DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమర సైనికులారా జోహార్, మీ త్యాగం మరువం, ఇదే ప్రతిజ్ఞ. . .

సైనికుల త్యాగాలు అజరామరం, అనిర్వచనీయం : మాజీ ఎంపీ  
 
సైనిక కుటుంబాలకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడతాం:  à°¸à±€à°†à°°à±à°«à±€à°Žà°«à± డిఐజి శ్రీనివాస్

తెలుగు రాష్ట్రాల  à°…మర

సైనికులకు ఘననివాళి, 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 13, 2020 (డిఎన్‌ఎస్‌) :అమర సైనికులారా జోహార్, మీ త్యాగాలు మరువం, ఇదే

ప్రతిజ్ఞ. . . అంటూ విశాఖ నగరం లోని కేంద్ర సాయుధ రక్షణ బలగాల శిబిరం హోరెత్తి పోయింది. గురువారం విశాఖనగరంలోని మహారాణిపేట లోగల సీఆర్ పిఎఫ్ కేంద్రం లో గత ఏడాది

కాశ్మీర్ ప్రాంతంలోని పుల్వామా లో ముష్కరుల ఘాతుకానికి బలైన 44 మంది సైనికులకు నివాళిగా సైనిక త్యాగాలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక

ఆహ్వానితునిగా పాల్గొన్న విశాఖపట్నం మాజీ ఎంపీ డాక్టర్ కె. హరిబాబు మాట్లాడుతూ దేశంలో భారతీయులు ఇంత ప్రశాంతంగా జీవించగలుగుతున్నారంటే దానికి ప్రధాన కారణం

దేశ సరిహద్దుల్లో ఎండననక, వాననకా వేలాదిగా సైనికులు పహారా కాస్తూ శత్రుమూకలను, ఉగ్రవాదులను ఎదుర్కొనే క్రమంలో ప్రాణాలను సైతం పణంగా పెట్టడమేనన్నారు.

వీరందరికీ ఎన్ని విధాలుగా కృతఙ్ఞతలు తెలిపినా తక్కువేనన్నారు. గతంలో రెండు పర్యాయాలు ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో సైనికులు పనిచేస్తుంరాతో అత్యంత దగ్గరగా

చూసే మహద్భాగ్యం కల్గిందన్నారు. ఒకటి సియాచిన్ కేంద్రంలోను, మరొకటి వాఘా సరిహద్దులోనూ విధుల్లో ఉన్న సైనికుల పరిస్థితి దగ్గర నుంచి చూసే భాగ్యం కల్గిందన్నారు.

సైనికులతో అత్యంత సన్నిహితంగా కలిసి మెలిసి సంచరించే భారత ప్రధాని గా నరేంద్ర మోడీ, దేశ రక్షణలో భారతీయ సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం గమనార్హం అన్నారు.

పుల్వామా ఘటనకు చాలించి పోయిన ఆయన ఈ ఘటనకు కారణమైన ఉగ్రవాద సంస్థ కు చెందిన సైనిక స్థావరాలపై ( పాకిస్తాన్ లో ఉన్నాయి) సర్జికల్ స్ట్రైక్ చేయించి వారిని తునాతునకలు

చేయించారన్నారు. ఈ దాడిలో సుమారు 300 మందికి పైగా ఉగ్రవాదులు మట్టికరిచారన్నారు. భారతీయ సైనికుల వైపు చూడాలంటేనే శత్రు దేశాలకు, మూకలకు కలలోకూడా చెమటలు పెట్టె

విధంగా సైనికులు పోరాడుతున్నారని తెలిపారు.  

సైనికుల కుటుంబాలకు అండగా నిలబడటం: సీఆర్పీఎఫ్ , , ,

సైనికుల కుటుంబాలకు భారత సైనిక విభాగం అన్ని వేళలా

à°…à°‚à°¡à°—à°¾ నిలబడుతుందని, వారి బాగోగులు క్రమం తప్పకుండా వెళ్లి స్వయంగా తెలుసుకుంటున్నట్టు సీఆర్ పిఎఫ్ à°¡à°¿ ఐ జి  à°¶à±à°°à±€à°¨à°¿à°µà°¾à°¸à± తెలిపారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ

కేంద్ర సాయుధ రక్షణ బలగాల డిఐజి శ్రీనివాస్ మాట్లాడుతూ గత ఏడాది ఫిబ్రవరి 14 న మధ్యాహ్నం 3 :15 గంటల సమయంలో కాశ్మీర్ లో విధుల్లో చేరేందుకు పుల్వామా ప్రాంతం మీదుగా

వెళ్తున్న 44 మంది సైనికుల వాహనాలపై ముష్కరులైన ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులు జరిపిన ఘటనలో అమరులైన వారికి ఘననివాళి అర్పించ వలసి రావడం బాధాకరమన్నారు.      

à°ˆ

సందర్భంగా విధి నిర్వహణలో ఉండగా అమరులైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలకు చెందిన సైనికుల కుటుంబ సభ్యులకు కృతజ్ఞతా పూర్వక సత్కారాన్ని అందించారు. ఈ

సైనికులందరూ  à°®à°¾à°µà±‹à°¯à°¿à°¸à±à°Ÿà±à°²à°¤à±‹ పోరాడుతూ అమరులవ్వడం చాలా బాధాకరం అన్నారు.  

విశాఖపట్నం జిల్లా యలమంచిలికి చెందిన ఎస్. రామారావు, టి. పున్నారావు, ఎం. కృష్ణారావు,

కె. వెంకన్న, జి శ్రీనివాస్ ల కృతజ్ఞతాంజలి ఘటిస్తూ వారి కుటుంబ సభ్యులకు సీఆర్ పిఎఫ్ తరపున సత్కారాన్ని అందించారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సమయం సహచర సీఆర్

పిఎఫ్ జవాన్లు, అధికారులు చప్పట్లు కొడుతూ అమర సైనికులకు తమ నివాళి అర్పించడం గమనార్హం. ఈ కార్యక్రమం లో సుమారు విశాఖ ప్రాంతంలో విధులు నిర్వహించే సీఆర్పీఎఫ్

సైనిక బలగాలు, అధికారులు, మహిళా సిబ్బంది, ఇతర సివిల్ ఉద్యోగులు పాల్గొని అమర సైనికులకు ఘనంగా నివాళి అర్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam