DNS Media | Latest News, Breaking News And Update In Telugu

స్థానిక ఎన్నికలకు సిద్ధం కావాలి: కలెక్టర్ నివాస్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన అధికారుల జాబితాలను సిద్ధం

చేసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జె.నివాస్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో నగరపాలక సంస్థ మరియు పురపాలక

సంఘాల కమీషనర్లతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. త్వరలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు అవసరమైన సిబ్బందిని

నియమించాల్సి ఉందన్నారు. అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్  à°¸à±‚చించారు.  à°—తంలో మున్సిపాలిటీలలో   జరిగిన ఎన్నికల ప్రక్రియను

తెలుసుకున్న కలెక్టర్ ప్రస్తుతం అవసరమైన మేరకు సిబ్బందిని నియమించుకోవలసి ఉందని పేర్కొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో రిటర్నింగ్ అధికారితో పాటు సహాయ

రిటర్నింగ్ అధికారి, మిగిలిన మునిసిపాలిటీలలో రిటర్నింగ్ అధికారులు మాత్రమే ఉంటారని చెప్పారు. శ్రీకాకుళం నగరపాలక సంస్థతో పాటు మునిసిపాలిటీలలోని వార్డుల

సంఖ్యను అనుసరించి సిబ్బందిని నియమించుకోవలసి ఉందని, అందుకు తగిన విధంగా ఏఏ అధికారులు అవసరం ఉంటారో జాబితాలను తయారుచేసి తమకు సమర్పించాలని సూచించారు. జాబితాల

పరిశీలన అనంతరం నివేదికను ఎన్నికల కమీషన్ కు పంపడం జరుగుతుందని, వీలైనంత వరకు డెప్యూటీ తహశీల్ధారుల సేవలు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ

సమావేశంలో జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి జి.చక్రధరరావు, నగరపాలక సంస్థ కమీషనర్ గీత, ఆమదాలవలస మున్సిపల్ కమీషనర్ యం.రవిసుధాకర్, పలాస, ఇచ్చాపురం

మున్సిపాలిటీల కమీషనర్లు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam