DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆకట్టుకున్న తిరుమల బ్రహ్మోత్సవ శకటం.

అంగరంగ వైభవంగా హస్తినలో గణతంత్ర దినోత్సవం

త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించిన రాష్ట్రపతి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి) : . .

.

న్యూఢిల్లీ  / అమరావతి, జనవరి  26, 2020 (డిఎన్‌ఎస్‌) : à°­à°¾à°°à°¤ 71à°µ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో అంబరాన్ని అంటుతున్నాయి. రాజ్‌పథ్ వేదికగా

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ సందర్భంగా ఇండియన్ ఆర్మీ 21-గన్ సెల్యూట్ చేసింది. లెఫ్టినెంట్ కల్నల్ సి.సందీప్

సారథ్యంలోని 2233 ఫీల్ట్ బ్యాటరీ కమాండ్ ఆధ్వర్యంలో గన్ సెల్యూట్ జరిగింది. ముఖ్య అతిథిగా బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో హాజరయ్యారు. త్రివిద దళాల గౌరవ వందనం

స్వీకరించడంతో కన్నులపండువగా పెరేడ్ మొదలైంది.

ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, హోం శాఖ మంత్రి అమిత్‌à°·à°¾, ఆర్థిక మంత్రి నిర్మలా

సీతారామన్, బీజేపీ అగ్రనేత ఎల్‌కే అడ్వానీ, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, కేంద్ర

మంత్రి నితిన్ గడ్కరి, పలువురు ఇతర మంత్రులు, పలు రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

అగ్రగామిగా ఆకట్టుకున్న తిరుమల

బ్రహ్మోత్సవ శకటం.

 à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రఖ్యాత శ్రీవైష్ణవ క్షేత్రం తిరుమల శ్రీనివాసుని బ్రహ్మోత్సవాల వైభవాన్ని సూచించే తిరుమల

బ్రహ్మోత్సవ శకటం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అత్యంత ఆకర్షణగా అన్ని శకటాల్లోకి అగ్రగామిగా నిలిచింది. ఈ శకటం పై అన్నమయ్య కీర్తనలు ఆలపిస్తూ గాయకులూ,

కోలాటాలు ఆకట్టుకున్నాయి. 

రాజస్థాన్, తమిళనాడు సహా 21 రాష్ట్రాలకు చెందిన శకటాలు రిపబ్లిక్ పరేడ్‌లో పాల్గొని ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నారు. అసోం

నుంచి వెదురు, కేన్ కళాకృతులతో రూపొందిన శకటం, విలేజ్ పోగ్రాంతో రూపొందించిన జమ్మూకశ్మీర్ శకటం, జానపద కళారీతులతో కూడిన తమిళనాడు శకటం, విశ్వమానవ విలువలను

ప్రతిబిబించే అనుభవ మంటప కాన్సెప్ట్‌తో రూపొందించిన కర్ణాటక శకటాలతో పాటు రాజస్థాన్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్‌, ఒడిశా శకటాలు కూడా à°ˆ పరేడ్‌లో

పాల్గొన్నాయి.

దీనికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ ఇండియా గేట్ సమీపంలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. స్మారక స్థూపం వద్ద

పుష్పగుచ్ఛం ఉంచి దేశ ప్రజల తరఫున శ్రద్ధాంజలి ఘటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ నరవనే, నావికాదళ చీఫ్ అడ్మిరల్ కరంబీర్

సింగ్, వాయిసేనాధిపతి ఎయిర్ మార్షల్ ఆర్‌కేఎస్ బదూరియా, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అనతరం రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే వేడుకలకు మోదీ

బయలుదేరి వెళ్లారు. రాజ్‌పథ్ వద్ద రిపబ్లిక్ డే వేడుకల ముఖ్య అతిథి జైర్ బోల్సోనారో, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు వేదకపైకి

సాదరంగా తీసుకువెళ్లారు. అనంతరం వేడుకలు మొదలయ్యాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam