DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విద్యాలయాల్లో వేద అధ్యయన కేంద్రాలను ప్రారంభించండి 

సాహితీ రాజధాని రాజమండ్రితో ఆరంభం కావాలి. . .

నన్నయ వర్శిటీ వీసీ కి ప్రభుత్వ సలహాదారు అజేయ కల్లం సూచన

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 01, 2020 (డిఎన్‌ఎస్‌) : విద్యా వ్యవస్థలు మరింత ఉన్నత స్థితికి చేరుకోవాలంటే ప్రతి విశ్వ విద్యాలయం లోనూ వేద అధ్యయన కేంద్రం నెలకొల్పాలని

ప్రభుత్వ సలహాదారు, మాజీ ఐఏఎస్ అధికారి అజయ్ కల్లమ్ సూచించారు. శనివారం ఆయన్ను కలిసిన ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ మొక్క జగన్నాధరావుకు

సూచించినట్టు తెలిపారు. ఈ మేరకు జగన్నాధరావు సమావేశ వివరాలకు తెలియచేస్తూ ఒక ప్రకటన విడుదల చేసారు. ఆంధ్ర ప్రదేశ్ సాంస్కృతిక రాజదాని గా ప్రఖ్యాతి గాంచిన

రాజమహేంద్రవరం వేదవిద్యకు, సంస్కృతి, సంప్రదాయాలకు నిలయమని, ఆ ప్రాంతంలోనే మొదటి వేద అధ్యయన కేంద్రం ప్రారంభించాలని సూచించినట్టు తెలిపారు.

 à°µà°¿à°¶à±à°µà°µà°¿à°¦à±à°¯à°¾à°²à°¯à°‚లోని ప్రస్తుతం ఉన్న విద్యాపరమైన, పరిశోధనపరమైన విషయాలను వీసీ వివరించారు. అలాగే భవిష్యత్ లో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయాన్ని ఏ విధంగా

అభివృద్ది చేస్తామనే ప్రణాళికను ఆయనకు తెలియజేసారు. దీనిపై అజేయ కల్లం ఐఏఎస్ మాట్లాడుతూ ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవానికి తొలిసారిగా గవర్నర్ ను

తీసుకువచ్చి విజయవంతంగా నిర్వహించినందుకు వీసీ మొక్కా జగన్నాధరావును కల్లమ్ అభినందించారు. 

తన ప్రతిభను గుర్తించి రాష్ట్రలోనే అతిపెద్దదైన ఆదికవి

నన్నయ విశ్వవిద్యాలయానికి వైస్ చాన్సలర్ గా నియమించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసారు. తనపై ప్రభుత్వానికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని

చేసి విశ్వవిద్యాలయాన్ని ప్రగతి పధంలో నడిపిస్తానని వీసీ తెలియజేసారు.

వేదాలకు, సంస్కృతికి, సంస్కరణలకు కేంద్రమైన రాజమహేంద్రవరంలో “సెంటర్ ఫర్ వేదిక్

స్టడీస్”ను ఏర్పాటు చేయాలని à°ˆ సందర్భంగా అజేయ కల్లం సూచించారు. నూతన కోర్సులు, నవ పరిశోధనలు, ప్రోజెక్టులు చేపట్టి విద్యాపరమైన అభివృద్దిని తీసుకురావాలని

అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి నన్నయ విశ్వవిద్యాలయానికి కావల్సిన వనరులను, వసతులను సమకూర్చి అభివృద్ది చేసే విధంగా తన పూర్తి సహకారాన్ని

అందిస్తానని అజేయ కల్లం తెలిపారు. ఆర్ధిక, సామాజిక, రాజకీయ, విద్య వేత్తలు ఉన్న గోదావరి జిల్లాల వాసుల సహాయ సహకారాలను కూడా ఉపయోగించుకొని విశ్వవిద్యాలయ

అభివృద్దిలో అందరని భాగస్వాములను చేయాలని సూచించారు. ప్రభుత్వం నుండి విశ్వవిద్యాలయానికి పూర్తి సహాకారాన్ని అందిస్తామని అజయకల్లం భరోసానిచ్చినట్లు వీసీ

తెలియజేసారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam