DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*టిట్ ఫర్ టాట్: నాడు బాబు, నేడు వైఎస్ జగన్ అంతే. . .*

2017 నాటి ఘటనే 2020 à°²à±‹ రిపీట్ అవుతోందా?

2017 బాబు చేసిన పనే. . నేడు జగన్ చేస్తున్నారా?

విమానాశ్రయం బయటే నిలిచిపోయిన బాబు కాన్వాయ్ 

నువ్వా -  à°¨à±‡à°¨à°¾ పోరాటంలో

చంద్రబాబు కొంత విజయం 

పార్టీల హంగామాలో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2020

(డిఎన్‌ఎస్‌) : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటన కోసం గురువారం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. టిట్ ఫర్ టాట్

 à°¸à°°à°¿à°—్గా రెండేళ్ల క్రితం 2017 జనవరి 26 à°¨ విశాఖపట్నం విమానాశ్రయం లో అడుగు పెట్టిన నాటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని బయటకు రానివ్వకుండా భారీ పోలీసు

బందోబస్త్ తో రన్వే పైనే అడ్డుకుని వెనక్కి పంపిన ఘనత నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుది, అయితే సరిగ్గా అదే శీను మూడేళ్ళ తర్వాత రిపీట్ అవుతోంది. 2020 ఫిబ్రవరి 27 న అదే

విమానాశ్రయం లో  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°· నాయకుడు చంద్రబాబు నాయుడు అడుగు పెట్టగానే కాన్వాయ్ ను వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తీవ్ర స్థాయి లో అడ్డుకున్నారు. అక్కడే

టమోటాలు, కోడిగ్రుడ్లు, చెప్పులు విసిరేందుకు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు సిద్ధపడ్డారు. అయితే వాటిని తెలుగుదేశం శ్రేణులు సమర్ధవంతంగా అడ్డుకోవడం

జరిగింది. 

నువ్వా -  à°¨à±‡à°¨à°¾ పోరాటంలో చంద్రబాబు కొంత విజయం సాధించినట్టు తెలుస్తోంది. నాడు వైఎస్ జగన్ విమానాశ్రయం నుంచే బయటకు రాలేకపోయారు, నేడు చంద్రబాబు

విమానాశ్రయం నుంచి బయటకు వచ్చి, తన కారు ఎక్కగలిగారు. 

జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్: . . . 

అధికార ప్రతిపక్ష పార్టీల నువ్వా నేనా హంగామాలో

విమానాశ్రయం వద్ద గల జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఉదయం 9 :30 గంటల నుంచి రెండు పార్టీల కార్యకర్తలు రోడ్డుపైనే బైఠాయించడం తో సామాన్య జనం నానా

అవస్థలు పడ్డారు. విమానాశ్రయం నుంచి బయటకు వెళ్ళవలసిన ప్రయాణీకులు చుక్కలు చూస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam