘునాథ రెడ్డికి మందడంలో

భూములు కొనుగోలు చేశారు. ఆయనకు ఈఊరు పేరు ఎలా తెల్సు? తెలియనిది ఎలా కొనుగోలు చేస్తారు. మురళీమోహన్‌ యార్లగడ్డ రవికిరణ్‌, యార్లగడ్డ గీతాంజలి, యార్లగడ్డ నిఖిల్‌

ఆదిత్య, జయభేరి ప్రాపర్టీస్‌ పేర్లతో భూములు కొనుగోలు చేశారు. జీవీ ఆంజనేయులు బ్రహ్మాండమైన ల్యాండు బ్యాంకు ఉంది. బుచ్చయ్య చౌదరి గారు గోరంట్ల ఝాన్నీ లక్ష్మీ

పేరు మీద కొనుగోలు చేశారు.  à°®à±Šà°¤à±à°¤à°‚ ఇంత వీరిలో పాటు అనేకమంది టీడీపీ నేతలు 40 వేల కోట్ల కుంభకోణం చేశారని బుగ్గన గణాంకాలను వెల్లడించారు. 

భూముల సరిహద్దులు

మార్చి తమవారికి మేలు చేసిన చంద్రబాబు
లంక, పొరంబోకు, ప్రభుత్వ భూములు దేనినీ వదిలిపెట్టలేదు
భూముల సరిహద్దులు కూడా మార్చారు. 2014-15లో జురానా సుర్బాంగ్ అనే

సింగపూర్‌ కంపెనీ వాళ్లకు ఇచ్చారు. జులై 2015లో 395 à°š.à°•à°¿.మీలకు ప్లాన్‌ వేశారు. 2016 వచ్చిన తర్వాత 217 à°š.à°•à°¿.మీకు తగ్గారు. తగ్గించిన బిట్‌ ఏదైతే ఉంటే.. వాళ్లు ల్యాండ్‌ పూలింగ్‌

ఇవ్వకుండా ఎకరాకు ఎకరాలు మిగిల్చుకునేట్లు ఎకరాకు వెయ్యి గజాలు ఇస్తే.. వీళ్లకు ఎకరాలకు ఎకరాలు మిగిలేట్లు చేశారు. రింగ్‌ రోడ్డును కూడా వాళ్లకు అనుకూలంగా

మార్చుకున్నారని బుగ్గన వివరించారు. లంక భూములు, పొరంబోకు భూములు, ప్రభుత్వ భూములు.. ఇలా వేటినీ వదిలిపెట్టలేదని వీటిని ఇష్టారాజ్యంగా చేశారు. అనంతవురంలో లేని

ప్రభుత్వ భూమి పొరంబోకు భూములు ఇచ్చి ప్లాట్లు తీసుకున్నారు. ఐనవోలు రెండు ఎకరాల 98 సెంట్లు, బోరిపాలెం అనే ఊరిలో, కేఆర్‌ పాలెంలో ఆరు ఎకరాల 47 సెంట్లు,

లింగాయపాలెంలో మొత్తం 158 ఎకరాలు ప్రభుత్వ భూమి, నేలపాడు, పిచ్చుకాయలపాలెంలో 9 ఎకరాల చిల్లర,  à°¶à°¾à°–మూరు 3 ఎకరాలు, వెలగపూడి 3 ఎకరాలు ల్యాండ్‌ తీసుకున్నారు. తర్వాత

రాయపూడి.. ఇలా రకరకాల స్కీంలు సృష్టించారు. కొంతమంది భూములు పోతే.. అసైన్డ్‌ ల్యాండ్‌ ఏమైతే ఉందో.. దాన్ని కొనటానికి పోయి.. అసైన్డ్‌ భూమిపోయిన వారు వెళ్లి అడిగితే

అది పనికి రాదని చెప్పి.. శివాయ్‌జమీందార్‌ పేరుతో జీఓలు ఇచ్చి కావాల్సిన వారిని పెట్టుకొని తీసుకున్న భూములు దాదాపు 289 ఎకరాలు మార్చుకున్నారు. ట్యాంకులు ఉన్నాయో..

వాటిని కూడా తీసుకొని ఇచ్చారుని వాటి వివరాలను బుగ్గన సభకు తెలిపారు. 

మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ కూడా భూములు కొనుగోలు
సుజనాచౌదరి బినామీల పేరుతో

భూములు కొనుగోలు 
సుజనా చౌదరి కూడా బినామీలతో ప్రాపర్టీలు కొనుగోలు చేశారని బుగ్గన తెలిపారు. ఇక మరోప్రముఖ వ్యక్తి మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌

ఉన్నారన్నారు. దమ్మాలపాటి నేరుగా భూములు కొనుగోలు చేశారు. ఆనాడు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులో ఉంటూ ఆయన భూములు కొనుగోలు చేశారు.  à°…న్యాయమైన కొనుగోలు ఆయన

చేశారని బుగ్గన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అక్రమంగా ప్రభుత్వ భూములను కొన్నారు. వ్యాపారం లక్ష్యంగా పెట్టుకొని ఇంత దారుణం చేశారు. ఎస్సీల భూములు కూడా

తీసుకున్నారు. 300 ఎకరాల భూములు కొనుగోలు చేశారు. కొల్లి శివరాం, గుమ్మడి సురేష్‌, బొలుసు శ్రీనివాస్‌లు లోకేశ్‌ బాబుకు బినామీలు అని ఏ సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కు

వెళ్లినా చెబుతారని బుగ్గన తెలిపారు. ఇలా ఎవరెవరికి బినామీలు ఉన్నారో 380ఎకరాలకు సంబంధించిన బినామీల పేర్లను బుగ్గన రాజేంద్రనాథ్‌ సభకు తెలిపారు. 28వేల మంది రైతులు

భూములను ఇస్తే.. అందులో 14వేల మంది రైతులు ఆల్రైడీ భూములు అమ్ముకున్నారు. ప్లాట్లు ఇస్తే.. 8వేల ట్రాన్‌సాక్షన్‌లు జరిగాయి. దీనిని రాజధాని నిర్మాణం అంటారా.. లేదా

రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం అంటారా అని బుగ్గన నిలదీశారు. 

ప్రభుత్వ సంస్థలకు ఎకరా నాలుగు కోట్లు చొప్పన లీజు
ప్రైవేటు సంస్థలకు మాత్రం ఎకరా రూ.50 లక్షలు

చొప్పన 1300 ఎకరాలు పందేరం
అమరావతి ప్రాంతంలో 1646 ఎకరాల భూములను 2016-19 మధ్యలో 125 ఆర్గనైజేషన్లకు కేటాయించారు. 1300 ఎకరాలను 66 ప్రైవేటు సంస్థలకు ఇచ్చారు. 7 కేంద్ర ప్రభుత్వ

సంస్థలకు 69 ఎకరాలకు, పబ్లిక్‌ సెక్టార్‌ యూనిట్స్‌కు 180 ఎకరాలు, నాలుగు ఏపీ ప్రభుత్వ సంస్థలకు 7ఎకరాలు, పబ్లిక్‌ అండర్‌ టేకింగ్‌ 87ఎకరాలు కేటాయించారు.

డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పోస్ట్‌కు ఎకరాకు రూ.కోటి చొప్పన 60 సంవత్సరాలకు లీజు ఇచ్చారు. ఇండియన్‌ నేవీకి 15 ఎకరాలు.. 60 ఏళ్లకు లీజు ఇచ్చారు. కాగ్‌కు, సీబీఐ, బీఐఎస్‌, ఐఎండీ,

మినిస్టరల్‌ ఎక్స్‌టర్నల్‌ ఎఫైర్స్‌, ఆర్మీ, ఎన్‌సీసీ కూడా à°Žà°•à°°à°¾ కోటి చొప్పన 60 ఏళ్లకు లీజుకు ఇచ్చారు. ఎస్‌బీఐ. ఎల్‌ఐసీ, ఆంధ్రా బ్యాంకు, న్యూ ఇండియా

ఇన్‌స్యూరెన్స్‌, హెచ్‌పిసియల్‌, బీపీసీఎల్‌, ఇండియన్‌ బ్యాంకు, హడ్కో, విజయ బ్యాంకు, కెనరా బ్యాంకు, గెయిల్‌ ఇండియా లిమిటెడ్‌ తదితర ప్రభుత్వ à°°à°‚à°— సంస్థలకు రూ.4

కోట్ల చొప్పున అప్పగించారు. ప్రైవేటు సంస్థలకు విట్‌ ఏపీ 250 ఎకరాలు, ఎస్‌ఆర్‌à°Žà°‚ 200 ఎకరాలు, అమృతా యూనివర్శిటీ 200 ఎకరాలు, ఇండో యూకే యనివర్శిటీ ఆఫ్‌ హెల్త్ 150 ఎకరాలు,

మెడిసిటీ హెల్త్‌ 100 ఎకరాలు, బీఆర్‌ఎస్‌ మెడిసిటీ ఇలా ప్రైవేటు సంస్థలకు ఎకరాకు రూ.50 లక్షల చొప్పున కట్టబెట్టారు. వరుణ్ హాస్పిటాలిటీ నాలుగు ఎకరాలు కోటిన్నర,

మహాలక్ష్మి ఇన్‌ఫ్రా వెంచర్స్‌ నాలుగు ఎకరాలు కోటిన్నర, ఇంద్రాయి నాలుగున్నర ఎకరాలు.. నచ్చిన హోటల్స్‌కు ఇచ్చారు. మళ్లీ కన్వెన్షన్‌ సెంటర్లు వచ్చారు. అదీనూ..

అమరావతి కన్వెన్షన్‌ సెంటర్‌ డెవలపర్‌ వరుణ్‌ హాస్పిటాలిటీకే. లీజు à°•à°‚ రెవిన్యూ షేర్‌. ఫార్చూన్‌ మురళీ రిసార్ట్‌ హోటల్‌ లీజ్‌ కమ్‌ రెవిన్యూ షేర్‌. ఇలా

విచ్చలవిడిగా ఎవరిదో సొమ్ము.. ఎవరిదో అన్నట్లు.. మొత్తం స్వాహా..చేశారు. రాజధాని పేరు చెప్పి అన్ని భూములను టీడీపీ నేతలు స్వాహా చేశారు. ఇంత స్కామ్‌లో అమరావతిని

రాజధానిగా కట్టాలంటారా?. వ్యాపార ఉద్దేశంతో చంద్రబాబు అమరావతిని చేపట్టారని బుగ్గన రాజేంద్రనాథ్‌ సభకు గణాంకాలతో సహా లెక్కలు వివరించారు. 

చంద్రబాబే

రాజధాని నిర్మాణానికి 4-5 లక్షల కోట్లు అవసరమన్నారు
à°ˆ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయదల్చుకోలేదు
శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్‌లో పట్టుబడటం

దేనికి సంకేతం?
ప్రతిపక్షనేత మొదట్లో రాజధాని నిర్మాణానికి రూ.4-5 లక్షల కోట్లు అవసరం అవుతుందని చెప్పిన సంగతిని ఈ సందర్భంగా బుగ్గన గుర్తు చేశారు. హుడ్కో,

వరల్డ్‌బ్యాంకు నుంచి రుణాలు తెస్తామని చంద్రబాబు అన్నారు. మొత్తానికి అప్పుల ఊబిలోకి తీసుకుపోయారు. 28వేల మంది రైతుల్లో 14వేల మంది భూములు అమ్ముకున్నారు. ఇది చాలా

ఇబ్బందికరమైన పరిస్థితి. మిగతా రాష్ట్రం కూడా చూడాలని బుగ్గన అన్నారు. రాయలసీమలో తీవ్రమైన దుర్భిక్షంలో ఉన్నారు. కప్పులకు పెళ్లిళ్లు చేస్తున్నారు. ఆప్రాంతంలో

డొక్కల కరువు.. ముష్టికరువు అని పేర్లు కూడా పెట్టారు. గతంలో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఇక్కడకు వచ్చి కన్నీరు కార్చారని బుగ్గన అన్నారు. పెద్ద పెద్ద భూస్వాములు

కూడా గంజి లేదని అన్నారు. ఏ ప్రాంతం వెళ్లినా లేబర్ వచ్చారంటే.. విజయనగరం, శ్రీకాకుళం నుంచి వస్తున్నారు. శ్రీకాకుళం మత్స్యకారులు పాకిస్తాన్‌ వరకు వెళ్లి

పట్టుబడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వారిని శ్రీ వైయస్‌ జగన్‌ గారు వదిలించారు. కొర్ర మల్లయ్య, అల్లూరి సీతారామయ్య రాజు ఉన్న ప్రాంతం. తాగటానికి నీరు

లేదు, ఉద్ధానం వంటి సమస్యలు ఉన్నాయి. బాంబే వ్యభిచార గృహాల్లో అనంతపురం, కడప నుంచి వచ్చారని చెబుతున్నారంటే రాయలసీమ ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉందో అర్థం

చేసుకోవాలి. à°ˆ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసే ఉద్దేశంలో లేదు. à°—à°¤ ఐదేళ్ల తప్పులు చెప్పటం లేదు. à°—à°¤ వందేళ్లలో జరిగిన తప్పులు మళ్లీ పునరావృతం కాకుండా à°ˆ

ప్రభుత్వం చూస్తుందని బుగ్గన రాజేంద్రనాథ్‌ తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam