DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు రాష్ట్రాల్లో హిందువులకు రక్షణ కరువు : వి హెచ్ పి.

ఆలయాల ధ్వంసంలో దోషులను కఠినంగా శిక్షించాలి .

హిందు గుళ్ళల్లో క్రైస్తవ మత ఉద్యోగులను బయటకు పంపాల్సిందే.   

రాష్ట్రపతికి వినతి పత్రం పంపిన విశ్వ

హిందూ పరిషత్  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . . 

విశాఖపట్నం, జనవరి  28, 2020 (డిఎన్‌ఎస్‌) : రాజకీయ స్వార్ధ వైఖరితో ఓట్లు కోసం హిందువుల మనోభావాలను

దెబ్బ తీస్తూ చేస్తున్న దాడుల నేపధ్యం చూస్తే తెలుగు రాష్ట్రాల్లో హిందువులకు రక్షణ కరువు అయ్యిందని విశ్వ హిందూ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ ( ఉత్తరం) ప్రాంత సహా

కార్యదర్శి జి. సుబ్రహ్మణ్య శర్మ మండిపడ్డారు. బుధవారం విశాఖపట్నం మండల రెవిన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో హిందువు

విశ్వాసాలను కించపరిచే విధంగా కొన్ని గ్రూప్ లు, అన్యమత ప్రచార సంస్థలు పెచ్చూ మీరిపోయి, హిందూ దేవాలయాలను సైతం కూల్చి వేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నోరెత్తక

పోవడం చూస్తే వీళ్లకు మద్దతు ప్రకటిస్తున్నట్టుగానే ఉందన్నారు. 
గత అనేక సంవత్సరాలుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు క్రైస్తవ, మహమ్మదీయ

సంతృప్తీకరణ ద్వారా ఓటు బ్యాంకు నిర్మాణం చేసుకోవడం కోసం అనేక హిందూ వ్యతిరేక వివక్షత తో కూడిన విధానాలు అమలు చేస్తున్నాయని శర్మ మండిపడ్డారు. 
ఇంతకాలం వరకూ

మతప్రచారం వరకే పరిమితమైన క్రైస్తవ సంఘాల తీరు, నేడు బహిరంగంగానే ఆలయాలను కూల్చి, ఆలయాల్లోని భక్తులని నేరుగా మతమార్పిడిళ్ళకు గురిచేస్తున్నారన్నారు. దీనికి

నిదర్శనమే తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం పట్టణం లో ఇటీవల 23 ఆలయాల్లోని దేవీదేవతలు విగ్రహాలు కూల్చి మలమూత్రాలను వాటిపై వేసిన ఘటనలపై పోలీసు ఫిర్యాదు చేసినా

నేటికీ అతీగతీ లేదన్నారు. తీరా à°’à°• నిందితున్ని పట్టుకుంటే మతిభ్రమించి వ్యక్తిగా చిత్రీకరించి, వదిలేసిన స్థితిలో à°ˆ రాష్ట్రం ఉందన్నారు. 
పైగా దోషులే ఆ

పట్టణం లోని అర్చక కుటుంబాలను బెదిరించిన సంఘటనలు వెలుగు చూశాయన్నారు. ఆలయాల ధ్వంసం పై ఫిర్యాదు చేస్తే అట్రాసిటీ కేసులు పెట్టి జీవితాలు లేకుండా చేస్తామని,

తక్షణం గ్రామం వదిలి బయటకు పోవాలని హెచ్చరించినట్టుగా కూడా వార్తలు రావడం అత్యంత దౌర్భాగ్యం అన్నారు. ఈ దేశంలో హిందువులకు జీవించే హక్కు కూడా లేకుండా

చేస్తున్న à°ˆ ప్రభుత్వాల కబంద హస్తాల నుంచి హిందూ ఆలయాలకు విముక్తి కల్గించాలని డిమాండ్ చేసారు. 

హిందూ గుళ్ళల్లో క్రైస్తవులను బయటకు పంపాల్సిందే. . .

:

ప్రపంచం లోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన హిందూ పవిత్ర క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుమల, వరాహ లక్ష్మి లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం - సింహాచలం,

సత్యనారాయణ స్వామి దేవస్థానం - అన్నవరం సహా అన్ని హిందూ దేవాలయాల్లోని హైందవేతర ఉద్యోగులను తక్షణం బయటకు పంపాలని డిమాండ్ చేసారు. వీళ్లకు నెల వారీగా జీతాలు

వచ్చేది అదే హిందూ దేవాలయంలోని హుండీల్లో వచ్చే ముడుపుల నుంచేనన్నారు. అయితే హిందూ దేవుళ్ళ పై వేళ్ళకు నమ్మకం ఉండదు, కానీ ఆ దేవునికి హిందూ భక్తులు వేసే డబ్బులు

మాత్రం వీళ్ళు జీతాలుగా తీసుకునేందుకు మాత్రం సిగ్గు పడరు అని ఎద్దేవా చేసారు. 

ఆంధ్ర ప్రదేశ్, లో ప్రభుత్వం ఖజానా ( ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ) నుంచి

చర్చిలు, మసీదుల నిర్మాణానికి కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారన్నారు. ఒక కోలనీలో ఒకే క్రైస్తవ కుటుంబం ఉన్న, అక్కడ చర్చ్ నిర్మాణకి అనుమతి

ఇచ్చేస్తున్నారన్నారు. అదే ప్రాంతంలోని హిందూ కుటుంబాలు నానా ఇబ్బందులకు గురవుతున్నాయన్నారు. క్రైస్తవ పోస్టర్లకు రూ. 5 వేలు, ముల్లాలకు రూ. 10 వేలు , మేజమ్స్ కు 5 వేలు

ఇవ్వడం ద్వారా మతమార్పిళ్లను ప్రోత్సహిస్తున్నారన్నారు. 

హిందువుల పట్ల కక్ష సాధింపే : . . . 
ఇతర మతస్తులకు ప్రతి నెలా కోట్లాది రూపాయలు అప్పనంగా

దోచిపెడుతున్న ప్రభుత్వాలు, హిందువుల పట్ల పూర్తిగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నామన్నారు. హిందువుల పండగలు సంక్రాంతి, దసరా సమయాల్లో రైల్ చార్జీలు, బస్సు

చార్జీలు రెండు రేట్లు, మోటు రేట్లు పెంచేస్తూ, హిందువుల జేబులకు చిల్లులు పెడుతున్నాయన్నారు. అదే విధంగా క్రైస్తవ, ముస్లిం యాత్రలకు ఉచితంగా బస్సులు, విమానాలు

కూడా నడుపుతూ హిందువులను కించపరుస్తూ పూర్తిగా కక్ష సాధింపు చర్యగానే భావిస్తున్నామన్నారు. 

క్రైస్తవులకే హిందూ గుళ్ళలో పెద్దపీట :

ప్రభుత్వాలు

ఉద్దేశ పూర్వకంగానే హిందూ దేవాలయాల్లో ఇతర మతాలకు చెందిన అధికారులను, పాలక మండళ్ల లో చైర్మన్ లుగాను, సభ్యులు గానూ నియమిస్తూ పూర్తిగా హిందూ ఆలయాలను భ్రష్టు

పట్టిస్తున్నాయన్నారు. కోర్టు తీర్పులను కూడా పట్టించుకోకుండా మైనారిటీలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం హిందూ దేవాలయాల నిర్వహణకు దాతలు ఇచ్చిన వేలాది

ఎకరాల భూములను ప్రభుత్వాలు స్వాధీనం చేసుకుంటూ ఆలయాల ఆదాయానికి à°—à°‚à°¡à°¿ కొడుతున్నాయని మండిపడ్డారు.  

ఈ రకమైన విధానాల వాళ్ళ గుంటూరు జిల్లా కలెక్టర్ ఒక

క్రైస్తవ మాట సమావేశంలో à°ˆ రాష్ట్రంలో క్రైస్తవ ప్రభుత్వం ఉన్న కారణంగా క్రైస్తవులందరికే ఉద్యోగాలొస్తున్నాయి అని చెప్పడం జరిగిందన్నారు. 

ఈ రెండు

ప్రభుత్వాల అండదంలను చూసుకుని క్రైస్తవ మిషనరీలు, ముస్లిం మౌల్విలు వివిధ ప్రాంతాల్లో హిందువుల పై ఘర్షణ వాతావరణాన్ని సృష్టించి అశాంతికి

గురిచేస్తున్నాయన్నారు. 

ఈ విధమైన భయబ్రాంతుల మధ్య ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందువులకు మనశాంతి లేకుండా పోయిందని, దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా

అన్ని మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు. అనంతరం మండల రెవిన్యూ కార్యాలయ అధికారులకు వినతి పత్రాన్ని

అందించారు. 

రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నా పరిస్థితులపై భారత రాష్ట్రపతికి à°’à°• వినతి పత్రం కూడా పంపనున్నట్టు తెలిపారు. 

ఈ నిరసనల్లో విశ్వ హిందూ

పరిషత్ విశాఖ నగర అధ్యక్షులు ఓ. నీలకంఠం, కార్యదర్శి అప్పలరాజు, డిడి ప్రసాద రాజు, ప్రధాన కార్యదర్శి పూడిపెద్ది శర్మ, ఎం. రవీంద్ర, అఖిల భారత్ విద్యార్థి పరిషత్ నగర

అధ్యక్షుడు వాసు, డాక్టర్ కెవివి సత్యనారాయణ, రామకృష్ణ  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam