DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రద్దు కోరితే దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ రద్దవుతాయి 

మండలి చైర్మన్ చంద్రబాబు చెప్పినట్టు ఆడుతున్నారు,  

చంద్రబాబు కుట్ర తో మండలి పరువు తీసాడు:  

85 లో ఎందుకు రద్దు చేశారో మీ తాతను అడుగు, లోకేష్ కు

చురక 

మండలిలో మాజీ ప్రతిపక్షనాయకుడు దాడి  à°µà±€à°°à°­à°¦à±à°°à°°à°¾à°µà± 

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం): . . . .

విశాఖపట్నం, జనవరి  21, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వ్యవహరిస్తున్నారంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ

దాడి వీరభద్ర రావు మండిపడ్డారు. మంగళవారం విశాఖపట్నం లోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాసన సభలో ఆమోదం పొందిన రాజధానుల

బిల్లులను బిఏసీ లో చేర్చిన తర్వాత కూడా సభలో చర్చకు అనుమతించ కుండా ఉండటం పై  à°šà±ˆà°°à±à°®à°¨à± కు అధికారం లేదన్నారు. దీనిపై తన వ్యాఖ్యలపై చైర్మన్ వివరణ కోరితే మండలికి

వచ్చి వివరిస్తామన్నారు. 

రద్దు కోరితే దేశం మొత్తం రద్దవుతాయి: . . . 

అధికార పార్టీ శాసన మండలిని రద్దు చేస్తుంది అంటూ పూరకర్లు కోట గోడలు

దాటుతున్నాయన్నారు. అయితే ప్రస్తుతం వరకు  à°µà±ˆà°Žà°¸à±à°¸à°¾à°°à± కాంగ్రెస్ కు  à°ˆ ఉద్దేశం లేదన్నారు. అయినా పార్టీ, మంత్రి వర్గం పూర్తిగా చర్చించి మండలిని రద్దు చేద్దాం

అని నిర్ణయిస్తే. .  à°ˆ మండలి రద్దు అనేది కేవలం ఆంధ్ర ప్రదేశ్ కు మాత్రమే పరిమితం కాదని, దేశంలోని మిగిలిన 7 రాష్ట్రాల్లోని శాసన మండలి సభలు కూడా రద్దు అవుతాయన్నారు.

దీనికి ప్రధాన కారణం గతం లోనే భారత ప్రధాని నరేంద్ర మోడీ శాసన మండలి ఉండాలా వద్ద అనే అంశం పై దేశంలోని అన్ని రాష్ట్రాల ఉద్దేశ్యాలను అధికారికంగా

సేకరించారన్నారు. దీనిపై పూర్తి నివేదిక ఇంకా మోడీ వద్దే సజీవంగా ఉందన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి రద్దు కై కేంద్రాన్ని అనుమతి కోరితే. . .ఈ

దెబ్బకు మిగిలిన 6 రాష్ట్రాల్లోని పెద్దల సభలు కూడా మూసుకుపోతాయనాన్రు. 

గతంలో ఎందుకు రద్దు చేసారో మీ తాత ను అడుగు : . . . 

సనస మండలి పై అవాకులు చెవాకులు

మాట్లాడుతున్న ఎంఎల్ సి లోకేష్ పై దాడి నిప్పులు చెరిగారు. సభ ను ఎలా రద్దు చేస్తారు అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ. . 1985 లో నాటి ముఖ్యమంత్రి ఏన్ టి రామారావు

( మీ తాత ను ) నాటి శాసన మండలిని ఎందుకు రద్దు చేశారో చరిత్ర తెలుసుకోమంటూ చురక అంటించారు.  à°¨à°¾à°¡à± కేవలం 31 రోజుల్లోనే పెద్దల సభను రద్దు చేసిన సందర్భం ఆంధ్ర లోనే

ఉందన్నారు. శాసనమండలికి మంగళవారం 14 మంది మంత్రులు వచ్చారని లోకేష్ ప్రశ్నించడం విడ్డూరం అనీ, అతని తెలివితక్కువ తనాన్ని బహిర్గతం చేస్తోందన్నారు. 
గతంలో 30 మంది

మంత్రులు పెద్దల చట్ట సభకు వచ్చి, సభ సమావేశాల్లో పాల్గొన్న సందర్భాలు ఉన్నాయన్నారు. వీరంతా కేవలం తనను అడ్డుకోడానికి వచ్చేవారన్నారు. 

యనమలకు తెలియదా,

నటిస్తున్నారా? : . . . 

యనమల రామకృష్ణుడు కౌన్సిల్ రద్దుకు ఏడాది, రెండేళ్లు పడుతుంది అంటున్నారు. 1985 ఏప్రిల్ 30 న తీర్మానం చేయగా నాటి ప్రధానిరాజీవ్ గాంధీ జూన్

ఒకటికల్లా దాన్ని ఆమోదింపజేశారు. 31 రోజులు పట్టింది. కనుక యనమల సరైన సలహాలు ఇవ్వాలి. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam