DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ధూమ పానం వద్దు .. కేన్సర్ కు గురికావద్దు : రెడ్ క్రాస్  

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 04, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°•à±‡à°¨à±à°¸à°°à± వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రెడ్

క్రాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.జగన్మోహన రావు పిలుపునిచ్చారు. ప్రపంచ కేన్సర్ దినోత్సవం సందర్భంగా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలోశ్రీకాకుళం లోని ఏడు రోడ్ల కూడలి

వద్ద రెడ్ క్రాస్ కార్యకర్తలు, పలు పాఠశాలల విద్యార్ధులతో మానవ హారం నిర్వహించి కేన్సర్ పై అవగాహన కలిగించే నినాదాలను చేసారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ రాష్ట్ర

ఉపాధ్యక్షులు జగన్మోహన రావు మాట్లాడుతూ కేన్సర్ ఒక భయంకరమైన మహమ్మారి అన్నారు. ధూమ పానం, మద్యం సేవించడం, ప్లాస్టిక్ పదార్ధాలను విచక్షణా రహితంగా ఉపయోగించడం

వంటి కారణాల వలన కేన్సర్ కు అనేక మంది గురి అగుచున్నారని పేర్కొన్నారు. కేన్సర్ గూర్చి పెద్ద ఎత్తున చర్చించాల్సిన అవసరం ఉందని తద్వారా అవగాహన పెరుగుతుందని

అన్నారు. కేన్సర్ కు గురి కాకుండా ముందుగానే అన్ని చర్యలు చేపట్టాలన్నారు. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతుతో సహా శరీరంలోని ఏ అవయవానికైనా కేన్సర్ వచ్చే

అవకాశాలు ఉన్నాయని చెప్పారు. సక్రమమైన ఆహారపుఅలవాట్లు పాటించడం వలన కేన్సర్ భారీన పడకుండా ఉండవచ్చని సూచించారు. ప్లాస్టిక్ సంచులు, కప్పులలో ఆహారపదార్ధాలు

తీసుకోరాదని, నిల్వ చేయరాదని ఆయన చెప్పారు. 
    à°œà°¿à°²à±à°²à°¾ పౌరసంబంధాల అధికారి ఎల్.రమేష్ మాట్లాడుతూ ఆధునిక జీవన శైలిలో విపరీతమైన మార్పులు సంభవించాయని తద్వారా

కేన్సర్ వంటి భయంకర వ్యాధులకు గురికావడం జరుగుతుందన్నారు. కేన్సర్ వ్యాధికి ప్రత్యేక లక్షణాలు ఏమి ఉండవని, ఏదేని ఒక వ్యాధితో దీర్ఘకాలికంగా అస్వస్ధతకు గురి

అయినపుడు దానిని కేన్సర్ గా అనుమానించాలని సూచించారు. దిన చర్యలో భాగంగా వినియోగించే వస్తువులలో సైతం కేన్సర్ కారకాలు ఉంటున్నాయని వాటిని గమనించి

ఉపయోగించుకోవాలని పేర్కొన్నారు. 
    à°†à°¯à±à°·à± వైద్యులు à°¡à°¾.జగదీష్ మాట్లాడుతూ కేన్సర్ కు మానవ తప్పిదాల వలన అధికంగా గురికావలసివస్తుందన్నారు. ధూమపానం వలన

కేన్సర్ వస్తుందన్నారు. వ్యాధులకు సకాలంలో సరైన వైద్యం చేయించుకోవాలని తద్వారా భయంకర మహమ్మారి భారీన పడకుండా ఉండగలమన్నారు. వేడి పానీయాలు, ఆహార పదార్ధాలు

ప్లాస్టిక్ లో వేసుకుని తినడం వలన కేన్సర్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. 
    à°µà°¿à°¶à±à°°à°¾à°‚à°¤ అదనపు డిఎంహెచ్ఓ à°¡à°¾.కృష్ణమోహన్ మాట్లాడుతూ ప్రపంచ జనాభాలో 6

శాతం మంది కేన్సర్ వ్యాధితో బాధపడుతున్నారన్నారు. ప్రతి ఒక్కరూ అవగాహన పొందాలని అన్నారు. à°ˆ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు బాడాన దేవభూషణ రావు, విశ్రాంత

జిల్లా విద్యా శాఖ అధికారి బలివాడ మల్లేశ్వర రావు, ఎన్.టి.ఆర్.ఎం.హెచ్ పాఠశాల ఉపాధ్యాయులు బి.రామచంద్రరావు, సెయింట్ పాల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రెడ్ క్రాస్

ప్రతినిధులు, పలు పాఠశాలల విద్యార్ధులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam