DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రూ. 1, 28,000 చోరి సొత్తు రికవరీ : శ్రీకాకుళం సీఐ రమణ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 23à°¨ శ్రీకాకుళం  à°¬à°²à°— ప్రాంతంలో చోరీ కాబడిన సొత్తును నిందితుల

నుండి  à°°à°¿à°•à°µà°°à±€ చేయడం జరిగిందని శ్రీకాకుళం రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పోలీస్ ఇన్ స్పెక్టర్ పి.వెంకట రమణ వెల్లడించారు. à°ˆ మేరకు ఆయన మంగళవారం సాయంత్రం  2  à°µ

పట్టణ పోలీస్ స్టేషనులో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలగ సమీపాన గల బూబమ్మనగర్ లోని శ్రీ శివప్రియ రైస్ మిల్లు నందు జనవరి 23

సాయంత్రం 6.00గం.లకు మిల్లులోని టేబులుపై హ్యాండ్ బ్యాగ్ లో ఉన్న రూ.1,70,000/-ల నగదు, మొబైల్ ఫోన్ మరియు తాళాలు చోరీకాబడినట్లు రెడ్డి రమణమూర్తి (75) పోలీస్ స్టేషనులో ఫిర్యాదు

చేసారని చెప్పారు. ఆ ఫిర్యాదు మేరకు గట్టి నిఘాను పెట్టి తనతో పాటు సిబ్బంది సహకారంతో నిందితులను మంగళవారం మధ్యాహ్నం 3.00గం.ల సమయంలో శాంతినగర్ కాలనీలో పట్టుకోవడం

జరిగిందని అన్నారు. నిందితుల నుండి రూ.1,28,000/-ల నగదుతో పాటు మొబైల్ ఫోన్ మరియు తాళాలను రికవరీ చేయడం జరిగిందని వివరించారు. నిందితులలో ఒకరైన కొయ్యాన సత్యం ( ౩౧ )

చోరీకాబడిన  à°°à±ˆà°¸à± మిల్లు యజమాని వద్ద à°—à°¤ ఆరు మాసాలుగా డ్రైవరుగా పనిచేస్తున్నాడని, రెండవ నిందితుడైన బరాటం హరీష్ ( ౧౯ ) కొయ్యాన సత్యంకు సన్నిహితుడని వెల్లడించారు.

దుర అలవాట్లు వలన ఇద్దరు సన్నిహితులయ్యారని, చోరీకి మూడు రోజుల ముందుగా పక్కా ప్లాన్ వేసుకొని నిందితులు చోరీచేసినట్లు పేర్కొన్నారు. కొయ్యాన సత్యం బలగలోని

కుమ్మరివీధిలో నివశిస్తుంటుండగా, బరాటం హరీష్ రాగోలు వద్దగల గూడేం నివాసి అని, నిందితులకు ఇది ప్రథమ కేసు అని ఆయన వెల్లడించారు. రైస్ మిల్లు యజమాని ప్రతీరోజు

సాయంత్రం 6.00గం.లకు సొమ్ము ఉన్న బేగుతో వెళ్తారని తెలుసుకొని ఇద్దరు నిందితులు చోరీచేసినట్లు చెప్పారు. నిందితులపై ఐపిసి 380 నమోదు చేయడం జరిగిందన్నారు.
/> నిందితులను పట్టుకోవడంలో టు టౌన్ సబ్ ఇన్ స్పెక్టర్ యం.ముకుందరావు, హెడ్ కానిస్టేబుల్ బి.సత్యనారాయణ, పోలీస్ కానిస్టేబుల్ యస్.ఉషాకిరణ్, పి.యస్.యస్.ప్రకాశ్,

బి.సాయికృష్ణ సహకరించారని ఆయన పాత్రికేయులకు వివరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam