DNS Media | Latest News, Breaking News And Update In Telugu

15 నుండి సంక్షేమ పథకాల కార్డుల పంపిణీ : సీఎం 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 11, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కార్డులను à°ˆ నెల

15 నుండి 21వ తేదీ వరకు పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. మంగళ వారం జిల్లా కలెక్టర్ లతో ముఖ్య మంత్రి వీడియో కాన్ఫరెన్స్

నిర్వహించారు. ఈ నెల 15 నుండి 21వ తేదీ వరకు పింఛను, బియ్యం తదితర కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. బియ్యం కార్డులు జారీకి ముందుగానే క్షుణ్ణంగా విచారణ చేయాలని

అన్నారు. ఆగిన పింఛన్లకు తనిఖీలను 18 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కార్డులు మార్చి 31 వరకు పంపిణీ జరుగుతుందని ఆయన తెలిపారు. ఆరోగ్య కార్డులను పివిసి

కార్డులు కావడం, క్యూఆర్ కోడ్ ముద్రణ వలన కొంత జాప్యం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో 1.41 కోట్ల ఆరోగ్య కార్డులు జారీ జరుగుతుందని చెప్పారు. అర్హులైన ప్రతి

ఒక్కరికీ కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ నెల 17 నాటికి విచారణ చేపట్టి, 19 నాటికి సామాజిక తనిఖీ చేసి, 24 నాటికి తుది జాబితా తయారు చేయాలని ఆదేశించారు.

భరోసాలో, అమ్మ ఒడిలో అర్హులై పెండింగులో ఉన్న కేసులను పరిశీలించి తక్షణం పరిష్కరించాలని ముఖ్య మంత్రి అన్నారు. రాష్ట్రంలో 46 లక్షల మందికి రైతు భరోసా, అమ్మ ఒడి

క్రింద 42,33,098 మంది తల్లులకు రూ.15 వేలు చొప్పున చెల్లించామని చెప్పారు. రైతు భరోసా క్రింద దాదాపు 32 వేల మందికి, అమ్మ ఒడి క్రింద 11,440 పెండింగులో ఉందని వీటిని పరిశీలించి,

సానుకూలంగా పరిష్కరించాలని సూచించారు. అర్హులైన వారికి గృహ పట్టా మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. పూరి గుడిసెలో విద్యుత్ ఉందని, ఫ్యాన్ ఉందని అనర్హుల

జాబితాలోకి చేర్చరాదని స్పష్టం చేసారు. ప్రతి ఏడాది 6 లక్షల గృహాల నిర్మాణం చేపడతామని ఆయన చెప్పారు. గృహ లే అవుట్లను ఫిబ్రవరి 24 నాటికి పూర్తి స్థాయిలో అభివృద్ధి

చేయాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ఉగాది తరువాత ఇంటి స్థలం లేని నిరుపేద జిల్లాల్లో ఉండరాదని చెప్పారు. జిల్లాల్లో

పర్యటించనున్నానని, తన పర్యటనలో ప్రజలకు ఇంటి స్ధలం కోసం అడుగుతానని, ఎవరూ ఇంటి స్థలం లేదని సభల్లో చేయి ఎత్తరాదని అధికారులకు చెప్పారు. కంటి వెలుగు

కార్యక్రమంలో అవ్వా – తాతలకు ఫిబ్రవరి 18à°¨ ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. పాఠశాల విద్యార్ధులకు నిర్వహించిన à°•à°‚à°Ÿà°¿ వెలుగు కార్యక్రమంలో 1.50 లక్షల కళ్ళ జోళ్ళు

పంపిణీ జరుగుతుందని చెప్పారు. పాఠశాలల విద్యార్థులకు నేత్ర చికిత్సలను వేసవి సెలవుల్లో నిర్వహిస్తామని తెలిపారు. అవ్వా-తాతలకు గ్రామ సచివాలయాల్లో ప్రాధమిక

నేత్ర పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. నాడు - నేడు కార్యక్రమంను ఆసుపత్రులకు విస్తరిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 18న ప్రారంభిస్తున్నట్లు జగన్

మోహన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో 4,906 ఆరోగ్య ఉప కేంద్రాల నిర్మాణంను నాడు – నేడు కార్యక్రమం క్రింద చేపడుతున్నామని చెప్పారు. ఆసుపత్రులను అంతర్జాతీయ స్థాయి

ప్రమాణాలతో ఉంచాలన్నదే ధ్యేయమని అన్నారు. రాష్ట్రంలో 434 ప్రదేశాల్లో ఆరోగ్య ఉప కేంద్రాలకు స్థలాలు త్వరగా గుర్తించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. జగనన్న

విద్యా,వసతి దీవెన కార్యక్రమాలను ఫిబ్రవరి 24à°¨ ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో  à°µà°¿à°¦à±à°¯à°¾,వసతి దీవెన కార్యక్రమాలను నిర్వహించాలని ఆయన

అన్నారు. సంవత్సరానికి రూ.20 వేలు పంపిణీ చేస్తామని దీనిని ఏడాదికి రెండు దఫాలుగా తల్లుల ఖాతాలో వేస్తామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 25 నుండి  à°µà°¸à°¤à°¿ దీవెన కార్డులు జారీ

చేస్తున్నట్లు చెప్పారు. మార్చి నెలలో  à°°à°œà°•à±à°²à±, దర్జీలు, నాయీ బ్రాహ్మణులకు ఆర్ధిక సహాయం, కాపు నేస్తం కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు ముఖ్య మంత్రి చెప్పారు.

ప్రతి వాలంటీరు,గ్రామ సచివాలయ ఉద్యోగికి మొబైల్ ఫోన్ అందజేస్తామని అన్నారు. ఉద్యోగుల మ్యాపింగు పక్కాగా జరగాలని ఆయన అన్నారు. గ్రామ సచివాలయాలు విప్లవాత్మకమైన

చర్య అని పూర్తి స్థాయిలో పనిచేయుటకు జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని సూచించారు. 541 సేవలు సచివాలయాల్లో అందుతాయని, సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా

పరిశీలించాలని ఆయన చెప్పారు. ప్రాథమికంగా ఏర్పడే సమస్యలను తక్షణం పరిష్కరించి నిర్దేశించిన సమయంలో సేవలు అందించాలని అన్నారు. గ్రామ సచివాలయాల్లో ప్రతి రోజు

"స్పందన" కార్యక్రమం నిర్వహించాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాలను సచివాలయాల దగ్గర ఏర్పాటు చేయాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు తదితర అంశాలు రైతు భరోసా

కేంద్రం నుండి విక్రయాలు చేయాలని సూచించారు. క్షేత్ర స్థాయి ఉద్యోగులకు రైతు భరోసా కేంద్రాల్లో శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. మార్చి 15 నాటికి భవనాలు

సమకూర్చాలని ఆయన పేర్కొన్నారు. నాడు - నేడు కార్యక్రమంలో పాఠశాలలకు నిర్వహిస్తున్న పనులను కలెక్టర్లు తనిఖీ చేయాలని ఆదేశించారు. మధ్యాహ్న భోజన పథకం, మరుగుదొడ్ల

నిర్వహణ పక్కగా ఉండాలని వీటిని పర్యవేక్షించుటకు ప్రత్యేకంగా ఒక ఐ.ఏ.ఎస్.అధికారిని నియమించామని చెప్పారు. మద్యాహ్న భోజన పథకానికి నిధులకు సమస్య లేకుండా గ్రీన్

ఛానల్ లో పెట్టామని అన్నారు. గ్రామ సచివాలయ విద్యా, సంక్షేమ సహాయకులు ప్రతి రోజు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, మరుగుదొడ్లు పరిశీలించాలని చెప్పారు. పాఠశాల విద్యా

కమిటీ సభ్యులు కూడా ప్రతి రోజు పరిశీలించాలని అన్నారు. వీటిని పరిశీలించుటకు ఒక యాప్ ను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్

మాట్లాడుతూ దిశ పోలీసులు జాగరూకతతో ఉంటూ మంగళవారం తెల్లవారుజామున విశాఖపట్నం- విజయవాడ బస్సులో అసభ్యంగా ప్రవర్తించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఆ

వ్యక్తి మంచి ఉద్యోగ భాద్యతలు నిర్వహిస్తున్నారు.

జిల్లా కలెక్టర్ జె నివాస్ మాట్లాడుతూ జిల్లాలో 1235 ప్రదేశాల్లో గృహ లే అవుట్లను సిద్ధం చేస్తున్నామన్నారు.

ఇప్పటికే 735 లే అవుట్లు సిద్ధం చేసామని చెప్పారు. 39 ఆరోగ్య ఉప కేంద్రాలకు స్థలాలను ఎంపిక చేస్తున్నామని తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.

కె. శ్రీనివాసులు, ఎస్పీ ఆర్.ఎన్. అమ్మిరెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి బలివాడ దయానిధి, బిసి కార్పొరేషన్ ఇ.డి జి.రాజారావు, జిల్లా బిసి సంక్షేమ అధికారి కె. కృత్తిక,

జిల్లా పంచాయతీ అధికారి వి.రవికుమార్, వ్యవసాయ శాఖ జెడి కె. శ్రీధర్, నగర పాలక సంస్థ కమిషనర్ ఎం.గీతాదేవి, సాంఘిక సంక్షేమ శాఖ డిడి కె. వి.ఆదిత్య లక్ష్మి, డీఆర్డీఏ

పిడి ఏ.కళ్యాణ చక్రవర్తి, డి.ఎం.హెచ్.ఓ డా ఎం.చెంచయ్య, డీబీసీఎస్ పిఓ డా.ఎం.రమణ కుమార్, ఇపిడీసీఎల్ ఎస్ఇ ఎన్. రమేష్, డిసిసిబి ఓఎస్డి బి.నగేష్ , సమగ్ర శిక్షా అభియాన్ ఇఇ

వి.వెంకట కృష్ణయ్య, జిల్లా విద్యాశాఖ అధికారి కె.చంద్ర కళ, జెడ్పీ సిఇఓ జి.చక్రధర రావు , ప్రజా ఆరోగ్య శాఖ ఇఇ పి.సుగుణాకర రావు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam