DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రైతుల అంగీకారంతోనే భూ సేకరణ – ఇన్ ఛార్జ్ కలెక్టర్ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : పేదల ఇళ్ళ స్ధలాల మంజూరుకు రైతుల అంగీకారంతోనే భూ సేకరణ

చేపట్టామని శ్రీకాకుళం ఇన్ ఛార్జ్ జిల్లా కలెక్టర్ డా.కె. శ్రీనివాసులు తెలిపారు. పేదలకు ఇళ్ళ పట్టాల పంపిణీపై శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు

చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో శ్రీనివాసులు ఇళ్ళ పట్టాల పంపిణీపై వివరాలు వెల్లడించారు. జిల్లాలో ఉగాది పర్వదినాన 60,603 మంది లబ్దిదారులకు ఇళ్ళ పట్టాలు, 49,152

మందికి భూ అనుభవ పత్రాలు అందజేయడానికి చర్యలు చేపట్టామన్నారు. ముఖ్యమంత్రి నవరత్నాలులో భాగంగా  à°ªà±‡à°¦à°²à°‚దరకీ ఇళ్ళు అనే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని

తెలిపారు. ఉగాది నాటికి ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ళపట్టాలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ 1380 ఎకరాలు అవసరమని  à°—ుర్తించడం

జరిగిందని, అందులో 1130 ఎకరాల ప్రభుత్వ భూమి  à°…ందుబాటులో ఉందని చెప్పారు. 250 ఎకరాలు సేకరించవలసి ఉందని తెలిపారు. ప్రభుత్వ భూమిని సేకరించడమే ప్రాధాన్యతగా

తీసుకున్నామని ఇన్ ఛార్జ్ కలెక్టర్ చెప్పారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూమిని సేకరించడం జరుగుతుందని ఆయన స్పష్టం చేసారు. ఈ చట్టం ప్రకారం గిరిజన ప్రాంతంలో భూమి

ధరకు అదనంగా 1.50 రెట్లు, ఇతర ప్రాంతాల్లో 1.25 రెట్ల ధరను చెల్లిస్తున్నామన్నారు. సేకరించాల్సిన భూమిలో 70 ఎకరాల జిరాయితీ, 182 ఎకరాల డి-పట్టా భూమి, సేకరించడం జరిగిందని

తెలిపారు.   247 మంది రైతుల నుండి 180 ఎకరాల à°¡à°¿ పట్టా భూములు ఉన్నాయని చెప్పారు. à°ˆ భూమిని పూర్తిగా రైతుల అంగీకారంతో సేకరించమని ఆయన స్పష్టం చేసారు. మెళియాపుట్టి

మండలంలో మాత్రం 88 సెంట్ల భూమిని తప్పనిసరి భూసేకరణగా చేపట్టామని పేర్కొన్నారు. డి పట్టా భూములు కలిగినవారిలో మొత్తం 247 మంది ఉండగా అందులో 95 మంది ఎస్.సిలు, 58 మంది

ఎస్.à°Ÿà°¿.లు, 93 మంది వెనుకబడిన తరగతులవారితో సహా ఇతరులు ఉన్నారని చెప్పారు.  à°°à±ˆà°¤à±à°² అంగీకారంతోనే భూసేకరణ జరిగినట్లు తెలిపారు. ప్రభుత్వ భూమిగా రికార్డులలో ఉండి

ఆక్రమణలు కలిగినవాటిని తీసుకోవడం జరిగిందని ఆయన స్పష్టం చేసారు. ఆక్రమణదారులు భూస్వాములు, సంపన్న కుటుంబాలకు చెందినవారని ఆయన పేర్కొన్నారు. గ్రామ సభలను

నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడించామని చెప్పారు. ఇళ్ళ పట్టాలతోపాటు 49,152 మందికి భూ అనుభవ ధృవపత్రాలను అందజేస్తున్నామని వెరశి జిల్లాలో దాదాపు లక్ష మందికి

పట్టాల పంపిణీ జరుగుతుందని తెలిపారు. మహిళల పేరున  à°¸à±à°§à°²à°¾à°²à°¨à± రిజిస్ట్రేషన్ చేస్తామని చెప్పారు.  à°¤à°¹à°¶à±€à°²à±à°¦à°¾à°°à±à°²à°•à± జాయంట్ సబ్ రిజిస్ట్రార్ à°—à°¾ ప్రభుత్వం అధికారాలను

అధీకృతం చేసిందని, వచ్చే వారంలో తహశీల్దార్లకు దీనిపై శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. జిల్లాలో చెరువులు, దేవదాయ భూములను సేకరించలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా

ఇన్ ఛార్జ్ కలెక్టర్ స్పష్టం చేసారు. 
    à°ˆ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లాలోని వివిధ మండలాల నుండి విచ్చేసిన రైతులు తాము స్వచ్చంధంగా భూములను అందజేసామని

తెలిపారు. ఈ మీడియా ప్రతినిధుల సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి బలివాడ దయానిధి, పలువురు తహశీల్దార్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam