DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 న పుల్వామా ఘటన అమర జవాన్లకు శ్రద్దాంజలి ఘటిద్దాం.

42 మంది ప్రాణత్యాగం భారత జాతి మరువదు : భజరంగ్ దళ్  

నటుల పేర్లు తెలిసినట్టు వీర యోధుల పేర్లు తెలుసా? 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్,

శ్రీకాకుళం ). . . . .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) : పుల్వామా ఘటనలో అమరులైన వీర జవాన్లకు శుక్రవారం  ( ఫిబ్రవరి 14 )à°¨ ఘన నివాళి అర్పింద్దామని శ్రీకాకుళం భజరంగ్

దళ్ పిలుపునిచ్చింది. గురువారం  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో భజరంగ్ దళ్ జిల్లా అధ్యక్షులు శ్రీరంగం మధుసూదనరావు

మాట్లాడుతూ ఆత్మీయులైన భారతదేశ యువత, విద్యార్థులు ఏ దిశగా ప్రయానిస్తున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఫిబ్రవరి 14 వచ్చేసరికి అందరికీ గుర్తు

వచ్చేది వాలెంటైన్స్ డే. దానినే ప్రేమికుల దినోత్సవం à°—à°¾ జరుపుకుంటున్నారు. అసలైన ప్రేమని ప్రకటించికోవడానికి à°’à°• రోజు అవసరం ఉంటుందా? 

ప్రేమ అనేది

సంవత్సరంలో అన్నిరోజులు ఉండాలి.  à°®à°¨ భారతీయ యువత à°ˆ శ్రేష్టమైన సంస్కృతికి విఘాతం కలిగించే à°ˆ పద్ధతిని మానుకోవాలి. మన భారతీయ సంస్కృతి అతి పురాతనమైనది. ప్రతి

వ్యక్తిని ప్రతి బాంధవ్యాన్ని ప్రేమించమని చెప్తుంది. ఆదికావ్యం, రామాయణం భార్యాభర్తల మధ్య, తండ్రీకొడుకుల మధ్య, సోదరుల మధ్య, స్నేహితుల మధ్య , భగవంతునికి

భక్తునికి మధ్య ప్రేమానురాగాలు ఎలా ఉండాలో చక్కగా బోధించింది. ఇది ప్రేమ శాశ్వతమని చెప్పిందే కానీ, సంవత్సరంలో ఒక్క రోజుకు మాత్రమే పరిమితమని చెప్పలేదు.

ప్రేమికుల దినోత్సవం పేరుతో యువత ఉన్నతమైన సంస్కృతి ని వదలి అసభ్యకరమైన సంస్కృతిని ఎందుకు అవలంబిస్తున్నారో.. అర్ధం కావడం లేదు. యువతలో ఉన్న ఈ మానసిక

దౌర్భాల్యాన్ని, ఆసరాగా తీసుకుని దేశంలో పబ్బులు, హోటల్స్, అంతర్జాతీయ సంస్థలు, విహార  à°¸à±à°¥à°²à°¾à°²à±, బహుళజాతి సంస్థలు, క్లబ్బులు ఇలా అనేక సంస్థలు

సొమ్ముచేసుకునేందుకు యువతను పావులుగా వాడుకుంటున్నాయి. యుక్త వయసులో ఉన్న యువతీయువకులు ఈ సంస్థలు చేస్తున్న మాయా ప్రకటనలకు బలి అవుతున్నారు. కానీ, మోసాన్ని

అర్ధం చేసుకోలేకపోతున్నారు..? కేవలం ఒక్క బోకే వల్ల, బిస్కెట్స్ వల్ల ప్రేమ నిరూపించబడదు. à°ˆ చిన్న లాజిక్ ని కూడా  à°¯à±à°µà°¤ గ్రహించలేకపోతుండటమన్నది à°ˆ దేశ

దౌర్భాగ్యంగా మారింది. సరిగ్గా à°’à°• సంవత్సరం క్రితం 2019 ఫిబ్రవరి 14 à°¨ మన దేశరక్షణ బాధ్యతలో ఉన్న 43 మంది  à°¸à±ˆà°¨à°¿à°•à±à°²à± ఉగ్రవాదుల కిరాతక దాడిలో హతమార్చబడ్డారు. మన సైనికులు,

సైనిక కుటుంబాల త్యాగాలని స్మరించుకోవాల్సిన సమయములో.. ఈ ఆకర్షణపూరకమైన కపట ప్రేమ పేరిట వలల్లో పడి సరదాలు చేసుకోవడం ఎంతవరకు సమంజసమో ఆలోచించండి.?
ఈ విషయంలో

తల్లితండ్రులది కూడా కొంత లోపమున్నది.

నటుల పేర్లు తెలిసినట్టు యోధుల పేర్లు తెలుసా? . . . .

సినిమా పేర్లు సినిమా హీరో హీరోయిన్ ల పేర్లు క్రికెటర్ పేర్లు

క్షుణ్ణంగా యువతకు తెలుసు కానీ.. స్వాతంత్ర ఉద్యమాల్లో పాల్గొన్నందుకు బ్రిటిష్ వారు అనేక మందిని ఉరి తీశారు. వాళ్ళ పేర్లు ఎంతమందికి తెలుసు.? పుల్వామా దాడిలో

గాని.. 1996 కార్గిల్ యుద్ధంలో కానీ అసువులు బాసిన వారి వివరాలు తెలీసుకోవాల్సిన అవసరం లేదా? ఎంతో ఉన్నతమైన ఉమ్మడి కుటుంబాల వ్యవస్థ పోయి ఒంటరి కుటుంబాలు ఏర్పడ్డాక

పిల్లలకు మంచి సంస్కారాలు అందించే వారు కరువైపోయారు. ఈ విషయంలో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయనన్నారు. "బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజమైన ప్రేమను

ప్రోత్సహిస్తుంది. బజరంగ్ దళ్. వాలెంటైన్స్ డే పేరుతో జరిగే అసభ్యకరమైన విధానాలను పూర్తిగా వ్యతిరేకిస్తోంది. కాబట్టి భారతీయ యువతను బజరంగ్ దళ్ కోరేది ఏమిటంటే

ఫిబ్రవరి 14 ని పుల్వామా దాడిలో అశువులు బాసిన వీర సైనికులకు శ్రద్దాంజలి ఘటించే రోజుగా పాటిద్దాం..! నిజమైన భారతీయులుగా స్వాభిమానముగా జీవిద్దాం. వాలెంటైన్స్ డే కి

స్వస్తి పలుకుదాం..! ప్రభుత్వం, పోలీసు శాఖ అధికారులు ఈ విషయంలో శ్రద్ధ వహించి, యువతను సమీకరించి, శ్రద్ధాంజలి కార్యక్రమం చేయాలని బజరంగ్ దళ్ తరపున విజ్ఞప్తి

చేశారు.
ఈ సమావేశంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు శ్రీ గుంప శివ ప్రసాద్, బజరంగ్ దళ్ జిల్లా ఉపాధ్యక్షుడు రావాడ రాజశేఖర్, పట్టణ అధ్యక్షుడు

ఉమామహేశ్వరరెడ్డి, జగన్నాథ్ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam