DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజానికి మనం ఏమి ఇచ్చాం అన్నదే ప్రధానం: గవర్నర్ 

నన్నయ వర్శిటీ స్నాతకోత్సవం లో విశ్వభూషణ్ పిలుపు  

జిల్లాలో వనరుల వృద్ధి కై పరిశోధనలకు కృషి చెయ్యాలి: కేసి రెడ్డి  

6 పిహెచ్.డి లు, 8 గోల్డ్ మెడల్స్, 567

పీజీ పట్టాలు ప్రదానం        

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి / రాజమహేంద్రవరం, జనవరి  24, 2020 (డిఎన్‌ఎస్‌) : సమాజం మనకేమిచ్చింది అని కాదు,

సమాజానికి మనం ఏమి ఇచ్చాం అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం లో జరిగిన ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ వేడుకల్లో కులపతి హోదాలో  à°†à°¯à°¨ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

గాంధీ మహాత్ముని 150 à°µ జయంతి జరుపుకుంటున్న సందర్బంగా దేశ ప్రజలు ఆయన ఆశయాలను అనుసరించవలసిన అవసరం ఉందన్నారు.  1921 లో విజయవాడ వచ్చిన సందర్బంగా ఆయన నాడు గడిపిన

క్షణాలను జ్ఞప్తి చేసుకున్నారు. ఆయన చెప్పిన అంశాల్లో ప్రధానమైనది సమాజ హితం ప్రతి ఒక్కరి భాద్యత అని విద్యార్థులకు సూచించారు. అంతకు ముందు  à°°à°¾à°œà±€à°µà± గాంధీ

యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్ మరియు పాలకమండలి చైర్మన్ డాక్టర్  à°•à±‡. చెంచు రెడ్డికి గౌరవ డాక్టరేట్ ప్రదానం  à°šà±‡à°¸à°¾à°°à±. 

ఈ విశ్వ విద్యాలయం

ద్వారా వివిధ కోర్సుల్లో పీజీలు, పరిశోధనలు పూర్తి చేసిన విద్యార్థులకు విద్యా పట్టాలు ప్రదానం చేసారు. ఉభయగోదావరి జిల్లాల్లోని 567 మంది విద్యార్థులకు పీజీ

పట్టాలు, 8 స్వర్ణ పతకాలు, 6 పిహెచ్.డి లు అందుకున్నారు.

ఈ సందర్బంగా విశిష్ట అతిధిగా పాల్గొన్న రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఛాన్సలర్

మరియు పాలకమండలి చైర్మన్ డాక్టర్  à°•à±‡. చెంచు రెడ్డి మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా à°² విద్యార్థులకు అభ్యున్నతి కోసం నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్

రెడ్డి  à°ªà±à°°à°¾à°°à°‚à°­à°¿à°‚à°š బడిన విద్యాలయమే ఆదికవి నన్నయ వర్శిటీ అని తెలిపారు. విశ్వ విద్యాలయం ఆయా ప్రాంతాల విద్యావ్యాప్తి లో ప్రధాన భూమిక

వహించాలన్నారు. 

విద్యా వేత్త, ఆంధ్ర ప్రదేశ్ విద్యార్థుల పాలిట విద్యా వారధి à°—à°¾ పేరుగాంచిన దివంగత ముఖ్యమంత్రి  à°¡à°¾à°•à±à°Ÿà°°à± వైఎస్ రాజశేఖర్ రెడ్డి సుదీర్థ

దృష్టి తో ప్రతి జిల్లా లోనూ విద్యా వ్యాప్తి విస్తృతంగా సాగాలనే సంకల్పనతో ప్రతి జిల్లాలోనూ ఒక విద్యాలయాన్ని నెలకొల్పారన్నారు. ఆ క్రమం లో ఆయా ప్రాంతాలలోని

ఆర్ధిక, సామాజిక, వనరుల అభివృద్ధి కి ఈ విద్యాలయాలు కృషి చెయ్యాలని నిర్దేశించారన్నారు. దీనిలో భాగంగానే ఉభయ గోదావరి జిల్లాలో విస్తృతంగా అందుబాటులో ఉన్న వనరులు

చమురు,  à°®à°¿à°¨à°°à°²à±,.ఆక్వా, పాడి పంటల లో మరిన్ని పరిశోధనలకు కృషి చెయ్యాలని నన్నయ విద్యాలయాన్ని ప్రారంభించారన్నారు. వీటిని సద్వినియోగం చేసుకుని సమాజానికి మంచి

పరిశోధనలను అందించాల్సిన భాద్యత విద్యార్థులకు ఉందన్నారు. 
స్థానిక అంశాలైన చమురు,  à°®à°¿à°¨à°°à°²à±,.ఆక్వా, పాడి పంటల రంగాలలో విద్యార్థులు ఇంటర్న్ షిప్ లు ఎక్కువగా

జరగాలన్నారు. అప్పుడే విద్యాలయ స్థాపనకు అర్ధం ఉంటుందన్నారు. 
పదేళ్ల తర్వాత à°ˆ విద్యాలయానికి వచ్చానన్నారు.  

అంతకు ముందు ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం

ఆవిర్భావం, అనంతరం సాధించిన అభివృద్ధి తదితర అంశాలను ఉపకులపతి డాక్టర్ à°Žà°‚. జగన్నాధ రావు సభకు వివరించారు. 

ఆదికవి నన్నయ విశ్వ విద్యాలయం స్నాతకోత్సవ

వేడుకల్లో ఆంధ్ర ప్రదేశ్ ఉన్నత విద్య మండలి చైర్మన్ డాక్టర్ హేమ చంద్ర రెడ్డి, నన్నయ వర్శిటీ సంస్థ ఉన్నతాధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam