DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజీ మార్గం ద్వారా  న్యాయం అందించడమే లక్ష్యం 

లోక అదాలత్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ చైర్మన్ వెంకటప్రసాద్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : చిన్న చిన్న

తగాదాలు,ఆస్తి వివాదాలు, ప్రభుత్వ సంస్థలతో వివాదాల పరిష్కారానికి రాజీ మార్గం ద్వారా సమన్యాయం అందించడమే లక్ష్యంగా లోక అదాలత్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్

పినిచేస్తుందని సంస్థ జిల్లా  à°šà±ˆà°°à±à°®à°¨à±, రిటైర్డ్ జడ్జి  à°¶à±à°°à±€ వెంకట ప్రసాద్ అన్నారు. జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ(à°¡à°¿ ఎల్ ఎస్ ఏ) ద్వారా ఎంపికైన  à°ªà°¾à°°à°¾ లీగల్

వాలంటరీ లకు శ్రీ వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో  à°®à±‚డు రోజుల శిక్షణలో భాగంగా భాగంగా రెండవరోజు మంగళవారం కార్యక్రమంలో శ్రీ వెంకట ప్రసాద్ మాట్లాడుతూ,

రోడ్డు,విమాన రవాణా లో ఉండే తగాదాలు,నీటి సరఫరా, విధ్యుత్ సరఫరా,విద్యాలయాల్లో సమస్యలు,ఇన్సూరెన్స్,హాస్పిటల్స్,డిస్పెన్సరీలు,బి ఎస్ ఎన్ ఎల్, టెలికాం

సంస్థలు,హౌసింగ్,రియల్ ఎస్టేట్ వంటి 13రకాల ప్రజోపయోగ సమస్యలను రాజీ మార్గం ద్వారా, కేసుల విచారణ ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎక్కడ సమస్య అయినా సరే పరిష్కరించడానికి

రాజమహేంద్రవరం లోక అదాలత్ పబ్లిక్ యుటిలిటీ సర్వీసెస్ పనిచేస్తోందని వివరించారు. ఇలాంటి సమస్యలను లోక్ అదాలత్ దృష్టికి తీసుకు రావడంలో పారా లీగల్ వాలంటీర్లు

కృషి చేయాలనీ ఆయన సూచించారు. సంప్రదింపులు,రాజీ ద్వారా ఇచ్చే అవార్డు  à°•à±‹à°°à±à°Ÿà±à°²à±à°²à±‹ ఇచ్చే డిక్రీ తో సమానమని,పైగా అవార్డు ఇచ్చాక అప్పీలుకు అవకాశం కూడా ఉండదని

ఆయన చెప్పారు. తమ దగ్గరకి వచ్చిన సమస్యల్లో రాజీ కుదరని పక్షంలో సాక్షాల సేకరణ చేసి, సహజ న్యాయ సూత్రాలను అనుసరించి తీర్పులు కూడా వెల్లడించే విధానం కూడా

ఉందన్నారు. ఎలాంటి కోర్టు ఫీజులు చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 
  1951 నాటికి సగటు జీవన  à°ªà±à°°à°®à°¾à°£ వయస్సు 42ఏళ్ళుంటే, 1980-90ల్లో 58ఏళ్ళుండేదని, ప్రస్తుతం 67ఏళ్లకు చేరిందని

ఆయన వివరిస్తూ , వృద్ధులు,తల్లిదండ్రులను నిరాదరణకు గురిచేసిన సంఘటనల్లో వారికి న్యాయం చేయడానికి 2007లో ఒక చట్టం కూడా చేసారని,సెక్షన్ 125కింద కేసులు వేయవచ్చని శ్రీ

వెంకట ప్రసాద్ చెప్పారు. సెక్షన్ 17ప్రకారం న్యాయవాదులను కూడా ఉచితంగా  à°à°°à±à°ªà°¾à°Ÿà±à°šà±‡à°¸à±‡ వెసులు బాటు ఆయన తెలిపారు. పారా వాలంటీర్లు సమస్యలు గుర్తించి లోక్ అదాలత్ à°•à°¿

తీసుకురావడం ద్వారా పరిష్కారానికి చొరవచూపాలని ఆయన సూచించారు. 
   à°®à±€à°¡à°¿à°¯à±‡à°·à°¨à± ట్రైనర్ శ్రీ పి. శ్రీనివాస్ మాట్లాడుతూ దేశంలో న్యాయస్థానాల్లో కేసుల సంఖ్య

హెచ్చి, దీర్ఘకాలం పెండింగ్ లో ఉండడం వలన సత్వర న్యాయం అందడంలేదని గ్రహించి 1987లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు  à°ªà±à°°à°¤à±à°¯à°¾à°®à±à°¨à°¾à°¯ న్యాయం కోసం  à°¡à°¿ ఎల్ ఎస్ ఏ

 à°à°°à±à°ªà°¡à°¿à°‚దని వివరించారు. రాజీ పడడానికి వస్తే, కోర్టు ద్వారా మీడియటర్ ని నియమిస్తారని అక్కడ నిర్భయంగా అన్ని విషయాలు చెప్పుకోవచ్చని,రికార్డ్ చేయడం లాంటివి

ఉండవని,అన్నీ పరిశీలించి సమన్యాయం అందేలా చేయడమే దీని ఉద్దేశ్యమని వివరించారు.  à°°à°¾à°œà±€ మార్గమే రాజమార్గమని ఆయన చెప్పారు. సానుకూల దృక్పధం అలవర్చుకోవాలన్నారు.

ఇలాంటి రాజీ న్యాయ బద్ధంగా ఉంటుందని, ముఖ్యంగా వివాద రహిత గ్రామాలుగా రూపొందాలలన్నదే దీని ఉద్దేశ్యమని చెప్పారు. మీడియేటర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ ఇరు

పార్టీలు అంగీకారంతో లోక్ అదాలత్ కి వస్తే, ఇక్కడ ఇచ్చే అవార్డు కి అప్పీలు ఉండదన్నారు. మీడియేటర్ దగ్గర ఎప్పుడు పడితే అప్పుడు సమయం,వారం తో సంబంధం లేకుండా ఇరు

పార్టీలు తమ విజ్ఞప్తులు చేసుకోవచ్చని ఆమె తెలిపారు. ఆస్తి తగాదాలు,అన్నదమ్ములు అక్కాచెల్లెళ్ల మధ్య గొడవలు, భార్య భర్తల మధ్య గొడవలు, వంటివన్నీ ఇక్కడ

పరిష్కరించుకోవచ్చన్నారు. ఈసందర్బంగా చిన్న స్కిట్ కూడా ప్రదర్శింపజేశారు. వ్యక్తుల మనోగతాలకు అనుగుణంగా, ఎలాంటి విబేధాలకు తావులేకుండా సంతోషంగా రాజీ పడడమే

దీని ఉద్దేశ్యమని డి ఎల్ ఎస్ ఏ సెక్రటరీ హిమబిందు చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam