DNS Media | Latest News, Breaking News And Update In Telugu

న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి: ముప్పాళ్ల 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, జనవరి  27, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రం లోని న్యాయవాదుల సంక్షేమమే లక్ష్యంగా భారత న్యాయవాదుల సంఘం

పనిచేస్తుందని, సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల సుబ్బారావు తెలిపారు. నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన సందర్బంగా సోమవారం తూర్పు గోదావరి జిల్లా

రాజమహేంద్రవరం లోని ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ నెల్లూరు లో  à°ˆ నెల 25 à°¨ జరిగిన రాష్ట్ర మహా సభలో రాష్ట్రంలో న్యాయవాదులు

ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి తీర్మానం చెయ్యడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి న్యాయవాదులు ఈ సభకు హాజరయ్యారన్నారు. ఈ సభకు ముఖ్య

అతిధులుగా ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయ మూర్తులు జస్టిస్ ప్రవీణ్ కుమార్, జస్టిస్ శేషశై, ఆంధ్ర ప్రదేశ్ బార్ కౌన్సిల్ చైర్మన్ గంటా రామారావు తదితరులు

విచేసినట్టు తెలిపారు. 
ఈ సభలో రాష్ట్రంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు న్యాయస్థానాల్లో ఉన్న సమస్యలు పై చర్చించామన్నారు. ప్రధానంగా న్యాయవాదులకు

ఇచ్చే సంక్షేమ నిధులను రూ.10 లక్షలకు పెంచే విధంగా ప్రభుత్వం సహకరించాలని, న్యాయవాదులందరికి హెల్త్ కార్డులు ఇవ్వాలని, జూనియర్ నీయవాదులకు ఇస్తున్న రూ. 5 వేల ఉపకార

వేతనాన్ని తక్షణమే విడుదల చెయ్యాలని కోరారు. హైకోర్టు నుంచి దిగువ స్థాయి న్యాయస్థానాల వరకూ ఉన్న న్యాయమూర్తుల పోస్టులను తక్షణమే భర్తీ చెయ్యాలని, ఇతర సిబ్బంది

పోస్టులను కూడా భర్తీ చేయాలన్నారు. న్యాయస్థానాల్లో కనీస మౌలిక వసతులు కల్పించాలని, న్యాయవాదులకు ఎటువంటి నిబంధనలు లేకుండా సంక్షేమ పధకాన్ని అందరికీ అమలు

చేయాలన్నారు. గత ప్రభుత్వం లో డెత్ బెనిఫిట్ కు సంబంధించి 4 లక్షల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తామంటూ ఇచ్చిన జీవో ను తక్షణమే అమలు చేసేందుకు ప్రభుత్వం

పూనుకోవాలన్నారు. ఆరులందరికీ ఇళ్ల స్థలంలో మంజూరు చెయ్యాలని, స్పెషల్ కోర్టులకు న్యాయమూర్తులుగా విశ్రాంత న్యాయమూర్తులను కాకుండా, సీనియర్ న్యాయవాదులను

నియమించాలని డిమాండ్ చేసారు. ప్రజల హక్కులను పరిరక్షించేందుకు చట్టపరంగా పనిచేస్తున్న న్యాయవాదుల మీద తప్పుడు కేసులు పెట్టి ఇరికించకుండా ఉండే విధంగా

న్యాయవాదుల పరిరక్షణ చట్టాన్ని అమలు లోకి తీసుకు రావాలన్నారు. పెండింగ్ కేసులకు కారణాల మూలాన్ని వెతికి సత్వర పరిష్కారానికి కృషి చేయాలన్నారు. ప్రస్తుతం 10 లక్షల

మంది జనాభాకు సుమారు 13 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారని, వాటిని కూడా తక్షణం భర్తీ చెయ్యాలని తదితర అంశాలను మహాసభ ఆమోదించిందన్నారు. 

రాష్ట్ర కమిటీ

ఎన్నిక  à°à°•à°—్రీవం 

ఈ నెల 25 న నెల్లూరు లో జరిగిన సభలో భారత న్యాయవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు ను, ప్రధాన

కార్యదర్శి à°—à°¾ చలసాని అజర్ కుమారులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam