DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ట్రంప్‌ భారత్‌ రాక ఎవరి కోసం ?: సీపీఎం నర్సింగరావు

మాఇంటికొస్తే à°Žà°‚ తెస్తావ్? మీ ఇంటికొస్తే ఏమిస్తావ్, ఇదే తీరు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°…మెరికా

అధ్యక్షుడు ట్రంప్‌ పర్యటన కోసం భారత ప్రభుత్వం అత్యంత ఆర్భాటం చేస్తున్నది. ఈయన రాక ఎవరి కోసమో చెప్పాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ ( మార్క్సిస్టు) రాష్ట్ర కమిటీ

సభ్యులు సిహెచ్ నరసింగరావు డిమాండ్ చేసారు. సోమవారం నగరం లోని సిపిఎం కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°®à±‹à°¡à±€ రాష్ట్రమైన

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ‘నమస్తే ట్రంప్‌’’ పేరుతో భారీ ర్యాలీ, బహిరంగసభ నిర్వహిస్తున్నారన్నారు. గుజరాత్‌లోని దారిద్య్రం కనబడకుండా పేదలు నివశించే

ప్రాంతాలను ముసుగువేశారని, అమెరికా సెనెట్‌లో అభిశంసకు గురైన ట్రంప్‌ త్వరలో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేయబోతున్నాడన్నారు. అమెరికా ప్రయోజనం కోసమే

భారత్‌ పర్యటిస్తున్నానని మూడు రోజుల ముందే ప్రకటించారన్నారు. ఇది భారత ప్రజల ప్రయోజనానికి వ్యతిరేకం అన్నారు. 

 à°Ÿà±à°°à°‚ప్‌ భారత పర్యటనలో అత్యంత ప్రమాదకరమైన

విషయం అణువిద్యుత్‌ ఒప్పందమేనని,  2005లో అమెరికాతో ఆనాటి కాంగ్రెస్‌ అణువిద్యుత్‌పై ఒప్పందం చేసిందన్నారు. అమెరికాలోని వెస్టింగ్‌హౌస్‌ ఎపి1000 రియాక్టర్లను

గుజరాత్‌లోని మితివిర్ధిలో ఏర్పాటు చేయాలని అంగీకరించారు. గుజరాత్‌లో ప్రజలు తీవ్రంగా ఆందోళన చేశారు. మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత అణువిద్యుత్‌

కర్మాగారాన్ని కొవ్వాడలో నిర్మించాలని నిర్ణయించారు. ఈలోగా వెస్టింగ్‌హౌస్‌ కంపెనీ దివాళా తీసిన్నట్లుగా ప్రకటించారు. à°ˆ వెస్టింగ్‌హౌస్‌ కంపెనీని

బుక్‌ఫీల్డ్‌ ఎస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కొనుగోలు చేసింది. à°ˆ కంపెనీలో ట్రంప్‌ అల్లుడు జెరెడ్‌ కుస్నెర్‌ ప్రధాన భాగస్వామి. ట్రంప్‌ తన అల్లుడు ప్రయోజనం కోసం

భారత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొవ్వాడ విద్యుత్‌ కర్మాగారాన్ని నిర్మించాలని కుట్ర చేస్తున్నారు. భారత ప్రభుత్వం అణువిద్యుత్‌ కర్మాగారాల నిర్మాణంలో

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతిస్తున్నట్లుగా 2020లో ప్రకటించింది. ఇప్పటి వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగే ఈ నిర్మాణాలను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు

అనుమతించటం ద్వారా అమెరికా ప్రభుత్వం భారత్‌లో అణువిద్యుత్‌ కర్మాగారాలు ఏర్పాటు చేయడానికి ట్రంప్‌తో జరిగే ఒప్పందాల్లో ఉంటుందని పత్రికల్లో వార్తలు

వస్తున్నాయి. భారతదేశ ప్రయోజనాలకు ఇది పూర్తి వ్యతిరేకం. కేవలం అమెరికాకు తలొగ్గి అమెరికా ప్రయోజనాల కోసం à°ˆ ఒప్పందం చేయబోతున్నారని మండిపడ్డారు.  
     

 à°…ణువిద్యుత్‌ అత్యంత ప్రమాదకరమని కొవ్వాడలో అణువిద్యుత్‌ కర్మాగారంలలో ఎటువంటి ప్రమాదం జరిగినా 175 కి॥మీ వరకు విస్తరించి దక్షిణం కాకినాడ వరకు, ఉత్తరాన

ఛత్రపూర్‌ వరకు జీవరాసులు పూర్తిగా నాశనమౌతాయని శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. దానికితోడు భారతదేశంలో ఆనాడు విద్యుత్‌ ఉత్పత్తి ఇప్పటికే అధికంగా వుందని

ప్రధాని మోడీ 2017లో ప్రకటించారు. ఇప్పటికే ధర్మల్‌ విద్యుత్‌ కర్మారాగాల్లో అవుతున్న ఉత్పత్తిని తగ్గించాని నిర్ణయించారు. సోలార్‌, విండ్‌, గ్యాస్‌ విద్యుత్‌

ఉత్పత్తి అదనంగా చేయాలని నిర్ణయించారు. అణువిద్యుత్‌ à°’à°• యూనిట్‌ ధర రూ.12/`లు పైగా వుంటుందని అంచనా. భారతదేశం ఆర్ధిక మాంద్యం ఎదుర్కొంటున్న సమయంలో కేవలం 2234

మెగావాట్లకు రూ.84వేల కోట్లు (12 బిలియన్‌ డార్లు) విద్యుత్‌ కర్మాగారం నిర్మించడానికి ఖర్చు పెట్టవలసి వుంది. à°ˆ పెట్టుబడులు దేశంలోని వ్యవసాయం, పరిశ్రమలు అభివృద్ధి

చేయడానికి పెడితే భారత జి.à°¡à°¿.పి రేటు బాగా పెరుగుతుందన్నారు. 
    మా ఇంటికొస్తే ఏం తెస్తావ్‌.....మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్‌. ఇదీ అమెరికా సిద్ధాంతం. అమెరికా

భారతదేశానికి ఏనాడు ఆపదలో కూడా కనీసం ఆహార దిగుమతుల్లో కూడా సహకరించలేదని ఆవేదన వ్యక్తం చేసారు. 1960లో పిఎల్‌ 420 పేరుతో అమెరికా సముద్రంలో పారవేసే పుచ్చిన గోధుమలు

మనకు దిగుమతి చేశారు. పెన్సిలిన్‌ మందు ఇవ్వడానికి కూడా నిరాకరించింది. రష్యా ఆర్ధిక సాంకేతిక సహయంతో మనం మందుల కంపెనీలు ఐడిబిఎల్‌ నిర్మించుకున్నాం.

సోషలిస్టు దేశాల సహాయంతోనే భారతదేశ పరిశ్రమలన్నీ అభివృద్ధి చెందాయి. స్వయం సంమృద్ధి సాధించామన్నారు.  

     à°…మెరికాలో వృదాగా పారవేస్తున్న కోడి కాళ్లను

భారత్‌కు దిగుమతి చేయడానికి, భారత్‌ను డంపింగ్‌యార్డుగా ఉపయోగించాలనేది ట్రంప్‌ ప్రయత్నం. అమెరికాలో అత్యధికంగా ఉత్పత్తి అవుతున్న పాలు, పాల ఉత్పత్తులను

మనదేశానికి దిగుమతి చేయాలని 2019లో అమెరికా వెళ్లిన మోడీపై ఒత్తిడి తెచ్చాడు. కాని ఆనాడు ఒప్పందం జరగలేదు. ఇప్పుడు మోడీని ఒప్పంచి పాల ఉత్పత్తులు డంపింగ్‌ చేయాలని

ఒప్పందం చేయబోతున్నారు. ఇప్పటికే దివాళా తీస్తున్న వ్యవసాయరంగంపై à°ˆ ఒప్పందాలు పెనుభారంకాక తప్పదు. భారత ప్రయోజనాలకు భిన్నంగా ఎటువంటి ఒప్పందాలు చేసినా యావత్‌

ప్రజానీకం నిరశించాని సిపిఎం కోరుతున్న దన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam