DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎక్కడినుంచైనా వోటింగ్ పై 2017 లోనే చెప్పిన విశాఖ యువత

యువత ఇచ్చే నూతన ఐడియాలను కించపరచవద్దు 

ఐటి హబ్ నిర్వాహకుల బేఖాతరు తో యువత ప్రాజెక్ట్ తిరస్కరణ 

2017 లో మేం చెప్తే కాదన్నారు - నేడు అదే ప్రాజెక్ట్

ఐఐటి తో చేయిస్తున్నారు : యువత 

ప్రాజెక్ట్ చెయ్యాలంటే తపన, పట్టుదల ఉండాలి : యువత : . . .

ఆవేదన లో ఎంవిజిఆర్ సి ఎస్ à°ˆ విద్యార్థులు 

(DNS Special రిపోర్ట్ :

సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 14, 2020 (డిఎన్‌ఎస్‌) : దేశ ప్రగతి à°•à°¿ మూల స్తంభాలు యువత అనేది ప్రతి ఒక్కరూ చెప్పే మాట. అయితే అదే యువత à°’à°• నూతన

ఆలోచనలు తెలియచేస్తే ప్రోత్సహించేవారు మాత్రం ఉండరు పైగా వీళ్ళని నిరుత్సాహపరిచేవారే ఎక్కువగా ఉంటారు. మీ మొహం మీకు అనుభవం లేదు, మీరా చెప్పేది అనే పదాలు

దాదాపుగా యువత అందరూ ఎదుర్కొనే పరాభవాలే. . . ఇలాంటి సంఘటనకు ప్రత్యక్ష నిదర్శనం విజయనగరం జిల్లాకు చెందిన ఎంవిజిఆర్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులే. ఈ కళాశాలలో

కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు సెప్టెంబర్ 9 , 2017 లో విశాఖపట్నం కేంద్రంగా ఆంధ్ర ప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ నిర్వహించిన ఏపీ స్టార్ట్

అప్స్  à°¸à°¦à°¸à±à°¸à±à°²à±‹ పాల్గొన్నారు. వీరిలో ముగ్గురు యువతులు పాల్గొనడం గమనార్హం. à°ˆ సదస్సులో భాగంగా వీరు దేశంలో ఎక్కడ నుంచైనా ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునే

విధంగా ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనతో ఒక ప్రాధమిక రూపకల్పన చేసి నిర్వాహకులకు వివరిస్తే. . . వారికి ఈ ప్రాజెక్ట్ ను ఏమాత్రం ఖాతరు

చెయ్యకుండా. . యువతను పూర్తి నిర్లక్ష్యం చెయ్యడం జరిగింది. పైగా వీరిని ఆ సెషన్ నుంచి తొలగించడం జరిగింది. దీంతో యువత మరొక గైడ్ వద్దకు వెళ్లి తమ ప్రాజెక్ట్ ను

వివరించారు. ఈయన à°’à°• సంస్థకు సీఈఓ హోదా ఉండి కూడా వీరి నూతన ఆలోచనను ఏమాత్రం ఖాతరు చెయ్యకుండా నిర్లక్ష్యంగా వీళ్ళని తిరస్కరించడం జరిగింది. 

రెండేళ్లు

తర్వాత. .2020 ఫిబ్రవరి. . . సరిగ్గా ఇదే ప్రాజెక్ట్ ను కేంద్ర ప్రభుత్వం అమలు చేసేందుకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఇంజనీరింగ్ విద్యాలయం ఐఐటి కు అప్పగించింది.

పైగా ఈ ప్రాజెక్ట్ కు దేశవ్యాప్తంగా చర్చాగోష్ఠులు, విశ్లేషణలు, పెద్ద పెద్ద ఐటి సంస్థ సీఈఓ లు ఆసక్తి కనపరచడం అన్నీ ప్రస్తుతం అందరినీ ఆకట్టుకుంటున్న

అంశాలు. 

2020 లో ప్రస్తుతం à°† ముగ్గురు విద్యార్థినులు బెంగుళూరు లోని à°’à°• సంస్థలో ఉద్యోగం లభించి, శిక్షణలో ఉన్నారు.  à°Žà°•à±à°•à°¡ నుంచి వోటింగ్ అనే అంశంపై

ప్రాజెక్ట్ గురించిన సమాచారం కేంద్రం నుంచి వచ్చిన సందర్భంగా à°ˆ యువతులు చాలా నిరాశకు లోనయ్యారు. నాటి ప్రాజెక్ట్ కు సంబంధించిన ఫోటోలను విడుదల చేసారు. 

ఇదే

ఆలోచన à°’à°• సాధారణ ఇంజనీరింగ్ విద్యార్థులు ఇస్తే.  . . తిరస్కరణకు గురవ్వడం గమనార్హం. సంచలనాలు సృష్టించే ఆలోచనలు కేవలం ఉన్నత విద్యా సంస్థల్లోని విద్యార్థులకే

వస్తాయి అనుకోవడం ఎంతవరకూ సమంజసమో వీళ్ళకే తెలియాలి.   

ప్రాజెక్ట్ చెయ్యాలంటే తపన, పట్టుదల ఉండాలి : యువత : . . .

ఒక మంచి ఆలోచన తో ప్రాజెక్ట్ చెయ్యాలంటే

వాళ్లకి అనుభవం ఉండనవసరం లేదని, à°µà°¿à°œà°¯à°µà°‚తంగా పూర్తి చెయ్యాలనే తపన, పట్టుదల ఉండాలని వీరు తెలియచేస్తున్నారు. తాము 2017 లో ఇదే కాన్సెప్ట్ వివరిస్తే స్టార్ట్ అప్స్

సదస్సు నిర్వాహకులు తమను హేళన చేసారని, అయితే అదే ప్రాజెక్ట్ నేడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యిందన్నారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam