DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏయూ ఇంజనీరింగ్ కాలేజీని ఐఐ ఈటీగా అప్ గ్రేడ్ చెయ్యాలి

ఆనందకృష్ణన్‌ కమిటీని సూచనలు అమలు చెయ్యాలి 

రాజ్యసభలో వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి విజ్ఞప్తి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . 

.

విశాఖపట్నం, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) : దాదాపు తొమ్మిది దశాబ్దాల చరిత్ర గలిగిన  à°µà°¿à°¶à°¾à°–పట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలోని ఎయు ఇంజనీరింగ్‌ కళాశాలను

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీ (ఐఐఈఎస్టీ) స్థాయికి పెంచాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయ సాయిరెడ్డి

కేంద్రాన్ని కోరారు. రాజ్యసభలో మంగళవారం ప్రత్యేక ప్రస్తావన ద్వారా ఈ అంశం లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత విద్యకు ఉద్దీపన కల్పించే ఉద్దేశంతో

 à°¦à±‡à°¶à°‚లో పేరెన్నికగన్న కొన్ని విద్యా సంస్థలను జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా సంస్థల స్థాయికి ప్రభుత్వం ఆనందకృష్ణన్‌ కమిటీని నియమించిందన్నారు. కమిటీ

దేశంలోని కొన్ని విద్యా సంస్థలను గుర్తించి వాటిని జాతీయ ప్రాధాన్యత కలిగిన విద్యా సంస్థల స్థాయికి పెంచాలని తన సిఫార్సులలో ప్రభుత్వానికి సూచించింది. స్థాయి

పెంచిన విద్యా సంస్థలను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్‌, సైన్స్‌, టెక్నాలజీగా గుర్తించాలని కూడా కమిటీ  à°ªà±‡à°°à±à°•à±Šà°¨à±à°¨à°Ÿà±à°²à± ఆయన చెప్పారు. à°† విధంగా

ఆనందకృష్ణన్‌ కమిటీ గుర్తించిన విద్యా సంస్థలలో విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ కూడా ఉందన్నారు.
సాంకేతిక విద్యారంగంలో నూతన

విధానానికి శ్రీకారం చుడుతూ పరిశోధనలకు పెద్దపీట వేయడం ఐఐఈఎస్టీల ఏర్పాటు వెనుక ఉన్న ఉద్దేశం. ఐఐఈఎస్టీలలో 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్‌ డ్యూయల్‌ డిగ్రీ ఇన్‌

ఇంజనీరింగ్‌, 5 ఏళ్ళ ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ మొదలైన కోర్సులు ఆఫర్‌ చేయాలని నిర్ణయించడం జరిగింది. అలాగే ఐఐఈఎస్టీలలో అంతర్జాతీయ విద్యార్ధులు, ఫ్యాకల్టీకి

ప్రవేశం కల్పించేలా నియమనిబంధనల రూపకల్పన జరిగినట్లు ఆయన చెప్పారు. à°ˆ నేపథ్యంలో ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్‌ కాలేజీని ఐఐఈఎస్టీ స్థాయికి పెంచుతూ

ప్రభుత్వం చట్ట సభలలో బిల్లును ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఐఐఈఎస్టీ స్థాయికి పెంచిన ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీలో పునరుత్పాదక ఇంధనం,

నేవల్‌ ఆర్కిటెక్చర్‌, షిప్‌ బిల్డింగ్‌, జల, వాతావారణ పరిశోధనలకు సంబంధించిన విభాగాలను ఏర్పాటు చేయాలి. 2014లో బెంగాల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, 2012లో బెనారస్‌ హిందూ

యూనివర్శిటీకి చెందిన ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలను ఏ విధంగానైతే ఐఐఈఎస్టీ స్థాయికి పెంచారో ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ స్థాయిని కూడా అదే విధంగా

పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam