DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సుస్థిర లక్ష్యాల దృష్టితోనే రాష్ట్రం లో పాలన: వాసిరెడ్డి పద్మ

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం)

విశాఖపట్నం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : మెరుగైన ప్రపంచాన్ని రూపొందించుకోవడం కోసం అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర

అభివృద్ధి లక్ష్యాల పై అవగాహన పెంపొందించి భవిష్యత్తు  à°¤à°°à°¾à°²à°²à±‹ నాయకత్వ పటిమను ప్రోత్సహించాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ తెలిపారు.

బుధవారం విశాఖపట్నం లోని యూత్ హాస్టల్ లో నేచర్ క్రియాశీలక సంస్థ - ఆంధ్ర ప్రదేశ్ ఏలియన్స్ ఫర్ చైల్డ్ రైట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి బాలల సమాలోచన

సదస్సులో ఆమె పాల్గొన్నారు.

à°ˆ సందర్భంగా మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాలైన తీవ్ర పేదరిక  à°¨à°¿à°°à±à°®à±‚లన, ఏడాది పొడవునా అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం

అందేలా చూడడం, అన్ని చోట్ల అన్ని వయసుల వారికి ఆరోగ్యకరమైన జీవన స్థాయిని, సంక్షేమాన్ని అందించడం,  à°¸à°®à°¾à°¨à°¤ తో కూడిన నాణ్యమైన విద్యను అందరికీ అందించడం మరియు

జీవితం పొడవునా నేర్చుకునే అవకాశాలను కల్పించడం, లింగపరమైన సమానత సాధించడం - మహిళలు, బాలికలలో సాధికారత పెంపొందించడం, సుస్థిర నీటి యాజమాన్యం, పారిశుద్ధ్యం

ద్వారా అందరికీ నీటి లభ్యత ఉండేలా చూడడం, మెరుగైన పారిశుద్ధ్య వసతులు కల్పించడం రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమమని తెలిపారు.

నోబెల్ బహుమతి గ్రహీత

కైలాష్ సత్యార్థి, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తో సమావేశమైనప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిల్డ్రన్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉందని ప్రశంసించారని

తెలిపారు.

à°† దిశగా చేసే ప్రయత్నం లో భాగంగా నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలలో మౌలిక సదుపాయాలను అభివృద్ధి పరుస్తామని తెలిపారు. 

ఇంగ్లీష్

మీడియంలో బోధన నెరపడం ద్వారా విద్యార్థుల ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పరుస్తున్నా మని తెలిపారు.

అమ్మ ఒడి పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక

సహాయాన్ని, సాధికారతను కలిగిస్తున్నా మని తెలిపారు.

దిశ చట్టం అమలు పరచడం  à°¦à±à°µà°¾à°°à°¾ మహిళలకు, ప్రత్యేకించి బాలికలకు రక్షణ, భద్రత కల్పిస్తున్నామని

తెలిపారు.

స్త్రీ - శిశు సంక్షేమ శాఖ వ్యవహారాల లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ శ్రీమతి విశ్వస రాయి కళావతి మాట్లాడుతూ పిల్లలు సామాజిక అంశాలపై స్పందిస్తున్న

తీరు, వారి అవగాహన అభినందనీయమని తెలిపారు. భవిష్యత్తులో వారి సమస్యలను వారే పరిష్కరించుకో గలిగే స్థితికి రాగలుగుతారని తెలిపారు.

రాష్ట్ర బాలల హక్కుల

పరిరక్షణ కమిషన్ చైర్ పర్సన్ జి. హైమావతి మాట్లాడుతూ యూనిసెఫ్ సహకారంతో వివిధ స్వచ్ఛంద సంస్థలు పిల్లలకు సమాజం పట్ల చక్కటి అవగాహన కలిగిస్తున్నారని

ప్రశంసించారు.

ఈ సమావేశంలో బర్డ్స్, ఆర్మీ, నేచర్, దిమ్సా, బాలవికాస ఫౌండేషన్, మహిత అనే ఆరు స్వచ్ఛంద సంస్థల నుంచి కృష్ణ, కర్నూలు, విశాఖపట్నం జిల్లాల నుంచి 10 -19

సంవత్సరాల వయస్సు à°—à°²  100 మంది బాల బాలికలు పాల్గొని వారి సమస్యలు,అవసరాల పై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రమేష్ శేఖర్ రెడ్డి, బాలరాజు, బాలచంద్రం, ప్రసాద్

నర్వ ప్రకాష్ రావు ఇతరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam